కన్ను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Eye iris.jpg|thumb|200px|మానవుని కన్ను]]
'''కన్ను''' (Eye) [[కాంతి]]ని గుర్తించి నేత్ర నరాల ద్వారా [[మెదడు]]కు సమాచారాన్ని అందించే అవయవం. ఇవి మానవులలో ముఖ్యమైన [[జ్ఞానేంద్రియం]]. మానవునికి [[ముఖం]]లో రెండువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి మనుషులలో [[కెమెరా]] వలె పనిచేసి, బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా మెదడుకి పంపుతాయి.
[[File:Kannu-Te.ogg]]
వివిధ జీవులలో నిర్మాణాత్మకంగా పది వేరువేరు డిజైన్లలో కళ్ళుంటాయి. వీనిలో 96% జంతు జాతులలో ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది.<ref name=Land1992>
పంక్తి 11:
| volume = 15
| pages = 1–29
}}</ref> ప్రతిబింబాన్ని స్పస్టంగా చూపించే కళ్ళు [[నిడేరియా]], [[మొలస్కా]], [[కార్డేటా]], [[అనెలిడా]] మరియు [[ఆర్థ్రోపోడా]] జీవులలో కనిపిస్తాయి.<ref name=Frentiu2008>{{citation
| doi = 10.1002/bies.20828
| title = A butterfly eye's view of birds
పంక్తి 21:
| pages = 1151}}</ref>
 
జీవులన్నింటిలోకెల్లా సరళమైన కళ్ళు సూక్ష్మజీవులలో ఉంటాయి. ఇవి పరిసరాలలో కాంతి ఉనికి గుర్తించి [[వెలుగు]] [[చీకటి]] ల మధ్య భేదాన్ని మాత్రమే తెలియజేస్తాయి. వీటి ఆధారంగా జీవ వలయాలు (Circadian rhythm) నిర్దేశించబడతాయి. క్లిష్టమైన జీవులలోని కళ్ళు రెటినాలోని కణాల ద్వారా సమాచారం మెదడుకు చేరుతుంది.
 
== మానవుని కన్ను నిర్మాణం ==
పంక్తి 68:
 
== [[నేత్రదానం]] ==
ప్రస్తుతం మనదేశంలో 12 లక్షల మందికి [[కార్నియా]]లు (నల్లగుడ్డ) అవసరం. వీరితోపాటు ప్రతి సంవత్సరం మరో 40 నుంచి 50 వేల మందికి అదనంగా అవసరం వస్తోంది. కంటిలో అన్ని భాగాలు బాగా ఉండి కేవలం నల్లగుడ్డు దెబ్బతిని అంధత్వం వచ్చిన వారికి నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాలు అమర్చుతారు. తర్వాత వారు అందరిలా చూడగలుగుతారు. నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు ఫోన్‌ చేస్తే వారే అక్కడకు వచ్చి నేత్రాలను సేకరిస్తారు. వాటిని అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ విధానం అంతా పైసా ఖర్చులేకుండా ఉచితంగా చేస్తారు. సేకరించిన నేత్రాలు తమ దగ్గర ఉన్న జాబితాలోని వ్యక్తులకు సరిపడకపోతే ఇతర ఐ బ్యాంకులకు పంపిస్తారు. కార్నియా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. కంటి శుక్లాల ఆపరేషన్‌ చేయించుకొన్నవారు, రక్తపోటు ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, కళ్ళజోడు పెట్టుకొనేవారు, ఉబ్బసం వ్యాధి ఉన్నవారు కూడా చేయవచ్చు. హెచ్‌.ఐ.వి., ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారు, పచ్చకామెర్లుకు గురైన వారు, రేబీస్‌(కుక్కకాటు వలన) వ్యాధిగ్రస్తులు, బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నవారు, మెదడువాపు జబ్బు ఉన్న వారు, కార్నియల్‌ మచ్చలు, రెటినోబ్లాస్టోమా ఉన్నవారు నేత్రదానం చేయకూడదు.
* నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తులో ప్రమాణ పత్రాన్ని పూర్తిచేసి ఇవ్వాలి. దానిమీద నేత్రదానం చేసే వ్యక్తికి చెందిన ఇద్దరు కుటుంబసభ్యులు సాక్షి సంతకం పెట్టాల్సి ఉంటుంది. వారికి గుర్తింపు కార్డులు అందజేస్తారు.
* వ్యక్తి మృతిచెందిన వెంటనే నేత్రదానం చేస్తామని ఆ కుటుంబ సభ్యులు సంబంధిత ఆసుపత్రులకు తెలియజేయాలి.
"https://te.wikipedia.org/wiki/కన్ను" నుండి వెలికితీశారు