కారు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రయాణ సాధనాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
 
[[Image:MHV Maruti Suzuki 800 01.jpg|300px|right|thumb| ప్రస్తుతం వాడబడుతున్న కారు]]
'''కారు''' ([[ఆంగ్లం]] Car) అనే పదం ''మోటారుకారు'' కు వాడుక పదం. కారునే ''ఆటోమొబైల్'' అని కూడా అనవచ్చును. ''ఆటోమొబైల్'' అనే పదానికి అర్థం తనకు తానుగా కదిలే వాహనం అని. ఈ పదానికి మూలాలు గ్రీకు భాషలోని ''ఆటో'' (తనకు తాను) మరియు లాటిన్ భాషలోని ''మొబిలిస్'' (కదులుట) అనే రెండు పదాలతో ముడిపడి ఉన్నాయి. కారు [[మోటారు]]తో నడిచే [[చక్రం|చక్రాలు]] కలిగిన [[వాహనం]]. నిర్వచనాల ప్రకారం ఆటోమొబైల్ ఒకటి నుండి ఎనిమిది మంది కూర్చొనడానికి వీలుగా ఉండి 4 చక్రాల సహాయంతో మానవుల రవాణాకు మాత్రమే ఉపయోగపడే ఒక వాహనం. <ref>{{cite book | title=పాకెట్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ|year=1976 |publisher=ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్|location=లండన్|id=ISBN 0-19-861113-7}}</ref> కాని, చాలా రకాల వాహనాలు చాలా పనులకొరకు ఉపయోగించబడుతున్నాయి, కనుక ఆటోమొబైల్‌కు పై నిర్వచనం కొన్ని సార్లు వర్తించకపోవచ్చు.
==ఆవిష్కరణ==
1769లో మొట్టమొదటి తనకుతాను నడిచే వాహనాన్ని కనుగొన్నట్టుగా నికోలస్-జోసెఫ్ కగ్నాట్‌ను పేర్కొంటారు. కాని కొంతమంది ఈయన తయారు చేసిన మూడు చక్రాల వాహనం అసలు నడవలేదని చెప్తారు. మరికొంతమంది ఫెర్డినాడ్ వెర్బీస్ట్ అనే ఆయన ఆవిరితో నడిచే కారును 1672 లో కనుగొన్నట్టు చెప్తారు.<ref>{{cite web
పంక్తి 41:
==బెంజ్ ఆవిష్కరణ==
[[దస్త్రం:CarlBenz.jpg|right|150px|thumb|కార్ల్ బెంజ్]]
బెంజ్ ఒక రైల్వే కార్మికుని కొడుకు. చిన్నప్పుడే తండ్రి చనిపోవటం వల్ల తల్లిని పోషించే భారం ఇతనిపై పడింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి లోంచి బయటపడి స్వంతంగా ఒక చిన్న పర్క్ షాపు స్థాపించుకోవటానికి అతడు చాలా ఏళ్ళు శ్రమ పడ్డాడు. [[సైకిల్]] నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక రవానా సాధనాలను యంత్ర సహాయంతో ఎలా మెరుగు పరచటమో అని దీర్ఘంగా ఆలోచించసాగాడు. లెనాయిర్ వాయు ఇంజన్ ని చూశాక డేమ్లర్ లాగా పెట్రోలుని ఇంధనంగా వాడవచ్చునన్న ఆలోచన తట్టింది. ఇలా చేయటం చౌకగా ఉంటుంది కూదా.
 
బెంజ్ నిర్మించిన కొత్త నమూనా ఇంజన్ తో బాటు 1877 లో జేమ్స్ స్టార్లీ కనుగొన్న దిఫరెన్షియల్ గేర్ అనే సాధనాన్ని కూడా తన మూడు చక్రాల కారు నిర్మాణంలో అమర్చాడు. రోడ్డు వంపు ఎక్కువగా ఉండే సందర్భాల్లో లోపలి చక్రాల కంటె బయటి చక్రాల వేగం అధికంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఈ కొత్త గేర్ విధానం బాగా ఉపకరిస్తుంది. కారును ఇటూ అటూ తిప్పడానికి డ్రైవర్ సీటు వద్ద ఒక చిన్న చక్రాన్ని కూడా అమర్చాడు. 1885 లో ఒక రోజు అతని వర్క్ షాపు కి దగ్గరి మైదానం చుట్టూ కొత్త కారులో ఒకసారి తిరిగేసరికి గర్వంతోనూ, సంతోషం తోనూ బెంజ్ ఉబ్బి తబ్బిబ్బయ్యడు. కానీ పట్టరాని ఆ భావోద్వేగంతో కారు గోడకు ఢీ కొట్టడంతో మొదటి ప్రయోగం విఫలమైంది. ఇది వరకటి నమూనాను కొద్ది మార్పులతో మళ్ళీ నిర్మించి 1887 పారిస్ ప్రదర్శనలో చూపెట్టాడు. గానీ దీన్ని గురించి ఎవరూ అంతటా పట్టించుకోలేదు. ఒక సంవత్సరం తరువాత మూనిచ్ నగర వీధుల్లో దీన్ని నడుపుకుంటూ వెళ్ళినపుడు గొప్ప సంచలనం చెలరేగింది. అనేక దేశాల నుంచి మోటార్ కారుల కోసం విజ్ఞప్తులు కోకొల్లలుగా వచ్చాయి. మ్యూనిచ్ నుంచి మాన్ హీం కి బెంజ్ తిరిగి వచ్చేలోగా మరో "సంఘటన" జరిగిపోయింది. 15,13 సంవత్సరాలు వయస్సు గల అతని ఇద్దరు కొడుకులు వాళ్ళ అమ్మని పోర్ట్ హీమ్‍ కి తీసుకెళ్ళి వెనక్కి రావటమే కాకుండా దారిలో అవసరమైన కొన్ని మరమ్మత్తులు కూడా చేసేసారట! మోటారు కారుతో 125 మైళ్ళు ప్రయాణం చేయటం గతంలో ఎప్పుడూ జరగలేదు. కారులో అంతదూరం వెళ్ళడం నిజంగానే "పిల్లాట"" అయిపోయింది.
పంక్తి 48:
 
==అమెరికాలో కార్లు==
మొదటి మోటార్ కారు చూడటానికి అమెరికా కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. అంరికా రోడ్డుపై పెట్రోలుతో నడిచే మొదటి వాహనం 1893 లో నిర్మించబడింది. చార్లెస్ డూరియా అనే మెకానిక్ దానిలో ప్రయానం చేశాడు. గానీ అతనికి వేగంపై అదుపు లేకుండా పోయింది. అతడు నిర్మించిన తరువాత నమూనాలు మెరుగ్గా ఉండటమే కాకుండా పోటీలలో ఇతర దేశాల వాహనాల కంటె వేగంగా వెళ్ళ గలిగాయి.
 
అమెరికా దేశపు మోటార్ కార్ల రాజధానిగా ప్రసిద్ధి చెందిన టెట్రాయిట్ నగరంలో మొట్టమొదటి మోటార్ కారుని హెన్రీ ఫోర్డ్ అనే ఎలక్ట్రీషియన్ 1896 లో నిర్మించి తానే నడిపాడు. ఇతడు సమర్థవంతమైన మెకానిక్. చిన్న వయస్సునుంచే మంచి ఊహాశక్తి, జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన ఉండేవాడు. అతి వేగంగా పెరుగుతున్న సంపద, సువిశాల దూరాలు కలిగి అమెరికా దేశం ఎన్ని మోటార్ కారులనైనా వాడటానికి వీలుందని అతడు దృఢంగా విశ్వసించేవాడు. కానీ గుర్రాల వ్యాపారులు, వాటిని మేపేవాళ్ళు, కమ్మరులు, గడ్డి వ్యాపారులు అప్పటి రవాణా భారాన్నంతా పోస్తున్న గుర్రాలపై ఆధారపడి జీవన యాత్ర చేసేవాళ్ళు. కాబట్టి వాడకానికి తీవ్రమైన వ్యతిరేకత ప్రదర్శించారు.
==ఫోర్డ్ కారు==
కొత్త విషయాలను కనుక్కోవటం కన్నా ఉన్నవాటిని మెరుగు పరచటంలోనూ సంధలను నిర్వహించటంలోనూ ఫోర్డ్ కి ఎక్కువ ఆశక్తి ఉండేది. యూరప్ ఖండంలో వాడే కార్లలోని ప్రధాన దోషాలెమిటో అతడు కనుక్కోగలిగాడు. అక్కడి కార్లన్నీ క్రీడాకారుల కోసం,ఔత్సాహిక యువకుల కోసమే గాని నిత్యజీవితంలో అహర్నిశలు శ్రమించే సామాన్య పౌరుని అవసరాల్ని తీర్చలేకపోయాయి. కొనటానికి చౌకగా, వాడటానికి పొదుపుగా ఉంటూ సమర్థవంతంగానూ, దోష రహితంగానూ ఉండే రవాణా సాధనం అమెరికా ప్రజలకు అత్యంతావశ్యకమని భావించిన హెన్రీ ఫోర్డ్ "టిన్ లిజీ" అనే మోటారు కారు నమూనాను తయారుచేశాడు. దీంతో అతడు కోట్లాది డబ్బు ఆర్జించటమే కాకుండా ప్రపంచమంతటా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు.
 
మోటారు కార్ల ఉత్పత్తి కోసం ఒక పెద్ద ఫ్యాక్టరీ ని నిర్మించాడు. దీని పొడవు దాదాపు పాతిక మైళ్ళు ఉంటుంది. పెద్ద ఎత్తున కార్లను నిర్మించటానికి కన్వేయర్ బెల్ట్ పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టాడు. 1908 లో ఫోర్డ్ తయారుచేసిన టిన్‍లిజీ నమూనాని ఇప్పుడుచూస్తే చాలా మొరటుగానూ, విచిత్రంగానూ కనిపించవచ్చు. కానీ ఇది అమెరికా పురోగమనానికి ఎంతగానో దోహదపడిందన్న వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి 1908 నుంచి 1927 వరకు 15 మిలియన్ల కార్లను ఉత్పత్తి చేశాక నమూనాను మార్చాల్సిన ఆవశ్యకత ఉందని ఫోర్డ్ గ్రహించాడు.
పంక్తి 81:
</gallery>
<!--
2002 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 590 మిలియన్ పాసింజర్ కార్లు (అనగా ప్రతీ 11 మందిలో ఒక కారు) ఉన్నాయి.<ref>{{cite web | url=http://www.sasi.group.shef.ac.uk/worldmapper/display.php?selected=31 | title=వరల్డ్ మ్యాపర్ - పాసింజర్ కార్స్}} </ref> భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ గణాంకాలు తెలిస్తే ఎవరైనా పొందుపరచండి. -->
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కారు" నుండి వెలికితీశారు