కమ్మనాడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q13640762 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
'''కమ్మనాడు''' '''కమ్మరాష్ట్రం''' అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము [[నెల్లూరు]], పడమర [[శ్రీశైలం]], ఉత్తరం [[ఖమ్మం]] హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము ([[సంస్కృతము]]) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో [[బౌద్ధమతము]] క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.
 
 
పంక్తి 6:
==శాసనములు==
 
1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని [[బేతవోలు]] ([[జగ్గయ్యపేట]]) శానములో గలదు (3వ శతాబ్దము).
 
2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని [[చెందులూరు]] గ్రామశాసనములో దొరికినది.
పంక్తి 12:
3. మూడవ ఆధారము [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] రాజు మంగి యువరాజ (627-696) శాసనము:
 
''శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే''
 
4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి.
పంక్తి 18:
5. [[రాజరాజ నరేంద్రుడు|రాజరాజనరేంద్రుని]] సమకాలీకుడగు [[పావులూరి మల్లన]] (1022-1063) ఈ విధముగా వ్రాసెను:
 
''ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్''
 
6. [[తెలుగు చోడులు|తెలుగు చోడుల]] మరియు [[కాకతీయులు|కాకతీయుల]] శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన ([[కొణిదెన]]) రాజధానిగా పాలించుచుండెను.
 
 
కాకతీయుల, ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని [[కమ్మ]] అను పదము మాత్రము ఒక సామాజిక వర్గము ([[కులము]])నకు పేరుగా మిగిలిపోయినది.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/కమ్మనాడు" నుండి వెలికితీశారు