కెమెరా చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: removing existed iw links in Wikidata
చి Wikipedia python library
పంక్తి 2:
ఫోటోగ్రఫిక్ కెమెరాలకి ముందు [[కెమెరా అబ్స్క్యూరా]]ల పై చాలా పరిశోధన జరిగింది. క్రీ.పూ ఐదవ శతాబ్దంలోనే చైనీసు తత్త్వవేత్త అయిన [[మో టీ]] ఒక [[సూదిబెజ్జం కెమెరా|సూదిబెజ్జం]] ద్వారా కాంతి ప్రయాణించి చీకటి ప్రదేశం లోకి ప్రవేశించినపుడు తలక్రిందులైన, స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచటం గమనించాడు. ఈ ప్రక్రియని అవలంబించిన మొట్టమొదటి వ్యక్తీ మో టీ నే. అయితే ఈ సిద్ధాంతాన్ని గురించి క్రీ.పూ నాల్గవ శతాబ్దంలోనే [[అరిస్టాటిల్]] ప్రస్తావించాడు. క్రీ.పూ 330వ సంవత్సరం లో ఏర్పడిన పాక్షిక సూర్యగ్రహణం సమయంలో చెట్టుకి ఉన్న ఆకుల మధ్యన ఉన్న ఖాళీల గుండా సూర్యుని ప్రతిబింబం ఏర్పడటం వివరించాడు. పదవ శతాబ్దంలో అరబ్బీ పండితుడు అయిన [[ఇబ్న్ అల్-హైతం]] (అల్ హసన్) కూడా సూదిబెజ్జం ద్వారా పయనించిన సూర్యగ్రహణాన్ని గమనించి సూదిబెజ్జం యొక్క పరిమాణాన్ని తగ్గించటం ద్వారా ప్రతిబింబంలో స్పష్టత తీసుకురావచ్చని వివరించాడు. ఆంగ్ల తత్త్వవేత్త [[రోజర్ బేకాన్]] ఈ ఆప్టికల్ సిద్ధాంతాల గురించి ''పర్స్పెక్టివా'' అనబడు గ్రంథములో 1267లో రచించాడు. పదిహేనవ శతాబ్దం నాటికి కళాకారులు మరియు శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియని తమ పరిశోధనలలో వాడటం ప్రారంభించారు. ఒక వైపు గోడకి సూదిబెజ్జం చేసిన ఒక చీకటి గదిలోనికి ఒక మనిషి ప్రవేశించి ఎదురుగా ఉండే గోడపై ఏర్పడే తలక్రిందులైన ప్రతిబింబాన్ని గమనించే వారు. ల్యాటిన్ లో చీకటి గదులని కెమెరా అబ్స్క్యూరా అంటారు.
 
కెమెరా అబ్స్క్యూరా అని మొట్టమొదట సంబోధించినది గణిత మరియు నక్షత్ర శాస్త్రజ్ఞడు అయిన [[జోహెన్నెస్ కెప్లర్]]. 1604 లో తన ''అడ్ విటెల్లియోనెం ప్యారాలిపోమెనా'' లో ఈ సంబోధన జరిగినది. దీనికి ఒక కటకాన్ని చేర్చి ఈ ఉపకరణాన్ని ఒక గుడారంలో నిర్మించటంతో దీనిని కావలసిన చోటుకి తీసుకెళ్ళే సౌలభ్యము కలిగినది. 1660 లలో బ్రిటీషు శాస్త్రవేత్త [[రాబర్ట్ బోయిల్]] మరియు అతని సహాయకుడు అయిన [[రాబర్ట్ హుక్]] లు చేతిలో ఇమిడే కెమెరా అబ్స్క్యూరాని తయారు చేశారు.
 
వాడుకకి అనువుగా చేతిలో ఇమిడే చిత్రపటాలను రూపొందించేందుకు వీలుపడే కెమెరాని మొట్టమొదట 1685లో [[జోహాన్ జాహ్న్]] రూపొందించాడు. నిల్వ ఉంచే దారి లేకపోవటంతో అప్పట్లో ఏర్పడిన ప్రతిబింబాన్ని చిత్రపటంగా మరల గీసేవారు. అయితే సూర్యరశ్మి సోకినచో రంగులు వెలిసిపోవటం లేదా రంగులు ముదరటం అప్పటికే మానవాళికి తెలుసు. కెమెరా అబ్స్క్యూరా లో కాంతి తాత్కాలితంగా గీసే ఈ చిత్రలేఖనాలతో ప్రేరణ చెందిన చాలామంది ప్రయోగకర్తలు వీటిని శాశ్వతంగా ముద్రించటానికి కావలసిన పదార్థాలని కనుగొనే ప్రయత్నంలో పడ్డారు.
 
తర్వాతి కెమెరాలు పెట్టెల సమూహంగా ఉండేవి. ఒక పెట్టెకి కటకం అమర్చబడి ఉండగా మరొక పెట్టె కి గాజుతో తయారు చేయబడిన తెర అమర్చబడి ఉండేది. వీటిని ఒకదానికొకటి దగ్గరగా లేదా దూరంగా జరపటం ద్వారా వివిధ దూరాలలో ఉన్న ఆబ్జెక్టులని స్పష్టమైన [[కటక నాభి|ఫోకస్]] కి తెచ్చేవారు. కోరుకున్న విధంగా ప్రతిబింబం ఏర్పడ్డ తర్వాత, కటకాన్ని మూసివేసి తెర స్థానంలో కాంతిని గుర్తించే పదార్థమును ఉంచేవారు. కటకాన్ని మరల తెరచి కావలసినంత సమయం [[బహిర్గతం]] చేసేవారు. అప్పటి ప్రయోగాల లో ఉపయోగించబడే పదార్థముల స్వభావం వలన కొన్ని గంటలు లేదా రోజులు బహిర్గతం చేయవలసి వచ్చేది. ఛార్లెస్ మరియు విన్సెంట్ ఛెవాలియర్ లు చెక్కతో చేయబడిన స్లైడింగ్ బాక్స్ కెమెరాని ఉపయోగించి [[జోసెఫ్ నిసెఫోర్ నీప్సే]] 1826 లో [[ప్యారిస్]] లో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్ ని సృష్టించాడు.
 
ఇలాంటి కెమెరాలలోనే [[డాగ్యురోటైప్]] (సిల్వర్ రసాయనాలతో పూత పూసిన) ప్లేట్లని ఉపయోగించటం 1839 లో మొదలైనది. ఇవి చరిత్రలోనే ఉపయోగించబడిన మొట్టమొదటి ఛాయాగ్రహక మాధ్యమములు (ఫోటోగ్రఫిక్ మీడియం). 1850 లలో డాగ్యురోటైప్ ల స్థానాన్ని ఆక్రమించిన [[కొలోడియన్ ప్రక్రియ]] లో ఫోటో తీసే కొద్ది సమయం ముందు ఫోటోగ్రఫర్ పలుచని గాజు/ఇనుప పలకలకి పూత పూసి వాటి తడి ఆరిపోక ముందే ఉపయోగించేవారు. 1864 లో ఈ పూత కోసం ప్రత్యేక చీకటి గదులని ఉపయోగించనవసరం లేని కెమెరాలో నే పూత పూసే డుబ్రోనీ ప్రవేశ పెట్టబడినది. ఇతర కెమెరాలలో ఎక్కువ కటకాలని అమర్చి పలు చిన్న చిన్న ఫోటోలని ఒక పెద్ద పలక పై చిత్రించటం మొదలు పెట్టారు. దీనినే [[కార్టెస్ డీ విజిటే]] అనేవారు. [[బెల్లో]] ల ఉపయోగం ఈ తరంలోనే వ్యాప్తి చెందినది.
"https://te.wikipedia.org/wiki/కెమెరా_చరిత్ర" నుండి వెలికితీశారు