కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వృక్ష కుటుంబాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 3:
కొబ్బరి చెట్టు అన్ని ఉష్ట దేశములందును సముద్రము చేరువ పెరుగు చున్నది.
 
ప్రకాండము 80 అడుగుల యెత్తు వరకును పెరుగును కాని కొమ్మలుండవు. పైబెరడు దట్టముగాను, బిరుసుగాను, పగుళ్ళు, పగుళ్ళుగా నుండును. దీనిపై రాలి పోయిన ఆకుల యానవాళ్ళు గలవు. ప్రకాండము మొదట కొంచెమెక్కువ లావుగా నుండును. గాని, అటుపైన చివర వరకు నొక్కటియే లావు. మామిడి, మర్రి, మొదలగు ద్విదళ బీసకపు వృక్షముల వలె నిది పొడుగగు చుండినను లావు కాలేదు.
ప్రకాండమున కడుగున చాల వేళ్ళు గలవు. ఇవి కొంచెమెర్రగను చిటికిన వ్రేలు లావునను నుండును. ఈ ఉపవంశపు చెట్లు తల్లి వేరు చిన్నదిగ నున్నప్పుడే చచ్చి పోవుట చేత, ప్రకాండమడుగున నుండి ఇన్ని వేళ్ళు పుట్టు చున్నవి.ఆకులు చెట్టు చివర దగ్గరి దగ్గరిగా నుండును. ఇవి మిక్కిలి పెద్దవి. మిశ్రమ పత్రములు. పక్ష వైఖరి. చిట్టి ఆకులు పొడుగుగానే యుండును. సమరేఖ పత్రము. సమాంచలము. దట్టముగను బిరుసుగను నుండును. పుష్ప మంజరి రెమ్మకంకి, లేత రెమ్మకంకులను గప్పుచు బిరుసుగ ఊరుచేటిక గలదు. పువ్వులు చిన్నవి. సరాళము. ఏక లింగ పుష్పములు.
 
;పురుష పుష్పములు:
 
పుష్పకోశము. అసంయుక్తము. రక్షక పత్రములు 3 మూడు ఒకదానికొకటి తాకుచు నుండును. మిక్కిలి బిరుసుగ, చర్మము వలె నుండును. నీచము.
 
;దళవలయము: అసంయుక్తము. ఆకర్షణ పత్రములు 3. వీనికి, మంచి రంగు గాని, వాఅన గాని లేదు. మిక్కిలి బిరుసుగా నుండును.
;కింజల్కములు: 6....3 దళ వలయమున గదుగదురుగను, 3 పుష్ప కోశమున కెదురుగ నుండును. పుప్పొడి తిత్తులు సన్నము.
 
;పుష్ప కోశము: గొడ్డు దై యున్నది.
 
;స్త్రీ పుష్పములు: పురుహ పుష్పముల కంటె పెద్దవి.
;పుష్ప కోశము; దళవలయము పై దాని యందు వలెనే యుండును. కింజల్కములు లేవు.
 
;అండ కోశము:. అండాసయము ఉచ్చము. 3 గదులు. కాని ఒక గదియే పెద్దదగును. కాయలో నున్న తెల్లని కొబ్బరి విత్తనము పెరుగుటకు నిలువ చేసికొనిన పదార్థము. కొబ్బెర పీచు లోపల నుండు పెంకు కూడ కాయ లోని భాగము కాని గింజ కాదు. ఒలచిన కొబ్బరి కాయ కొకవైపున మూడు రంద్రములున్నట్లు కనబడును. ఒక దాని ద్వార సులభముగ పొడవ వచ్చును గాని, మిగిలిన రెండును మూసికొని వుండును. ఈ రంద్రముల ద్వారా కాయ పెరుగుటకు ఆహార పదార్థమ్లు వచ్చినవి. లేత పొందెలో నున్న మూడు గదులలోను రెండు గదులు పెరుగక పోవుటచే రెండు రంద్రములు మూసికొని పోయినవి.
 
తాడి చెట్టు, సముద్రమునకు దూరముగ పెరుగ గలదు.
 
;ప్రకాండము:, కొబ్బరి చెట్టునకంటె కొంచెము సన్నముగాను తిన్నగాగు వుండును. దీని బెరడు నలుపు. దీని మీదను రాలిపోయిన ఆకుల ఆనవాళ్ళు గలవు. దీనికిని కొమ్మలుండవు.
 
;ఆకులు: చెట్టు చివరనే యుండువు. పెద్దవి. లఘు పత్రములు. చివర కొంచము చీలి యున్నవి. పత్రము సమానముగ నుండక, మెరక పల్లములతో నున్నది. మిక్కిలి బిరుసుగా నుండును. సమ రేఖ పత్రము. లేత ఆకు ముణుచుకొని యున్నప్పుడు ఈనెలు మాత్రము ఎండ, గాలుల పాలగుచున్నవి. కాని మిగిలిన భాగము జాగ్రతగనే రక్షింప పడుచున్నది. ఈనెలు ఎంత ఎండకైన ఆగ గలవు. ఆకులలో పువ్వారమను గోధుమ వర్ణముగల పొడి యున్నది.
 
;పుష్పమంజరి: కంకి, ఏక లింగ పుష్పములు. చెట్టులోనె మగ, ఆడు భేదము కలదు. మగ చెట్టు సదా మగపువ్వులను, ఆడు చెట్టు, ఆడు పువ్వులను పూయును.
 
;మగకంకి: మధ్యాగంధమంజరి. కంకి మీద పువ్వులును చేటికలను ఒత్తుగా గలవు. కంకి నుండి అరంగుళము దట్టముగ నొక ముక్క కోసిన యెడల కొన్ని గుంటలగుపడును. ఈ గుంటలలో నుండియే కొన్ని పుష్పములు వచ్చును. వానిలో పెద్దది పైన నుండును. చిన్నది వంగి కొంచెము లోపలగా నుండును. ఒక దాని తరువాత నొకటి వరుసగ వికసించును.
 
;పుష్ప కోశము: అసంయుక్తము. 3 రక్షక పత్రములు. సన్నముగాను, బిరుసుగా నుండును. నీచము.
 
;దళవలయము:. సంయుక్తము. 3 తమ్మెలు గలవు.
 
;కింజల్కములు: 6 పుప్పొడి తిత్తులు రెండు గదులు.
; అండకోశము: దీని స్థానమున మూడు ముళ్ళ వంటివి మాత్రమె గలవు.
;స్రీ పుష్పములు: చాల పెద్దవి. కంకి మీద నొక్కొక్క చోట నొక్కొక్కటియే యుండును.
 
;పుష్పకోశము: దళవలయము, అసంయుక్తము. 3 గలవు. బిరుసుగా నుండును.
;కింజల్కములు, ఆరో తొమ్మిదో గొడ్డైన కాడలు గలవు.
;అండ కోశము: అండాశయము ఉచ్చము. 3 గదులు. కీలాగ్రము 3 కాయలో సాధారణముగ మూడు గదులు పెరుగును.
 
ఈ కుటుంబపు చెట్లులో దేనికిని కొమ్మలు లేవు. ఆకులు చివర నుండును. కొన్ని మొక్కలకు ప్రకాండమే లేదు. పేవబెత్తముల వంటివి మరి కొన్ని చెట్ల మీద ప్రాకుచుండును. దీని ఆకులు పెద్దవి. వీని మిశ్రమ పత్రములు. గులాబి, తుమ్మ ఆకు లేర్పడినట్లేర్పడుట లేదు. కొబ్బ్రి, ఈత మొదలగు వానిలో, చిట్టి ఆకునకు, చిట్టి అకునకును మధ్య నుండు సన్నని పొర తెగి పోవుటచే మిశ్రమ పత్రములగుచున్నవి. పుష్పమంజరి కంకి. పుష్పములకు ఉప వృంతములు లేవు. పుష్ప భాగములన్నియు మూడు మూడు చొప్పున నుండును.
 
సాధారణముగ కింజల్కములారు. అండాశయము మూడుగదులలోను నొకటియే పెరుగు చుండును.
 
ఈ కుటుంబములో మిగులనుపయోగములైన చెట్లు గలవు.
 
కొబ్బరి చెట్టు సముద్రమునుండి నూరు, నూట ఏబది మైళ్ళ దూరములో గాని పెరుగ జాలదు. ఒక వేళ పెరిగిన అంత ఫలవంతము కాదు. దీనికి ఇసుక నేలలు మంచివి. కాని ఈత ఖర్జూరము మొలచు ప్రతి ఇసుక నేలలోను మొలవలేదు. దీనికి నీరెక్కువ కావలయును. మరియు మిక్కిలి ఉష్టముగాని మిక్కిలి శీతలము గాని పనికి రాదు. విత్తనములకు మధ్య వయస్సులోనున్న చెట్ల కాయలు మంచివి. కొంచెము ముదురు కాయలను కోసి, నెల, నెల పదునైదు దినము లటకపై పెట్టి అడుగడుగు దూరమున పాతుదురు. పాతిన పిదప పురుగు పట్ట కుండ బూడిదను ఉప్పును, జల్లుట మంచిది. కొన్ని చోట్ల నిట్లు పాత కాయలలో నుండి మొక్క దిగువరకు వ్రేలాడ గట్టి అటు పిమ్మట దూర దూరముగ పాతుదురు. ఇట్లు పాతుట వలన మొదట పాత వలసిన శ్రమ తగ్గును. అదిగాక, పుట్టెడు మొక్క బాగుండునో చచ్చి పోవునో తెలియ గలదు. అడుగడుగు దూర్ఫములో మొ9క్కలు మొలచిన అతరువాత వానిని దీసి, 20 == 25 అడుగుల దూరములో గోతులు దీసి వానిలో ఎరువు వేసి పాత వలెను. కాని విస్తారము ఎరువు వేయుట వలన పురుగు పట్టుట కూడ కలదు. అవి వ్రేళ్ళు తినుటకారంబించి క్రమ క్రమముగ చివస్ర వరకు వచ్చును. కొన్ని పురుగులు లేత మొవ్వలో గ్రుడ్లు పెట్టును. ఇవి పిల్లలై మొవ్వను తిని వేయుట వలన చెట్టు ఎదుగు లేక చచ్చి పోవును. మరి కొన్ని పురుగులు లేత ఆకులను దిని వేయును. కొబ్బరి పంటలో గోదావరి జిల్లానే ప్రధమమున చెప్పవలెను.
 
కొబ్బరి చెట్ల ఉపయోగములు లో విదితమే. వీని మాకులు తాటి మాను వలె దూలములుగనుపయోగింపవు. కొబ్బరి మాను కంత చేవ లేదు. ఆకులతో తాటి ఆకు దొరకనొ చోట్ల దడులు పందిళ్ళు వేసుకొందురు. కొబ్బరి తినుటకు, పచ్చడి చేసి కొనుటకు బాగుండును. ఎండలో నడిచి వచ్చిన అతనికి లేత కొబ్బరి నీళ్ళు సేద దీర్చును. కాని విస్తారముగ త్రాగుచో జబ్బు చేయును. కొబ్బారి కాయల నుండి, కురిడీల నుండి చమురు తీయుదురు. పొగలో నిలువ చేసిన కాయలనూనె కొంచెము రంగుగానుండును. పరిశుభ్రమైన యెండు కురిడీల నూనె చాల బాగుండును. కొందరీ నూనెను నేతి వలె వాడుకొందురు. తలకు రాచు కొనుటకిదియే మంచిది. ఈ నూనెతో క్రొవ్వొత్తులను చేసెడి వారు. దీనితో సబ్బు కూడ చేయ వచ్చును. జర్మిని దేశములో కొబ్బరి నుండి వెన్న వంటి పదార్థము చేయు చున్నారు. ఇది ఎన్ని దినములు నిలువ యున్నను చెడి పోదు.
 
కొబ్బరి మూత్ర వ్యాధుల వంటి కొన్ని వ్యాధులకు మంచిది. కొన్ని రకముల జ్వరములకు కూడ మంచిదట.
 
కొబ్బరి పీచుతో కూడ మిగుల వ్యాపారము జరుగు చున్నది. దీనితో బ్రషులు మొదలగునవి చేయు చున్నారు. ముదురు కాయల పీచు కంటె లేత కాయలది మంచిది. కొబ్బరి కాయలను గునపముల తో వలచి డిప్పలను చాల కాలము ఉప్పునీళ్ళలో నాన బెట్టి నార దీయుదురు. కొబ్బరి చెట్ల నుండియు కల్లు గీయుచున్నారు.
 
తాడి చెట్టు మిక్కిలి ఉపయోగమగు చెట్లలో నొకటి. దీని నుండి తీయు పదార్థములలో విస్తారమెగుమతి అగునది నార. దాని వివిధ భాగములనుండియు వేరు వేరు రకముల నార వచ్చుచున్నది. ఆకులు మొదళ్ళ యందంటి పెట్టికొని యుండు పట్ట నుండి యొక రకము, కమ్మల నుండి యొకటి, ఆకుల నుండి ఒకటి, తెంకల మీద నుండు పీచు నుండి యొకటి, మాను నుండి కూడ నొలరకము వచ్చు చున్నది. వీనిని పలు విధములుగా నుపయోగించు చున్నారు. ఈ నారను పై దేశములకు పంపి కొంచెము లాభము పొంది సంతసించుటయే గాని, వానితో నేయే సాధనముల నెట్లు చేయుటో మనకు తెలియ రాకున్నది.
 
త్రాటి మానుకు చేవ గలదు. దానిని ఇండ్ల దూలములకు స్థంభములకు వాసములకు వాడుదురు. అది నీరు తగల కుండ నున్నంత కాలము మిక్కిలి గట్టిగానుండును. ఆకులతో ఇండ్ల కప్పులు దడులు, పందిళ్ళు తట్టుకొను చున్నాము. వీనితో గొడుగులు, బుట్టలు, చాపలు, దొర టోపీలు, కూడ చేయుదురు. పూర్వ కాలమునందు తాటి ఆకుల మీదనే వ్రాసెడి వారు. ఇప్పటిని కొందరు వర్తకూ, పద్దులు మొదలగునవి వాని మీద వేసి కొందురు. ఆకుల మీద నుండు పువ్వారము రక్తము వచ్చు తోట రాసిన రక్తము కట్టును. పువ్వుల కంకి పై నుండు మట్టను కాల్చిన బూడితతో కడుపులో బల్ల బెరుగుట, మొదలగు కొన్ని జబ్బుల ఔషధము చేసెదరు. తాటి ముంజెలను వేళ్ళును చలువ చేయును. తాటి పండ్లను దినుట ద్విజులకాచరము గాదు. వీని రసముతో మామిడి తాండ్ర వలె తాండ్ర చేయుదురు. తాటి తేగలను సాధారణముగ అందరు తిను చున్నారు.
 
తాటి చెట్లనుండి కల్లు మెండుగా వచ్చును. సుమారేబది ఏండ్ల వరకును కల్లు గీయ వచ్చును గాని మూడెండ్ల కొక మారు మానుట మంచిది. లేనిచొ చెట్లు నీరసించి పోవును. పోతు చెట్ల నుండి కంటె ఆడ చెట్ల నుండి కల్లు ఎక్కువ వచ్చును. కల్లు పులియ కుండ కుండల లోపల సున్నమును రాసెదరు. దాని ద్రవము నుండి బెల్లము, కలకండ వండు చున్నారు. కాని ఇది విస్తారము రాదు. తాటి కలకండ ఔషధములలో వాడుదురు. తాళ వృక్షమని తాడి చెట్టను చున్నాము గాని ఈ రెండింటికిని భేదము కలదు. తాళ వృక్షముకూడ చూచుటకు తాటి చెట్టు వలెనుండుట చే అభేదముగ నామములు వాడు చున్నాము. కాని తాళ పత్రములు తాటి ఆకులకంటె కొంచెము గుండ్రముగా నుండును. ఈ వృక్షములలో మగ, ఆడు భేదము లేదు. దీని ఆకులను తాటి ఆకులు పనికి వచ్చు ప్రతి పనికిని ఉపయోగించును. వ్రాయుటకు ఈ ఆకులే బాగుండును. మాను అంత బలమైనది కాదు. కాని దీని నుండి సగ్గు బియ్యము వండ వచ్చును. నారయు వచ్చును. దీని టెంకలు గట్టిగా నుండును. వానికేరంగైనను సులభముగా పట్టును. కాన వానికెర్ర రంగు వేసి పొగడముల వలె గాని తావళముల వలె గాని అమ్ముదురు.
 
హింతాల వృక్షము ఆరు, ఏడు అడుగులెత్తు పెరుగును గాని దాని8 ంరాను ఈత, ఖర్జూరపు మానుల కంటె సన్నముగా నుండును. దీనిలో పోతు చెట్లు ఆడు చెట్లు గలవు. ఆకుల కొంచెము ఈతాకులవలె నుండును. మొదట నున్న చిట్టి ఆకులు చిన్నవి. వాని వద్ద ముండ్లు గలవు. దీని కాయలు బాగుండవు. సన్నముగా నున్న మాను చేతి కర్రలకు బాగుండును. ఈ చేతి కర్రలతో నడుచు చుండిన త్రోవయందుండు పాములు తొలగి పోవునని కొందరకు నమ్మకము గలదు.
 
పోక చెట్టు చిరకాలము నుండియు తోటలలో పెంచు చున్నారు. అవి సముద్రమునకు రెండు వందల మైళ్ళ దూరములోను మూడు వేల అడుగుల ఎత్తు ప్రదేశములలోను పెరుగ జాలవు. వానికి నీరును వేడిమియు ఎక్కువగానే కావలెను. విత్తనముల కేబది యిరువది సంవత్సరముల చెట్ల కాయలు మంచివి. అట్టి వానినే తోటలలో నొక మడిలో పాతుదురు. ఒకటి రెండు సంవత్సరములైన పిదప చిన్న మొక్కలను దీసి ఆరేడడుగుల దూరమున నాటెదరు. పోక తోటలలోనె కొన్ని చోట్ల, అరటి, కొబ్బరి, పనస చెట్లను వేయు చున్నారు. మరి కొన్ని తావులందు బాడిద చెట్లను వేయుదురు. ఈ చెట్లు లేత పోక మొక్కల కెండ దెబ్బ దగుల నీయవు. అయిదారు సంవత్సరములు రాగాఏ కాయలు కాయుటకు ఆరంభించి, రమారమి ఆరువది సంవత్సరముల వకరు కాయును. ఒక చెట్టు సాధరణముగ రెండు గెలలు వేయును. కాని నేల సార వంతమైన యెడల మూడు నాలుగు గెలలు కూడ వేయును. ఒక చెట్టునకు సాధారణముగ 300 కాయలు దిగును. వర్షాకాలములో కాయలపై విస్తారము వాన కురిసినచో అవి కుళ్ళి పోవును గాన వాని పై పోక దొప్పలను కప్పు చుందురు. చెట్లెక్కి దొప్పల గట్టు వారు నిపుణులగుచో ఒక చెట్టు నుండి మరియొక చెట్టుంకు ఆకులను బట్టి కొనియే పోగలరు. కొన్ని కొన్ని తోట లందొకప్పుడు కాయలు పుచ్చు చుండును. పుచ్చునపుడు పువ్వుల మీదను కాయల మీదను నల్లని మచ్చలు బయలు దేరును. ఈ మచ్చలు వర్షము తగిలినచో ఎక్కువగును. కావున వర్షాకాలములో వానిపై దొప్పలను గప్పుట ఆవస్యకము. ఒకొక్కప్పుడు చెట్లకు చెద కూడ పట్టుట కలదు. విస్తారమెండలు కాయు చున్న దినములలో నీరునెక్కువగా పోయ కూడదు. పోసినచో చెట్టు తలలు విరిగి పడి పోవును. పోక తోటలందు చెమ్మ యారకుండుటయో కొంచెము మంచిది. పొగాకు, అల్లము, పసుపు తమలపాకు మొక్కలు చెమ్మ నారనీయవు గావున వానిని గూడ పోత తోటలందు వేయుట మంచిది.కాయలనుండి పోక చెక్కలను పలు చోట్ల బలువిధములుగా చేయు చున్నారు. కొందరు కాయలు పూర్తిగ ముదరకమునుపే కోయు చున్నారు గాని మిదిరిన కాయల చెక్కలే మంచివి. కొన్ని చోట్ల కాయలను కోసి, ఎండ బెట్టియే ముక్కలుగా కోసెదరు. మరి కొన్ని చోట్ల వానినుడక బెట్టెదరు. కొందరు ముక్కలు చేసి, ఉడక బెట్టుదురు కాని ఉడక బెట్టని ముదురు కాయలు శ్రేష్ఠము. రెండవ రకము చెక్కలకు మంచి వానివలె నగపడుటకు ''కొస '' బూసెదరు. పెద్ద పెద్ద రాగి డేగిసాలలో పోక కాయలనుడక బెట్టుచు అందులో, సున్నము గాని, తెల్ల మద్ది బెరడు యొక్క బూడిద గాని పోసెదరు. అట్లు రెండు గంటలు క్రాగనిచ్చి చత్రములతో ఆ కాయలను దేవి క్రొత్త కాయల నందులో వైతురు. ఆ కాయలు కూడ నించు మించి రెండు గంటలు ఉడకగానే వానిని దీసి వైతురు. కాగులో మిగిలిన అరసము చిక్కపడి, ఎర్తాగా నగును. దీనిని మరియొక దానిలో పోసి ఎండ బెట్టుదురు. ఇదియే ''కొస '' ఇది కవిరి (కాచు) అను కొందురేమో గాని, నిజముగా కాదు. కవిరిని ఒక తుమ్మజాతి చెట్టునుండి చేయుదురు. లవంగ చూరు, చేయుటకు కాయడిప్పతోడనే కత్తిరింతురు. తారుచు మంచి పోక కాయలను లవంగ చూరుచేయుట లేదు.లేక అపోక కాయలు విరేచన కారి. ఎండు కాయలు పొడి గాని, కాల్చిన కాయల పొడిగాని పండ్లకు మంచిది. వీని వాడుక అంతయు తాంబూలములోనే. సదా భోజన మైన పిదప తాంబూలము వేసి కొందుము. అన్నమరుగ జేయు శక్తి కొంచెము దానికి గలదందురు. మరియు తాంబూలమునందు వేసికొను మరి కొన్ని సుగంధ పదార్థములు వీర్య వృద్ధి చేయునందురు. గృహస్తులకు దప్ప మిగిలిన వారలు తాంబూలము వేసికొన కూడదనుటకు నిదియే కారణమై యుండును. ఏదియెట్లున్నను తాంబూలమునకు మిగుల గౌరవము గలదు. అసది నుండియు, మనలను జూడ వచ్చిన వారికి తాంబూలమిచ్చి గౌరవించుట మనకు ఆచార మైయున్నది. మన దేశమునకు క్రొత్తగా వచ్చినపుడు అయిఆరోపియనులు కూడ తాంబూలము తరచు వేసికొను చుండెడి వారట.
 
ఖర్జూరపు చెట్టు మన దేసములో కెల్ల సింధు, గుజరాతు, బండెలుఖండు, పంజాబు రాష్ట్రములో బెరుగు చున్నవి. వీనికి సరియగు శీతోష్టస్థితి కుదురుట కష్టము. పుష్పించు కాలమునందు గాని, కాయలు పండబోవు సపుడు గానివర్షము కురిసినచో బండ్లు పండవు. మరియు నీ చెట్లకు ఉష్ణమెక్కువగా నుండవలెను.
 
ఖర్జూరపు చెట్టు ఈత చెట్ల వలెనే యుండును. కాని వీని ఆకులు చివరల ముండ్లు వలె నుండవు. వీనిలోను పోతు చెట్లు ఆడు చెట్లు గలవు. ఇవి నూరు, నూట యిరువది అడుగు లెత్తు పెరుగుతు. అరటి మొక్కల మొదట పిలకలు మొలచినట్లు ఆరేండ్లు మొదలు పదునారేండ్లు వచ్చు వరకు నీ చెట్ల మొదట కూడ చిన్న చిన్నమొక్కలు మొలచును. ఈ చిన్న మొక్కలను దీసి పాతియే ఖర్జూరపు చెట్లను పెంచెదరు. గింజలనుండి కూడ మొక్కలు మొలచును గాని, అవి మొలచి పెద్దవగునంత కాలము ఓపికతో వేసి యున్నను, ఆమొక్కలు పోతుచెట్లైనచో ప్రయోజనమేమియు లేదు. అది గాక, ఆడ చెట్లైనను గింజల నుండి మొలచిన చెట్ల కంటె చిన్న పిలకలనుండి పెరిగిన చెట్లు ఎక్కువ కాయును. ఈ చిన్నమొక్కలను జాగ్రతగా దీసి 25 అడుగుల దూర దూరమున మూడేసి అడుగుల గోయి దీసి వానిలో తెలక పిండిని యితర ఎరువులు వేసి పాతెదరు. పాతిన మొదటి నెల ప్రతి దినమును, రెండవ నెల వారమునకు రెండు సారులును తరువాత నెలకొక మారును నీరు పోయు చుండ వలెను. అవి పాతిన మొదాటి సంవత్సరములో వర్షా కాలము నందు. చిన్న మొక్కలకు గడ్డి చుట్టుట మంచిది. చెట్ల్కు పువ్వులు పూయునపుడు నీళ్ళు బోయ రాదు గాని కాయలు కాసిన పిమ్మట విస్తారముగ పోయ వలెను. ఖర్జూరపు చెట్టు సాధారణముగ నెనిమిదేండ్లకు కాపునకు వచ్చును గాని అది నేల సారమును బట్టి యుండును. ఈ కంకులను గప్పుచు మట్ట యొకటి గలదు. స్త్రీ పుష్పములపై నున్న మట్ట చీలిన పిమ్మట్ను (ఈ మట్టలు పువ్వులు పెద్దవి కాగనె చీలును) పురుష పుష్పముల మట్ట చీలి పోవునపుడు దీని నుండి కొన్ని కంకులను కోసి స్త్రీ పుష్పముల మధ్య నిమిడ్చెదరు. అట్లు చేయ కున్నను కాయలు గాయును గాని, అది గాలిని బట్టి యుండును. ఒక్కొక్కప్పుడు, అట్లు చేయకున్న యెడల కాయలుగాయక పోవుటయు కలదు. ఈ రీతి నిముడ్చుట వలన పుప్పొడి ప్రతి స్రీ పుష్పమును చేర గల్గును. ప్రతి పువ్వు నుండి పెరుగు మూడు కాయలలోను చిన్నవిగ నున్నపుడే రెండు రాలి పోవును. అందుచే ఆహారము మిగిలి యున్న నొక దానికి సంవృద్ధిగ పోవును. ఒక్కొకప్పుడు కాయలు నీరసముగ నుండునని తోచిన యెడల కొన్నిటిని చిన్నవి గానున్నప్పుడే కోసి వేయుదురు. ఆ మిగిలిన కాయలకపుడాహారమెక్కువగ పోయి పెరుగును.
 
ఖర్జూరపు చెట్లు విరివిగా పెరుగు చోట చాపలు బుట్టలు, విసన కర్రలు మొదలగునవి వీని ఆకుల తోడనే నేచెసెదరు. ఆకుల మట్టలతో చేతి కర్రలు చేయు చున్నారు. అరేబియా దేశములో పువ్వుల మట్టల నుండి సుగంధమగు ద్రవము తీయు చున్నారు. ఆదేశస్తులకు కాయలు ఇక్కిలి ఉపయోగమగు ఆహార పదార్థము. మనము కాయలను శుభ కార్యములందు నితర పండ్లకు బదులుగా ఉపయోగించు చున్నారు. పండ్లు తినుటకు చాల రుచిగ నుండును. కాని చెట్టున పండిన పండునకు బదులుగ బజారులందు బెల్లపు నీళ్ళలో నానవేసిన దానిని అమ్మతెచ్చెదరు. ఖర్జూరపు చెట్ల నుండి కూడ కల్లు పంచదారయు వచ్చును.
 
ఈత చెట్లు మన దేశము నందెక్కువగానె పెరుగు చున్నవి. వీని ఆకులు గింజలు ఖర్జూరపు చెట్ల ఆకుల గింజల వలె నుండును. కాని వీని పండ్లలో నంతకండ లేదు. ఈత చెట్ల నుండి కల్లు చాల వచ్చును. ఈ కల్లునకు ధరయు చాల గలదు. దీని నుండి కూడ పంచ దార చేయు చున్నారు.
 
చిట్టీత చెట్లు ఈత చెట్ల వలెనే యుండును గాని చాల పొట్టిగా నుండును. దీని పండ్లు కూడ చిన్నవి. ఇవి పండిన తరువాత నీత పండ్ల వలె ఎర్రగ నుండక నల్లగా నుండును.
 
పేవ బెత్తములు కూడ నీకుటుంబము లోనివె. అవి అడవులలో చెట్ల మీద తీగెల వలె ప్రాకును. వాని పొడుగున ఆకులు దూర దూరమున నుండును. పేవ బెత్తములలో జాల తెగలు గలవు. కొన్ని లావుగ నుండును. కొన్ని సన్నముగా నుండును. కొన్ని విస్తారము పొడుగుగ నుండును. వీనితో కుర్చీలు, చేతి కర్రలు, చాపలు, బుట్తలు మొదలగునవి చేయుదురు. పేప బెత్తములను కోయగనే వానినుండి పలుచని ద్రవము గారును. ఈ ద్రవమునుండి అరపూస వంటి పదార్థము చేయుదురు. బెత్తములు సన్నముగాను పొడుగుగాను నుండి ఎటైనను వంగు చుండుట చేత త్రాడువలె నవి ఉపయోగించును. ఇవి త్రాడునకంటె ఎక్కువ బరువు నాపును.
 
జీలుగ చెట్టు అరువది అడుగులెత్తు పెరుగును. పువ్వుల కంకి మీద రెండు మగ పువ్వుల మఖ్య నొక ఆడు పుష్పముండును. జీలుగమాను గట్టిగా నుండి కలప వలె ఉపయోగించును. దాని నుండి మంచి నారయు దీయ వచ్చును. ఈ నారతో జేయు పగ్గములు ఏనుగులనైన కట్టుటకు సరిపోవునంత గట్టిగా నుండును. ఈ చెట్లును కూడ గీసి కల్లు తీయుదురు. దీని నుండియు బెల్లము చేయుచున్నారు. మాను మధ్యనున్న దవ్వలో నుండి సగ్గు బియ్యమును వండుదురు. సగ్గుబియ్యము గింజలవలె నుండును గాని గింజలు గావు. బియ్యములో నేమి పదార్థము గలదో దీనిలోను నదియే కలదు. ఈ పిండి పదార్థము చెట్టు నడుమనుండు దవ్వలో నుండును. కాయలు కాచునపుడే పదార్థమంతయు ఉపయోగ పడును గావున సగ్గు బియ్యము చేయుటస్కు చెట్లు పుష్పింపక పూర్వము వానిని నరికి, దవ్వను చిన్న చిన్న ముక్కలుగ కోసిన పొడుము చేసెదరు. ఈ పొడుము నీళ్ళఓ గలపి రెండు చేతులతోడను రాయచు జంత్రికల చట్రము వంటి వాని మధ్య పెట్టుదురు. నారంతయు పైన మిగిలిన, అడుగునకు పిండి పోవును. దీనిని చిక్కగ నీళ్ళతో గలపి జల్లెడల మీద పెట్టి చేతితోడనే ''కారపుపూస '' /''బూంది '' దూసినట్లు దూయుదురు. కనుక పిండి అంతయు చిన్న చిన్న యుండల వల్లె పడును. ఇదియే సగ్గు బియ్యము. సగ్గు బియ్యము యెక్క పరిమాణము ఆ జల్లెడ కంతలను బట్టి యుండును.
==మూలము==
https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:VrukshaSastramu.djvu/455&action=edit
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు