కమలాదేవి ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కమలాదేవి ఛటోపాధ్యాయ
| residence =
| other_names =
| image = Kamaladevi chatopadhyaya.jpg
| imagesize = 200px
| caption = కమలాదేవి ఛటోపాధ్యాయ
| birth_name = కమలాదేవి ఛటోపాధ్యాయ
| birth_date = [[ఏప్రిల్ 3]], [[1903]]
| birth_place = [[మంగళూరు]] , [[కర్ణాటక]],[[తమిళనాడు]]
| native_place =
| death_date = [[అక్టోబర్ 29]], [[1988]]
| death_place =
| death_cause =
| known = సంఘసంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు
| occupation =
| title =
పంక్తి 24:
| religion =
| wife =
| spouse= కృష్ణారావు (1917-1919)<br>[[హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ]] (1923-?)
| partner =
| children = రామకృష్ణ ఛటోపాధ్యాయ
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
కమలాదేవి [[మంగళూరు]] కు చెందిన సంపన్న సారస్వత్‌ బ్రాహ్మణ విద్వాంసుల కుటుంబంలో, అనంతయ్య ధారేశ్వర్‌ , గిరిజాబాయి దంపతుల నాల్గవ కుమార్తెగా [[ఏప్రిల్ 3]], [[1903]] న జన్మించింది. తండ్రి మంగళూరు జిల్లా కలెక్టరుగా వుండేవారు. తల్లి కర్నాటకలోని ఉన్నత కుటుంబానికి చెందినది. కమలాదేవికి ఏడేళ్ల వయలోనే 1910లో అకస్మాత్తుగా తండ్రి వీలూనామా కూడా వ్రాయకుండా మరణించడంతో, ఆస్తి మొత్తం సవతి సోదరుని పరమై, కుటుంబం కష్టాల పాలయ్యింది.<ref>[http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographyChattopadhyayKam.htm BIOGRAPHY of Kamaladevi Chattopadhyay at Ramon Magsaysay]</ref> గిరిజాబాయికి ఆస్తి దక్కలేదు. తన బాధ్యతలను వీలైనంత త్వరగా తీర్చుకోవటానికి విధవరాలైన తల్లి కమలాదేవికి 14వ ఏట, 1917లో కృష్ణారావుతో వివాహం జరిపించింది.<ref>[http://www.kamat.com/kalranga/people/pioneers/kamaladevi.htm Kamaladevi Chattopadhyaya by Jyotsna Kamat in Kamat's Potpourri]</ref> రెండేళ్లలోనే 1919 లో భర్త మరణించడంతో తనూ విధవరాలైంది. ప్రతిభాశాలి అయిన కమలాదేవి, వితంతువుకు చదువు అనవసరమని అడ్డుకున్నా, నిర్భీకత తో వారిని ధిక్కరించి [[చెన్నై]]లోని సెంట్‌ మేరి పాఠశాలలో చేరి ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసింది. అక్కడున్నపుడే [[హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ]] ను పెళ్ళాడి, వితంతు వివాహం చెల్లదన్న వాదాన్ని తిప్పికొట్టింది. హరీన్‌, కమల దంపతులకు రామకృష్ణ ఛటోపాధ్యాయ అనే కొడుకు పుట్టాడు. వివాహం తర్వాత దంపతులు [[లండన్]] చేరారు. కమలా దేవి బెడ్‌షోర్‌ కళాశాలలో చదివి, సోషియాలజీలో డిప్లొమా అందుకొన్నది. హరీన్‌తో ఎక్కువకాలం మనలేదు. కమలాదేవి దిక్కులేని ఒక మహిళను చేరదీసి కొడుకును చూసుకునే పనికి నియమించగా, హరీన్ ఆమెతో వైవాహికేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అది తెలుసుకొన్న కమలాదేవి వివాహబంధాన్ని తెంపేసింది.<ref>[http://www.mainstreamweekly.net/article364.html Mainstream, October 13, 2007]</ref> వీరిద్దరి విడాకులు భారతదేశంలో చట్టపరంగా విడాకులు మంజూరు చేయబడిన తొలి సంఘటనల్లో ఒకటిగా నమోదయ్యింది.
 
==స్వాతంత్ర్యోద్యమంలో==
ఈమె తల్లిదండ్రులు నాటి జాతీయ నాయకులైన [[మహదేవ గోవింద రనాడే]], [[గోపాలకృష్ణ గోఖలే]], [[రమాబాయి రనాడే]], [[అనిబీసెంట్]] లతో సన్నిహితంగా వుండేవారు. 1923లో [[మహాత్మా గాంధీ]] పిలుపు అందుకొని [[సహాయ నిరాకరణోద్యమం|సహాయ నిరాకరణ ఉద్యమం]] సేనాదళ్‌ సంస్థలో పనిచేసింది. పెక్కు విదేశాలలో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితి గతులు, విద్యాసంస్థలు మున్నగు వాటిని పరిశీలించింది. 1930లో గాంధీజీ ప్రారంభించిన [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నది. 1930లో జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని, పోలీసులు అడ్డుకొన్నా, ఎగురవేసిన సాహసనారి కమలాబాయి. ఈమె [[జయప్రకాశ్ నారాయణన్‌]], [[రామ్‌మనోహర్ లోహియా]]ల సోషలిస్టు భావాల వ్యాప్తికి కృషి చేసింది. దేశ విభజనానంతరం [[ఢిల్లీ]] సమీపంలోని ఫరీదాబాద్‌లో [[పాకిస్తాన్‌]] నుంచి వలస వచ్చిన 50వేల మహిళలకు వసతి, ఆరోగ్య సౌకర్యం ఏర్పాటు చేసింది.<ref>[http://www.visalaandhra.com/women/article-16717 సాహసనారి కమలాదేవి ఛటోపాధ్యాయ - విశాలాంధ్ర జూన్ 23, 2010]</ref>
==సినిమా నటిగా==
ఆమె నటనలో కూడా దిట్ట. కమలాదేవి ప్రాచీన సంస్కృతనాటకాలను, పద్మశ్రీ [[మహామాధవ చాకియర్]] వద్ద గురుకుల పద్ధతిలో అభ్యసించింది. నాటకాల్లోనే కాక, వసంత సేన, తాన్‌సేన్‌ ([[కె.ఎల్‌.సైగల్‌]] సహనటుడు), శంకరపార్వతి (1943), ధన్నాభగత్‌ (1945) సినిమాల్లో నటించి పేరు గడించింది.
==హస్తకళల అభివృద్ధిలో==
1939 లో ఇండియన్‌వుమెన్‌, జాతీయ నాటకరంగం మున్నగు రచనలు చేసింది. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, సంగీత నాటక అకాడమీ, కేంద్ర కుటీర పరిశ్రమల ప్రదర్శనశాల, క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మున్నగు సంస్థలకు శ్రీకారం చుట్టిన మేధావి కమలాదేవి. హస్తకళల ఆవశ్యకతను, సహకార సంస్థల ద్వారా సామాన్య ప్రజల సాంఘిక, ఆర్థిక ప్రగతి సాధించగలమన్న ఆశయంతో స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం తర్వాత ఈమె విశేష కృషి చేసింది.