కొడవటిగంటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొడవటిగంటి కుటుంబరావు
| residence =
| other_names =కొడవటిగంటి కుటుంబరావు
| image =KoKu.png
| imagesize = 200px
| caption = కొడవటిగంటి కుటుంబరావు
| birth_name = కొడవటిగంటి కుటుంబరావు
| birth_date = [[అక్టోబర్ 28]] [[1909]]
| birth_place = [[గుంటూరు|గుంటూరు జిల్లా]], [[తెనాలి]]
| native_place =
| death_date = [[ఆగష్టు 17]] [[1980]]
| death_place =
| death_cause =
| known = ప్రసిద్ధ తెలుగు రచయిత.[[హేతువాది]]
| occupation =
పంక్తి 39:
 
== జీవితము ==
కొకు [[గుంటూరు|గుంటూరు జిల్లా]], [[తెనాలి]]లోని ఒక మధ్య తరగతి [[బ్రాహ్మణ]] కుటుంబములో జన్మించాడు. తెనాలిలో పాఠశాల చదువు [[1925]] వరకు సాగింది. చిన్నవయసులోనే [[1914]] లో తండ్రీ, [[1920]] లో తల్లీ మరణించడంతో మేనమామ వద్ద పెరిగాడు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొకు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ జరిగింది. పదమూడేళ్ళ లేతవయసులోనే కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాసాడు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసాడు. [[1925]] లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన పెళ్ళి జరిగింది.[[1925]] నుండి [[1927]] వరకు గుంటూరు [[ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]] లో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలో [[మహారాజా కళాశాల]], విజయనగరం లో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టాడు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన [[నాస్తికత్వం|నాస్తికుని]]గా మారిపోయాడు.
 
 
పంక్తి 45:
 
 
[[1939]] లో భార్య పద్మావతి మరణించింది. [[1940]] - [[1942|42]] మధ్య కాలంలో [[ఆంధ్ర పత్రిక]]లో పనిచేసాడు. ఆ కాలంలో [[జరుక్‌శాస్త్రి]] (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. 1942 జూలై నుండి [[1943]] జనవరి మధ్య సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. [[1944]] లో [[ఒరిస్సా]] [[జయపూరు]] లో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు.
 
 
మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగైన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో [[1945]]లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు. [[1948]] లో మూణ్ణెల్ల పాటు [[ముంబై|బొంబాయి]] ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. [[1948]] లో [[ఆంధ్రపత్రిక]] దినపత్రికలో చేరి [[1950]]-[[1951|51]] లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. [[1952]], [[జనవరి 1]] నుండి చనిపోయే వరకూ [[చందమామ]]లో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితి కి రావటాని ఎంతో కృషి సలిపాడు.
 
==రచనలు==