కురుక్షేత్ర సంగ్రామం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 24:
 
[[Image:Mahabharata BharatVarsh.jpg|right|thumb|300px|[[మహాభారతం|మహాభారత]] కాలం నాటి [[భారతదేశం]].]]
''[[మహాభారతం]]'', ఒక అతి ముఖ్యమైన [[భారతదేశ పురాణ కథ|హిందూ పురాణ కథ]]. ఇది [[కురు వంశం|కురు వంశీయుల]] జీవితాలను, వారి అనేక తరాల రాజ్యాధికారాన్ని మరియు పరిపాలనను తెలుపుతుంది. ఈ గాథ మూలం కురువంశానికి చెందిన రెండు దాయాది కుటుంబాల మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం. ''కురుక్షేత్రం'', అనగా '' కురు వంశీయుల స్థలము '', ఈ 'కురుక్షేత్ర' యుద్ధానికి రణరంగము. కురుక్షేత్రం ''ధర్మక్షేత్రం '' (''[[ధర్మం]]'' యొక్క స్థలము ), లేక field of righteousness గా కూడ ప్రసిద్ధి. ఈ స్థలాన్నే యుద్ధానికి ఎంపిక చెయడానికి మహాభారతంలో ఒక కారణం చెప్పబడింది: ’’'''ఈ నేలపైన పాపము చేసిననూ ఆ పాపము ఆ నేల యొక్క పవిత్రత వలన క్షమింపబడుతుంది.'''’’
 
ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన వైరి పక్షాలు [[పాండవులు]], [[కౌరవులు]]. అన్నదమ్ముల బిడ్డలైన వారి మధ్య వైరానికి కారణం కౌరవాగ్రజుడైన దుర్యోధనుడి ఈర్ష్య, రాజ్యకాంక్ష. [[జూదము]] ద్వారా పాండవుల రాజ్యాన్ని గెలుచుకోవాలని అతడు సంకల్పించాడు. [[శకుని]] సాయంతో అతడు ఆటను మోసపూరితంగా గెలిచి సోదరులైన పాండవులను పదమూడేళ్ళ పాటు అరణ్యవాసానికి పంపాడు. అరణ్యవాసం తర్వాత దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం ఈ యుద్ధానికి దారితీసింది.
పంక్తి 68:
కురుక్షేత్రయుద్ధంలో అనేక అయుధాలు వాడారు. భీష్మ, ధ్రోణ, అర్జున, కర్ణ, అభిమన్యు మొదలగు వీరులు [[ధనుర్బాణాలు]], భీమ, ధుర్యోధనులు గదను, ధర్మరాజు,శల్యుడు [[శూలం|శూలాన్నీ]] వాడారు. ఇవికాక కత్తులు, బాకులు మొదలగు ఆయుధాలను కూడా ఉపయోగించారు.
 
భారతాన్ని చారిత్రక సత్యంగా గుర్తిస్తే, కురుక్షేత్రయుద్ధాన్ని చరిత్రలోనే అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధంగా చెప్పవచ్చు. 18 రోజులలోనే ఇరుసైన్యాలలో దాదాపుగా అందరూ మరణిస్తారు. అభిమన్యుని వధకి ప్రతీకారంగా అర్జునుడొక్కడే ఒకే రోజులో ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని హతమార్చాడు. ఈవిదంగా యుద్ధం అసంఖ్యాక విధవలని, అంగవికలురని మిగిల్చి తద్వారా ఆర్థిక మాంధ్యానికి కారణమై [[కలియుగం|కలియుగానికి]] దారితీసిందని చెప్పవచ్చు.
 
===యుద్ధ వ్యూహాలు===
 
యుద్ధ సమయంలో ఇరు పక్షాలూ తమ తమ సేనలను వివిధ [[వ్యూహం|వ్యూహాలలో]] సమాయత్తం చేసుకొన్నాయి. ఆ రోజు [[యుద్ధం]]లో సాధించ దలచిన లక్ష్యానికి అనుగుణంగాను, ఎదుటి పక్షం బలాబలాలను ఎదుర్కోవడానికి వీలుగాను ఈ వ్యూహాలు పన్నినట్లు అనిపిస్తుంది. ఈ వ్యూహాల పేర్లు ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉన్నట్లున్నాయి.<ref>C Rajagopalachari, ''Mahabharata, 19954</ref>
[[Image:Halebid2.JPG|right|thumb|250px| [[చక్రవ్యూహం]] లో [[అభిమన్యుడు]] ప్రవేశించే చిత్రం రాతిపై శిల్పరూపంలో.]]
వ్యూహ రచన గురించి "డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు" ఇలా రాశాడు<ref>[http://www.eenadu.net/archives/archive-1-9-2008/sahithyam/display.asp?url=puranam138.htm "ఈనాడు" పత్రిక ఆన్‌లైన్ ఎడిషన్ "సాహితీ సంపద" - డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు] - ఈ భాగం ఈనాడు నుండి యథాతధంగా కాపీ చేయబడింది. రచయితకు అభ్యంతరం ఉండదనే అభిప్రాయంతో</ref> -
:''విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్రనిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు. అచలం అంటే పర్వతం, అచల వ్యూహమన్నప్పుడు ఒకచోట ఒక క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది, మకర వ్యూహంలో మకరం అంటే [[మొసలి]], మొసలి నోరుభాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహన్ని రూపుదిద్దుతారు. కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మవ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బతగలకుండా మిగిలిన సైనిక భాగాలన్ని రక్షక కవచంలాగా ఉంటాయి. శ్యేనం అంటే డేగ, డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రుసైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు. క్రౌంచ పక్షి ముక్కు చాలా ధృడంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమంటే శత్రువు ఎంతో కష్టానికి గురికావలసి వస్తుంది. వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు, తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చెయ్యడం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నపుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శ్యేన వ్యూహాన్ని పన్నేవారు. శ్యేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చెయ్యటానికి సూచీ వ్యూహాన్ని పన్నేవారు. అగ్రభాగాన కాక, వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటం (బండ) లాగా వ్యూహారచన చేసేవారు. ముందూ వెనుకా కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని అలా కూడా కాక నాలుగువైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు చక్రవ్యూహమూ భద్రం, వ్యాళం అనే పేర్లున్న వ్యూహాలను కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి. వ్యూహాలకు అందులో వుండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికికానీ శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగంచే వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు. ఇలా వ్యూహారచనా విన్యాసాలు సమరకళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తుండేవి.''
 
పంక్తి 114:
| 6
| మకర వ్యూహం
| క్రౌంచ వ్యూహం
| భీముడు, పాండవుల కొడుకులు ఐదుగురూ కౌరవులను ముప్పుతిప్పలు పెట్టించారు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. నకులుడి కొడుకు శతానీకుడు అద్భుతంగా యుద్ధం చేశాడు.
|-
పంక్తి 125:
| శృంగాటక వ్యూహం
| కూర్మ వ్యూహం
|భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణించారు. ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు అలంబసునిచేత మరణించాడు. అర్జునుని తీవ్రత కొనసాగింది.
|-
| 9
పంక్తి 153:
|-
| 14
| ?
| శకటవ్యూహం + <br /> పద్మవ్యూహం +<br /> సూచీవ్యూహం
| ద్రోణుని వ్యూహ రచన సైంధవుని రక్షించడం కోసం చేయబడింది. అయినా అర్జునుడు అందరినీ జయించి తృటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శ్రుతాయుధుడు, కృతవర్మాదులు, విందానువిందులు అర్జునునిచేత మరణించారు. ఘటోత్కచుడు అలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. దుర్మర్షణుడు, దుర్మధుడు, శత్రుంజయుడు వంటివారు భీమునిచేత చచ్చారు. సాత్యకి భూరిశ్రవుని చంపాడు. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన ప్రతిన నెరవేర్చుకొన్నాడు. రాత్రి పూట జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు పెట్రేగిపోయాడు. అర్జునుని చంపడానికి దాచుకొన్న శక్తిని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుని కడతేర్చాడు.
|-
| 15
|
|
| ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు "అశ్వత్థామ" (అనే ఏనుగు) మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధృష్ష్టద్యుమ్నుడు ద్రోణుని శిరసు తెగనరికాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ దివ్యాస్త్రాలు కృష్ణార్జునుల శక్తియుక్తులవలన వృధా అయ్యాయి. వేదవ్యాసుడు అర్జునునికి పరమేశ్వర మహిమను విశదీకరించాడు.
|-
| 16
| అర్ధచంద్ర వ్యూహం
| మకర వ్యూహం
| అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుని నియమించాడు. భీముడు క్షేమధూర్తిని వధించాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుని చంపేశాడు. భీముడు అశ్వత్థామతోను, కర్ణుడు నకులునితోను, అర్జునుడు సుశర్మతోను ద్వంద్వ యుద్ధాలు చేశారు. ధర్మరాజు సుయోధనుని మూర్ఛిల్ల చేశాడు. అర్జునుడూ, కర్ణుడూ ఎదురి పక్షాలను గగ్గోలు పెట్టించారు. మరునాడు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు దిగాలుగా ఉన్న దుర్యోధనునికి మాట యిచ్చాడు.
|-
| 17
| దుర్జయ వ్యూహం
| ?
| దుర్యోధనుని ప్రార్ధననంగీకరించి కర్ణునికి సారధ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడి పరుష వ్యంగ్య వచనాలకు కర్ణుడు నొచ్చుకొన్నాడు. కర్ణుడూ, కర్ణుని కొడుకులూ చెలరేగి పాండవ సైన్యాన్ని కాలరాచేశారు. కర్ణుడు ధర్మరాజుని పట్టుకొని పరుషంగా అవమానించి వదిలేశాడు. భీముడు దుశ్శాసనుని వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు. కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం ప్రళయ సమానంగా సాగింది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలమయ్యింది. కర్ణుని రధం భూమిలో దిగబడినపుడు అర్జునుడు అంజలికం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికేశాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు.
|-
| 18
| త్రిశూల వ్యూహం
| సర్వతోభద్ర వ్యూహం
| దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉన్నాడు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు. యుధిష్ఠిరుని చేత శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధారసైన్యాన్ని ఊచకోత కోసేశాడు. శకునిని చంపేశాడు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోయారు. దుర్యోధనుడు పరిసరారణ్యాలకుపోయి ఒక జలాశయంలో దాగున్నాడు. ధర్మరాజు వచ్చి మాటాడిన పరుషవాక్యాలతో దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధానికి సిద్ధుడయ్యాడు. భీముడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టి అక్కడవదిలేసి వెళ్ళారు. తరువాత అర్జునుని కపికేతనం, దివ్యాస్త్రాలు అదృశ్యమయ్యాయి. రధం భస్మమైపోయింది. అశ్వత్థామ సుయోధనుని కలిసి అపాండవం చేస్తానని మాట యిచ్చాడు. (తరువాతి కథ "సౌప్తిక పర్వం"లో ఉంది.)
|-
|}
పంక్తి 276:
===పదహారవ రోజు===
 
పదహారవ రోజున కర్ణుడు కౌరవసైన్యానికి సర్వసైన్యాధ్యక్షు డయ్యాడు. ఆ దినమంతా లెక్కకు మించిన యోధులు హతులయ్యారు. కర్ణార్జునుల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. కర్ణుడి పరాక్రమాన్ని కృష్ణుడు కూడా ప్రశంశించాడు. చివరికి సాయంకాల సమయానికి కర్ణుడు అర్జునుని [[గాండీవం]] యొక్క నారిని తెంపగలిగాడు. ఆపై అర్జునుని సంహరించేలోగా సూర్యాస్తమయం కావడంతో యుద్ధనీతిని పాటిస్తూ కర్ణుడు యుద్ధాన్ని విరమించాడు.
 
ఇతర కథనాల ప్రకారం - కర్ణుడు పాండవసైన్యంపై దాడి చేసి అనేకమంది సైనికులను సంహరించాడు. అపుడు అర్జునుడు అతణ్ణి ఎదుర్కొన్నాడు. అతడు కౌరవ సైన్యంపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాడు. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో ఇరుపక్షాలు యుద్ధాన్ని విరమించాయి. <ref>[http://www.sacred-texts.com/hin/m08/m08030.htm Sacred-Texts.com]</ref>
పంక్తి 289:
 
===యుద్ధం తరువాత===
పదునెనిమిద రోజు తరువాత పది మంది యుద్ధ వీరులు మాత్రమే బ్రతికిఉన్నారు. వారు ఐదుగురు [[పాండవులు]], [[కృష్ణుడు]], [[సాత్యకి]], [[అశ్వథ్థామ]], [[కృపాచార్యుడు]] మరియు [[కృతవర్మ]]. [[యధిష్టిరుడు]] హస్తినాపురమునకు పట్టాభిషిక్తుడయ్యాడు. ముప్పది సంవత్సరములు పాలించిన పిదప [[అర్జునుడు|అర్జునుని]] మనుమడు [[పరీక్షిత్తు]]కి పట్టాభిషేకం చేసి తన సోదరులు మరియు ద్రౌపదితో కలసి [[హిమాలయాలు|హిమాలయాలకు]] వెడలి పోయాడు. [[పరీక్షిత్తు]] [[అభిమన్యుడు|అభిమన్యుని]] కుమారుడు. మార్గమధ్యంలో ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు మరణించారు. [[ధర్మదేవుడు]] [[యధిష్టిరుడు|యధిష్టిరుని]] తన దేహంతోనే [[స్వర్గలోకం|స్వర్గలోకమున]]కు వచ్చుటకు ఆహ్వానించాడు.
 
==కురుక్షేత్ర సంగ్రామ చారిత్రకత==
పంక్తి 308:
 
==వనరులు==
* [http://www.eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=puranam138 "ఈనాడు" పత్రిక ఆన్‌లైన్ ఎడిషన్ "సాహితీ సంపద" - డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు] - "వ్యూహాల వివరణ" ఈనాడు నుండి యధా తధంగా కాపీ చేయబడింది. రచయితకు అభ్యంతరం ఉండదనే అభిప్రాయంతో
* '''శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము''' వ్యవహారికాంధ్ర వచనము - బొమ్మకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొంపెల్ల వేంకటరామశాస్త్రి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్, శ్రీ సీతారామ బుక్ డిపో, రాజమండ్రి (2001)