కృతవర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 3:
కృతవర్మ [[యాదవులు|యాదవకులం]]లోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాతైన హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా, ఈయనకు కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. [[శ్యమంతకమణి]] వ్యవహారములో కృష్ణుని మామ అయిన [[సత్రాజిత్తు]]ను హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.
 
[[కురుక్షేత్ర యుద్ధం|కురుక్షేత్ర యుద్ధ]] సమయంలో, కృతవర్మ [[కౌరవులు|కౌరవుల]] పక్షాన చేరి [[పాండవులు|పాండవుల]]కు వ్యతిరేకంగా యాదవ సైన్యాన్ని (దీన్నే నారాయణి సేన అని కూడా అంటారు) నడిపించాడు. మొత్తం కౌరవ సైన్యంలో కెల్లా సజీవంగా మిగిలిన ముగ్గురిలో కృతవర్మ ఒకడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఉపపాండవులను హత్య చేయటమనే నీచకార్యములో [[అశ్వద్దామ]]కు సహకరించాడు. హత్యగావించబడిన వాళ్లలో పాండవ పక్ష సర్వసైన్యాధ్యక్షుడు [[దృష్టద్యుమ్నుడు|దృష్టద్యుమ్నుని]]తో పాటు [[శిఖండి]] మరియు [[ద్రౌపది]] యొక్క ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈ ఘట్టము మహాభారతంలోని సౌప్తిక పర్వంలో వర్ణించబడింది.
మహాభారత యుద్ధానంతరం కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మహాభారతంలోని మౌసల పర్వంలో తెలియజేసిన విధంగా యాదవ వినాశన కాలములో కృతవర్మ [[ద్వారక]]లో [[సాత్యకి]] చేతిలో మరణించాడు.
 
"https://te.wikipedia.org/wiki/కృతవర్మ" నుండి వెలికితీశారు