ఎ.కె.47: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రష్యా అవిష్కరణలు తొలగించబడింది; వర్గం:రష్యా ఆవిష్కరణలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయో...
చి Wikipedia python library
పంక్తి 27:
}}
 
ఎ.కె. 47 అంటే తెలియని వారుండరు. అది ఒక తుపాకీ పేరు. ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాల్లో ప్రాచుర్యం పొందిన ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ రూపశిల్పి మిహాయిల్ కలష్నికోవ్ (94) సోమవారం రష్యాలోని ఉద్ముర్షియా ప్రాంతంలో కన్నుమూశారు.
 
సోవి యట్ యూనియన్ హయాంలో ఏకే-47 రూపొందించి నందుకు కలష్నికోవ్ జాతీయస్థాయిలో గౌరవాదరణలు పొందారు. ‘అవ్తొమాత్ కలష్నికోవ్’ రైఫిల్‌ను మిహాయిల్ కలష్నికోవ్ 1947లో రూపొందించడంతో ఈ రైఫిల్‌కు ఏకే-47 అనే పేరు వచ్చింది. పలు దేశాల సాయుధ బలగాలతో పాటు ఉగ్రవాదులు, తీవ్రవాదులు సైతం ఏకే-47 రైఫిళ్లను నేటికీ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 కోట్లకు పైగా ఏకే-47 రైఫిళ్లు వాడుకలో ఉన్నట్లు అంచనా. కాగా, సైబీరియాలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కలష్నికోవ్ తొలుత రైల్వే క్లర్క్‌గా పనిచేశారు. తర్వాత 1938లో రెడ్ ఆర్మీలో చేరిన తర్వాత సోవియెట్ యుద్ధట్యాంకుల ఆధునికీకరణ వంటి పనుల్లో కీలకపాత్ర పోషించారు. నాజీ బలగాలతో 1941లో జరిగిన పోరులో గాయపడ్డ కలష్నికోవ్, ఆస్పత్రి నుంచి బయటపడ్డాక ఐదేళ్లు శ్రమించి ఏకే-47 రైఫిల్‌కు రూపకల్పన చేశారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఎ.కె.47" నుండి వెలికితీశారు