కొడాలి గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''కొడాలి గోపాలరావు''' ప్రముఖ తెలుగు నాటక రచయిత.
==విశేషాలు==
దొంగవీరడు, ఛైర్మెన్, లంకెల బిందెలు వంటి నాటకాలు తెలుగు నాటక రంగంలో సంచలనాన్ని కలిగించినవి. ఈ నాటకాల రచయిత '''కొడాలి గోపాలరావు'''. తెలుగు నాటకరంగంలో శతనాటక కర్తగా, వేగవంతమైన రచయితగా కొడాలి గోపాలరావుకి పేరు ప్రఖ్యాతలున్నాయి. ఈ గ్రామీణ నాటకాలు రచించడంలో అందెవేసిన చేయి కొడాలి గోపాలరావు. గ్రామీణ ప్రజలు, వారిలో జమిందార్లు, రాజకీయ నాయకులు, వడ్డీ వ్యాపారస్తులు, కూలీలు, పేదలు వంటివారిని తన నాటకాలలో పాత్రలుగా, వారి జీవన చిత్రాన్ని, వారి మధ్య ఏర్పడే సంఘటనలు, సంఘర్షణలు అంతే సహజంగా రంగస్థలంపై ఆవిష్కరించిన ఘనత కొడాలిది.
కొడాలి గోపాలరావు [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]] తాలూకాలోని [[పెదరావూరు]] గ్రామంలో జన్మించారు. సహజంగానే తెనాలి ప్రాంతంలో నాటక కళ పట్ల ఆదరణ ఎక్కువ. ప్రతి ఒక్కరిలో నాటకం పట్ల కనీస అవగాహన, ఆసక్తి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో పుట్టిన కొడాలి సహజంగానే నాటకం పట్ల అవగాహన, ఆసక్తి కలిగించింది.
 
పంక్తి 13:
* వైకుంఠ భవనం (1960)
* ఆత్మద్రోహులు,
* చెరపకురా చెడేవు, ఛైర్మన్, శోభనపు రాత్రి గది,
 
ఇక కొడాలి రచనల గురించి చెప్పాలంటే ఆయనకున్న శతనాటకకర్త అనే బిరుదు ద్వారా ఆయన వందకు పైగా నాటకాలు రచించారు అనేది విదితమే. అయితే ఆయన శతాధిక నాటకకర్త అనేది ఆయన శిష్యులు, ఆయనపై పరిశోధన చేసిన పరిశోధకుల మాట. కళాప్రపూర్ణ, శతనాటకకర్త వంటి బిరుదులు కొడాలికి ఉండేవి.
 
1930 – 1990 మధ్యకాలంలో గ్రామీణ నాటక రచయితగా, శతనాటకకర్తగా, తెలుగు నాటకరంగ కడలికెరటం అంటూ ఆకాశానికి ఎత్తేయబడిన కొడాలి గోపాలరావు పేరు నేడు అసలెవరికీ పట్టనట్టుగా, మరుగున పడి ఉంది. అది ఎంతలా అంటే కొడాలి స్వగ్రామం పెదరావూరు వెళ్ళి ఆయన గురించి అడిగితే కొడాలి గోపాలరావు ఎవరు ... అని ఆ ఊరి గ్రామస్థలు మనల్నే ఎదురు ప్రశ్న వేసేంతలా... తన పుస్తకాలు, రచనలు ప్రింట్ అవుతున్నాయా... లేదా ... అని కొడాలి ఆలోచించకపోవడం, ఎవరాడినా నాటకం బ్రతుకుతుంది అనే అభిప్రాయంతో అడిగిన వారికల్లా నాటకాలు రచించి ఇవ్వడం మరలా వాటి గురించి పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివాటితో పాటు కొడాలి కుటుంబ సభ్యులు, శిష్యులు, నేటి తెలుగు నాటకరంగం, నేటి పరిశోధకులు ఎవరూ ఆయన గురించి పట్టించుకోక పోవడం వల్ల కొడాలితో పాటు ఆయన రచలనలు కూడా మరుగున పడి ఉన్నాయి. ఇలాగే మరికొంత కాలం గడిస్తే నేడు దొరుకుతున్న పుస్తకాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది.
కొడాలి గోపాలరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి తాలూకా పెదరావూరు గ్రామంలోనికొడాలి కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్నారు. ఆయన విద్యాభ్యాసం పెదరావూరు గ్రామంలోని శివాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.
 
"https://te.wikipedia.org/wiki/కొడాలి_గోపాలరావు" నుండి వెలికితీశారు