కీటకము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 57:
* శరీరం తల, వక్షం, ఉదరం అనే మూడు భాగాలుగా విభాజితమై ఉంటుంది.
* తల ఆరు ఖండితాల కలయికతో ఏర్పడి, సంయుక్త [[నేత్రాలు]], స్పర్శశృంగాలు, [[హనువు]]లు, [[జంభిక]]లు, ద్వంద్వంకాని అధరం కలిగి ఉంటుంది.
* వక్షంలో మూడు ఖండితాలుంటాయి. దీనికి మూడు జతల [[కాళ్ళు]] ఉంటాయి. అందువల్ల ఇన్సెక్టాను 'షట్పాది' అని కూడా అంటారు.
* సాధారణంగా వక్షానికి రెండు జతల [[రెక్కలు]] ఉంటాయి. కొన్నిటిలో ఒక జత రెక్కలుంటాయి. లెపిస్మాలాంటి కీటకాలలో రెక్కలు ఉండవు.
* ప్రౌఢజీవి ఉదరానికి ఉపాంగాలు లేవు. డింభక దశలో ఉదరానికి ఉపాంగాలుంటాయి.
పంక్తి 78:
== మానవులతో సంబంధాలు ==
[[దస్త్రం:Aedes aegypti biting human.jpg|thumb|left|''[[Aedes aegypti]]'', a parasite, and vector of [[dengue fever]] and [[yellow fever]]]]
చాలా కీటకాలు మానవులకు [[చీడపురుగు]]లు (Pests) గా సుపరిచితులు. కీటకాలలో [[దోమ]], పేను, [[నల్లి]] వంటి కొన్ని [[పరాన్నజీవులు]] (Parasites), [[ఈగ]]లు, దోమలు వంటి కొన్ని వ్యాధుల్ని కలుగజేస్తాయి, [[చెదపురుగులు]] నిర్మాణాల్ని, [[మిడత]]లు మొదలైనవి పంటల్ని పాడుచేస్తాయి. అయినా చాలామంది కీటక పరిశోధకులు కీటక నాశక మందుల (Insectisides) కంటే జీవసంబంధ చీడపురుగుల నివారణ పద్ధతుల (Biological pest control methods) నే ఉపయోగాన్ని సమర్ధిస్తున్నారు.
 
చాలా కీటకాలు పర్యావరణానికి మరియు మానవులకు ఉపయోగకరమైనవి. కందిరీగ, తేనెటీగ, సీతాకోకచిలుకలు, చీమలు మొదలైన కొన్ని కీటకాలు పుష్పాలను పుప్పొడి రేణువులచే ఫలదీకరణం జరుపుతాయి. దీనిమూలంగా [[మొక్క]]ల వృద్ధికి తోడ్పడుతున్నాయి. కీటకాల నాశనం మూలంగా ప్రస్తుత కాలంలో వీటిని వర్ధనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
 
కీటకాలు మనకు ఉపయోగపడే [[తేనె]], [[మైనం]], [[లక్క]], [[పట్టు]] మొదలైన వివిధ పదార్ధాల్ని అందిస్తున్నాయి. [[తేనెటీగ]]లను కొన్ని వేల సంవత్సరాల నుండి మానవులు తేనె కోసం పెంచుతున్నారు. [[పట్టుపురుగు]]లు మానవ చరిత్రను మార్చాయి. [[పట్టు రహదారి]] (Silk Road) [[చైనా]]ను మిగతా ప్రపంచానికి కలపడానికి ఇదే కారణం. [[ఈగ]] లార్వాలు (maggots) ప్రాచీనకాలంలో గాయాల చికిత్సలో ఉపయోగించారు. కొన్ని కీటకాలు, లార్వాలు చేపల ఎరగా ఉపయోగిస్తారు.
[[దస్త్రం:Chorthippus biguttulus f 8835.jpg|thumb|left|''Chorthippus biguttulus'', a grasshopper]] ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో కీటకాల్ని [[ఆహారం]]గా భుజిస్తారు; అయితే మరికొన్ని దేశాలలో ఇది నిషిద్ధించబడినది.
 
చాలా కీటకాలు ముఖ్యంగా బీటిల్స్ (beetles) మృత జీవాలు మరియు వృక్షాలపై జీవించి జీవావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ప్రాముఖ్యం వహించాయి. ఇవి భూమి మీద పైపొరలోని జీవచక్రాన్ని రక్షిస్తున్నాయి.<ref>Gullan and Cranston, 3, 218–228.</ref> అందువలననే ప్రాచీన [[ఈజిప్టు]] దేశాలలో [[పేడ పురుగు]]లను పూజించేవారు.
 
కీటకాలన్నింటిలోని ఉపయోగమైనవి ఇతర కీటకాల్ని ఆహారంగా తినేవి. ఈ పద్ధతి కీటకాల జనాభాను నియంత్రించడానికి ముఖ్య కారణము. ఇదే గనక లేకపోతే వీటి జనాభా భూమినంతా ఆక్రమించేవి.<ref>Gullan and Cranston, 328–348.</ref>
"https://te.wikipedia.org/wiki/కీటకము" నుండి వెలికితీశారు