ఒడియా భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q33810 (translate me)
చి Wikipedia python library
పంక్తి 12:
}}
 
'''ఒరియా''' ('''ଓଡ଼ିଆ''' ''{{IAST|oṛiā}}'') , [[భారతదేశము|భారతదేశానికి]] చెందిన [[ఒరిస్సా]] రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణముగా ఒడియా అని అంటారు. ఒరియా [[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము|ఇండో-ఆర్యన్ భాషా కుటుంబా]]నికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వము తూర్పు భారతదేశములో మట్లాడుతున్న [[మాగధి]] లేదా [[పాళీ]] అనే [[ప్రాకృత భాష]] నుండి నేరుగా ఉద్భవించినదని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన [[బెంగాళీ]], అహోమియా ([[అస్సామీ]]) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై [[పర్షియన్]] మరియు [[అరబిక్]] భాషల ప్రభావము చాలా స్వల్పము.
 
ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము కలదు. 14వ శతాబ్దములో నివసించిన [[సరళ దాస్]], ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ మరియు 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో [[ఉపేంద్ర భంజ]] కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో [[ఫకీర్ మోహన్ సేనాపతి]], [[మనోజ్ దాస్]], కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, మరియు గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.
 
ఒరియా సాంప్రదాయకముగా [[బౌద్ధమతము|బౌద్ధ]] మరియు [[జైన మతము|జైన మతాల]]చే ప్రభావితమైనది. ఒరియాను [[ఒరియా లిపి]]లో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒరిస్సాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒరిస్సా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.
 
== బయటి లింకులు ==
* [http://www.odia.org ఒడియా.ఆర్గ్, ఒరియా వార్తలు]
* [http://www.iit.edu/~laksvij/language/oriya.html ‌రోమన్ లిపి నుండి ఒరియా యూనికోడ్ ట్రాన్స్‌లిటరేటర్]
{{భారతీయ భాషలు}}
"https://te.wikipedia.org/wiki/ఒడియా_భాష" నుండి వెలికితీశారు