కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాయలసీమ కళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 8:
కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన [[మచిలీపట్నం]] ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేకపోయినా [[గోల్కొండ]] ప్రభువులతో సంబంధాలు ఉండటంవలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. గోల్కొండ ప్రభువులైన కుతుబ్ షాలు కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. [[ఈజిప్టు]]లో [[కైరో]] వద్దగల ఫోస్టాట్ అనే ప్రదేశం వద్ద పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపే వరకూ భారతదేశంలో వస్త్రాలపై కళాఖండాలను చిత్రించే సంస్కృతి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ తవ్వకాల్లో వివిధ చిత్రాలతో కూడిన్ భారతదేశ నూలు వస్త్రాలు కనిపించాయి. ఈ వస్త్రాలను 18వ శతాబ్దంలో పశ్చిమ తీరం ద్వారా ఆ దేశాలను ఎగుమతి అయిఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.
 
కలంకారీ ఉత్పత్తులు మార్కెట్ అవసరాలను బట్టి వివిధ రూపాలలో తయారవుతుంటాయి. ప్రార్థనా వస్త్రాలు, దుప్పట్లు, దిండు గలీబులు, ప్రవేశ ద్వార వస్త్రాలు జంతురూపాలు, వివిధ పుష్పాలతో కూడిన డిజైన్లు మొదలైనవి మధ్య ఆసియా మార్కెట్ కోసం తయారు చేస్తే, కుట్టుపనిని పోలి ఉండే జీవమున్న చెట్లు లాంటి డిజైన్లు ఐరోపా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు. దుస్తులకు అవసరమైన అంచులు, మరియు గోడలకు వేలాడదీయగలిగే చిత్ర పటాలు ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ధరించే వస్త్రాలకు అవసరమయ్యే డిజైన్లు తూర్పు ఆసియాకు ఎగుమతి అవుతుంటాయి.
 
సుగంధ ద్రవ్యాల వ్యాపారస్థులు [[వస్తుమార్పిడి పద్దతి]] ప్రకారం తమ వ్యాపారం కోసం భారతీయ వస్త్రాలను ముఖ్యంగా కళంకారీ వస్త్రాలను వాడేవారు. ముఖ్యంగా ఈ కళంకారిలో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానంలో వాడే [[రంగులు]] అన్నీ సహజసిద్ధమైన రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏ విధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు) ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.
 
19వ శతాబ్దపు ఈ కళాకారుల్లో ఎక్కువగా [[బలిజ]] కులస్తులే ఉండేవారు. వీరు సాంప్రదాయంగా వ్యవసాయంపై మరియు కుటీర పరిశ్రమలపై ఆధారపడి నివసించేవారు. ప్రస్తుతం కాళహస్తి చుట్టు పక్కలా సుమారు మూడు వందలమంది కళాకారులు వస్త్రాలను, రంగులను తయారు చేయడం, మొదలైన కళంకారీకి సంబంధించిన వివిధ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. 20 వ శతాబ్దం మధ్యకు వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయం వైపు లేదా ఇతర పనుల వైపు మళ్ళడంతో శ్రీకాళహస్తిలో ఈ కళ చివరకు అదృశ్యమయ్యే స్థాయికి చేరుకుంది. 1950లలో [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] అనే కళా ఉద్యమకారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి శ్రద్ధ తీసుకోవడంతో పునరుజ్జీవనం పొందింది.
 
==చిత్రించే విధానం==
"https://te.wikipedia.org/wiki/కలంకారీ" నుండి వెలికితీశారు