ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని లింకులు
చి Wikipedia python library
పంక్తి 8:
 
 
1974లో కృష్ణ పట్టుదలతో [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] రచించిన [[మాలపల్లి]]ని, వందమంది కళాకారులు, సహజమైన సెట్టింగులతో నాటకంగా రూపుదిద్ది, ఒకే వేదికపై వరుసగా ముప్పదిసార్లు, భారతదేశమంతటా వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. తెలుగువారి జానపద కళా స్వరూపమైన [[తోలుబొమ్మలాట]]ను పునరుద్ధరించి ఆ కళా ఔన్నత్యాన్ని విదేశాలలో చాటాడు. నాట్యకళపట్ల ప్రేక్షకులలో అభిమానం పెంచడానికి, వారి ఆదరణ, పోషణ కల్పించడానికి "నాట్యమిత్ర పధకం" ప్రవేశపెట్టి నాటకాభిమానులను సభ్యులుగా చేర్పించాడు. వృత్తికళాకారుల సంక్షేమానికి 1971లో రంగస్థల కళాకారుల సంఘం స్థాపించాడు. ఔత్సాహిక కళాకారుల శ్రేయస్సుకై వారి సంఘమూ ఏర్పాటుచేయించాడు. [[యక్షగానం|యక్షగానాని]]కి రంగస్థలముపై ప్రాణప్రతిష్ఠ చేసాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట.147</ref>.
 
తన ఆశయాల సాధనలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న కృష్ణను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
"https://te.wikipedia.org/wiki/ఎ.ఆర్.కృష్ణ" నుండి వెలికితీశారు