కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 35:
| weight =
}}
ప్రేక్షకుల దగ్గర్నుంచి అమితమైన అభిమానం సంపాదించిన తొలి హస్యనటుడు '''కస్తూరి శివరావు'''. శివరావుకి సినిమాల్లో వేషాలు వెయ్యకముందే నలుగురులో మంచి పేరు వుండేది. అతను మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు. ఆ వ్యాఖ్యానం సరసోక్తులతో, చమత్కారాలతో, ఉత్సాహభరితంగా వుండేది. ‘వ్యాఖ్యాత శివరావు’ అని ప్రచారం ఇస్తే జనం పెరిగేవారు. సినిమా పూర్తయిన తర్వాతనో, మధ్య విరామంలోనో - వ్యాఖ్యానం చెబుతున్న శివరావు ఎలావుంటాడో చూడాలని జనం ఎగబడేవారు. ఐతే, అప్పటింకా ఆటోగ్రాఫులు అడగడాలు కరచాలనాలూ రాలేదు.
==సినీ జీవితం==
[[1913]]లో [[మార్చి 6]]న [[కాకినాడ]]లో జన్మించిన శివరావు నాటకాల్లో హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు. [[వరవిక్రయం]] (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. [[చూడామణి]] (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో బాగాపడి, ‘శివరావు’ తెలిసాడు. తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా, [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] (1945) తో ఇంకా బాగా తెలిసాడు. [[బాలరాజు]] (1948) తో ఇంకా బాగా తెలిసి పెద్ద నటుడైపోయి, జనాన్ని వెంట పరిగెత్తించుకున్నాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అందులోని శివరావు నటనా, అతని పాటలూ ప్రేక్షకజనాన్ని బాగా ఆకర్షించాయి.
"https://te.wikipedia.org/wiki/కస్తూరి_శివరావు" నుండి వెలికితీశారు