వికీపీడియా:వికీ సంప్రదాయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+{{అనువాదము}} |
→Principles of Wikipedia etiquette: విభాగం అనువాదం పూర్తి |
||
పంక్తి 6:
ఈ పేజీలో కొన్ని '''వికీ మర్యాద ''' యొక్క కీలకాంశాలు ఇవ్వబడినవి. వికీ మర్యాద( వికీపీడియాలో పనిచేసేటప్పుడు ఇతరులతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు, సలహాలు) ఇంకా మౌళిక నిర్దేశాల కొరకు [[Wikipedia:విధానాలు, మార్గదర్శకాలు|విధానాలు, మార్గదర్శకాలు]] పేజీ చూడండి.
==మర్యాదకు మూలసూత్రాలు==
* [[వికీపీడియా:విశ్వసించండి|అవతలివారిని విశ్వసించండి]]. స్వేచ్ఛగా దిద్దుబాటు చెయ్యడమనే సూత్రంపై ఆధారపడి వికీపీడియా పనిచేస్తూంది. ఎవరైనా ఇక్కడకు వచ్చి తమతమ విజ్ఞానాన్ని పంచవచ్చు.
* ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలనుకుంటారో, మీరు వారితో అలాగే వ్యవహరించండి.
* దయచేసి మర్యాదగా ఉండండి!
**ప్రజలు మిమ్మల్ని చూడలేరు, మీ మూడ్ ఎలా ఉందో వారికి తెలియదు. కఠినమైన, పరుషమైన పదజాలం దురుసుగా అనిపిస్తాయి. మీరు ఎంచుకునే పదజాలం విషయంలో జాగ్రత్తగా ఉండండి &ందష్; ఇతరులు అర్థం చేసుకునేది, నీరు చెప్పదలచుకున్నది కాకపోవచ్చు.
* చర్చాపేజీల్లో [[వికీపీడియా:సంతకం చెయ్యండి|సంతకం చెయ్యండి]] (వ్యాసాల్లో కాదు!).
* [[వికీపీడియా:రచయితలకు సూచనలు|ఓ అంగీకారానికి రావడం కోసం ప్రయత్నించండి]].
* విషయంపై వాదించండి, వ్యక్తుల గురించి కాదు.
* ప్రశ్నలను పక్కన పెట్టకండి.
** ఈతర్ సభ్యులు మీ దిద్దుబాటుతో అంగీకరించకపోతే, అది సరైఅనదని ఎందుకు అనుకుంటున్నారో సకారణంగా వివరించండి.
* అవతలివారు చెప్పేది సరి అని అనిపిస్తే ఒప్పేసుకోండి; మీ వ్యతిరేకత మీ అభిరుచి ప్రకారమే అయితే అదే విషయాన్ని ఒప్పేసుకోండి.
** మీరు చెప్పని విషయాలపై ప్రజలు చర్చించుకునేలా చెయ్యకండి.
* [[వికీపీడియా:మర్యాద|మర్యాదగా]] ఉండండి.
* చర్చ మంచి వేడిగా ఉన్నపుడు, అవతలి వారు మీరు ఆశించినంత మర్యాదగా ప్రవర్తించనపుడు, మీరు వారి కంటే '''ఎక్కువ''' మర్యాదగా ఉండండి. తక్కువ మర్యాదగా కాదు.
** ఆ విధంగా మీ కారణంగా ఘర్షణను సృష్టించిన పాపం మీకు చుట్టుకోదు. ఓ దెబ్బ తిన్నాక కూడా ఎదురుదాడి చెయ్యకుండా సంయమనంగా వ్యవహరించినట్లు. చూసేవాళ్ళంతా దీన్ని హర్షిస్తారు. (కనీసం హర్షించాలి).
** అయితే, వారు మాట్లాడే విధానం మీకు నచ్చలేదని స్పష్టంగా చెప్పండి. లేకపోతే మీరు మరీ తోలుమందం కాబోలని మరింత రెచ్చిపోగలరు వాళ్ళు. మీకు తెలియకుండానే వాళ్ళను ప్రోత్సహించినట్టవుతుంది.
* మీది తప్పైనపుడు మన్నించమని అడిగేందుకు వెనకాడకండి.
**"అయ్యో అలా అనకుండా ఉండాల్సింది" అని తరువాత అనుకునే సందర్భాలు చర్చల్లో వస్తాయి. అలా అనిపించినపుడు అదేమాట చెప్పెయ్యండి.
* మన్నించండి మరచిపోండి.
*మీకు ఆప్తమైన విషయాలను గమనింపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి.
* అభినందాల్సినపుడు అభినందించండి. ప్రతివారూ మెప్పుదలను కోరుకుంటారు. సభ్యుని చర్చాపేజీలో మీ మెప్పుదలను రాయండి.
* మీరు సృష్టించిన వివాదాలు ముగిసాక, వాటిని తీసెయ్యండి.
* మీరు వాదనలో పాల్గొంటే, కొన్నాళ్ళు తప్పుకోండి. మీరు మధ్యవర్తిత్వం చేస్తుంటే, తప్పుకొమ్మని వివాదగ్రస్తులకు చెప్పండి.
**ఓ వారం తరువాత తిరిగి రండి. మధ్యవర్తి కావాలని మీకు అనిపిస్తే, అప్పటికింఖా ఎవ్వరూ రంగంలో లేకపోతే, ఎవరో ఒకరిని అడగండి.
**వివాదాస్పద వ్యాసం నుండి తప్పుకుని మరో వ్యాసంపై పనిచెయ్యండి. వికీపీడియాలో {{ణూంభేఋఓFఆఋటీఛ్ళేశ్}} వ్యాసాలున్నాయి!
* [[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు|ఏది వికీపీడియా కాదో]] గుర్తుకు తెచ్చుకోండి.
*సాద్గ్యమైనంత వరకు వెనక్కు తిప్పడాలు, తొలగింపులకు దూరంగా ఉండండి. [[వికీపీడియా:3RR నియమం|3RR నియమాన్ని]] మరువకండి.
** దిద్దుబాటు చెయ్యండి, [[వికీపీడియా:చర్చాపేజీ|చర్చించండి]].
== How to avoid abuse of Talk pages ==
|