క్లాస్ట్రోఫోబియా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 41 interwiki links, now provided by Wikidata on d:q186892 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{About|the fear of enclosed spaces|2004 film|Claustrophobia (2004 film)|2008 film|Claustrophobia (2008 film)}}
 
'''క్లాస్త్రోఫోబియా''' అనే మాట లాటిన్, గ్రీకు పదాల నుంచి పుట్టింది. లాటిన్‌లోని ''క్లస్ట్రోమ్'' ‌ అంటే ఏదైనా ఓ ప్రదేశంలో ఇరుక్కుపోవడం అని అర్థం. (వ్యతిరేక పదం: ''క్లాస్త్రోఫిలియా'' ) ''{{lang|el|φόβος}}'' ఇక గ్రీకుభాషలో ''[[ఫోబియా|ఫోబస్]]'' అంటే భయం అని అర్థం. అంటే ఎక్కడైనా ఓ చోట తప్పించుకోడానికి వీల్లేకుండా ఇరుక్కుపోయినట్టు భయపడటమే క్లాస్త్రోఫోబియా. ఇది సాధారణంగా మానసిక వ్యాకులత, తీవ్ర ఆందోళనల రూపంలో ఉంటుంది. ఒక్కోసారి తీవ్రపరిణామాలకి కూడా దారితీయొచ్చు. ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదు నుంచి ఏడు శాతం మంది తీవ్రమైన క్లాస్త్రోఫోబియాతో బాధపడుతున్నవాళ్లు ఉన్నారు. వాళ్లలో చాలా కొద్దిశాతం మంది మాత్రమే చికిత్స తీసుకొని బయటపడగలుగుతున్నారు.<ref name="Phobias">ఫోబియాస్‌ : ఏ హ్యాండ్‌బుక్ ఆఫ్ థియరీ, రీసెర్చ్‌, అండ్‌ చికిత్స‌. చికిస్టర్‌ , న్యూయార్క్‌ : విలే, 1997.</ref>
 
== క్లాస్త్రోఫోబియా యొక్క ప్రాధమిక లక్షణాలు ==
పంక్తి 20:
 
===క్లాస్త్రోఫోబియా స్కేల్‌===
క్లాస్త్రోఫోబియా తీవ్రతను తెలుసుకునేందుకు కొలిచేందుకు 1979లోనే ఓ స్కేల్‌ని రూపొందించారు. ఈ ఫోబియాకి చేసిన చికిత్సలు, దీని మీద వచ్చిన వ్యాసాలు‌, చేసిన పరిశోధనలు ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. మొదటిసారిగా ఈ స్కేల్‌ని తీర్చిదిద్దిన తర్వాత దాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడం, ఆ తర్వాత అందులో మార్పులు చేర్పులు చేయడం జరిగాయి. ప్రస్తుతం ఇందులో 20 ప్రశ్నల వరకు ఉన్నాయి. మానసిక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులతోపాటు వాటి నుంచి బైటపడేందుకు ఏం చేయాలన్న విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది క్లాస్త్రోఫోబియాకి సరైన చికిత్స అని చాలా పరిశోధనల్లో రుజువైంది.<ref name="Scale">ఓఎస్‌టీ, లార్స్‌-గోరాన్‌ "ది క్లాస్త్రోఫోబియా స్కేల్‌ : ఎ సైకోమెట్రిక్‌ ఎవాల్యుయేషన్‌" బిహేవియర్‌ రీసెర్చ్‌ అండ్ చికిత్స 45.5 (2007): 1053–64.</ref>
 
===క్లాస్త్రోఫోబియా ప్రశ్నావళి===
పంక్తి 29:
వ్యాకులత కల్గించే చాలా సమస్యలకి సరైన పరిష్కారం ఈ కాగ్నిటివ్ చికిత్స.<ref name="Treatment">చోయ్‌, యుజన్‌, అబ్బే జె.ఫైర్‌, అండ్ జోష్‌ డి.లిప్‌సిట్జ్‌ "చికిత్స ఆఫ్ స్పెసిఫిక్ ఫోబియా ఇన్ అడల్ట్స్‌" క్లినికల్‌ సైకాలజీ రివ్యూ 27.3 (2007): 266–86.</ref> ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితులను చూసి భయపడడం కాదు అలాంటి పరిస్థితులు ఇంకా ఎలాంటి స్థితికి దారితీస్తాయోనన్న ఆందోళన ఉన్న రోగిల విషయంలో ఇది ఎంతగానో ప్రభావవంతంగా ఉంటుంది.<ref name="Treatment"></ref> అసలు దేని గురించి అయితే భయపడుతున్నారో, ఎలా భయపడుతున్నారో ఆ భయాలన్నింటినీ దూరం చేసేయడమే ఈ చికిత్స లక్ష్యం. ఆలోచనల్లో మార్పు తెప్పించి, అలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించి ఆందోళనల నుంచి ఈ చికిత్స బయటపడేస్తుంది.<ref name="Treatment"></ref> ఉదాహరణకి ఎలివేటర్ చూసి భయపడే రోగి ఉన్నాడనుకోండి. అసలు ఎలివేటర్‌ను చూసి భయపడాల్సిన పనేలేదని మనం త్వరంగా ప్రయాణించేందుకు వీలుగా రూపొందించుకున్న ఓ సాధనం ఎలివేటర్‌ అని అతనికి స్ఫురణకి తెచ్చేందుకు ఈ చికిత్స‌ సహాయపడుతుంది. ఎస్‌.జె.రాచ్మన్‌ చేసిన పరిశోధనల్లో ఈ కాగ్నిటివ్ చికిత్స ఎంతో ప్రయోజనకరమని తేలింది. క్లాస్త్రోఫోబియా ఉన్నవాళ్లలో ఈ చికిత్స తీసుకున్న తర్వాత కనీసం 30 శాతానికి పైగా మార్పు వచ్చినట్టు నిర్థారణ అయ్యింది. అంటే మానసిక వ్యాధుల విషయంలో ఇంతమార్పు అంటే కచ్చితంగా గణనీయమైన పరిణామమే అనుకోవాలి.<ref name="Phobias"></ref>
 
===''ఇన్‌ వివో'' ఎక్స్‌పోజర్===
అసలు భయపెడుతున్న పరిస్థితులు ఏమిటో తెలుసుకొని వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం ఎలాగో ఈ పద్దతి రోగులకి నేర్పుతుంది.<ref name="Treatment"></ref> ఈ రకమైన చికిత్స‌లో తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ముందు సాధారణంగా మొదలై ఆ తర్వాత తీవ్రత ఎక్కువవుతుంది.<ref name="Treatment"></ref> అంటే క్లాస్త్రోఫోబియా ఉన్న రోగి‌ ముందు ఎలివేటర్‌ని వాడతాడు. తర్వాత క్రమంగా MRIకి కూడా సిద్దపడతాడు. క్లాస్త్రోఫోబియా సహా చాలా రకాల భయాలకి ఇది చాలా సమర్థమైన చికిత్స అని పరిశోధనల్లో తేలింది.<ref name="Treatment"></ref> ఎస్‌.జె.రాచ్మన్‌ ఈ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ చికిత్స తీసుకున్న తర్వాత చాలా మందిలో భయం తగ్గి, ఆత్మస్థైర్యం పెరిగిందని, పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని రుజువైంది. సుమారు 75 శాతం మందిలో ఈ చికిత్స మార్పు తీసుకొచ్చినట్టు తేలింది.<ref name="Phobias"></ref> ఈ రకమైన ఫోబియాలకు చేసే చికిత్స‌లలో చాలా చాలా మెరుగైన ఫలితాలు ఇచ్చిన విధానం ఇదే.<ref name="Phobias"></ref>
 
పంక్తి 71:
 
===క్లాస్త్రోఫోబియా ఉన్న మరియు లేనివాళ్లలో సంభావ్యత===
మొత్తం 98 మంది మీద పరిశోధన జరిగింది. అందులో 49 మంది క్లాస్త్రోఫోబియా చికిత్స‌ తీసుకున్నవాళ్లు. మిగతావాళ్లు భయాలు ఉన్నా మామూలుగా బతుకుతున్నవాళ్లు. క్లాస్త్రోఫోబియాకి కారణమయ్యే పరిస్థితుల్లో వాళ్ల స్పందన చూస్తే ఇద్దరికీ తేడా తెలుస్తుంది. ఒక్కొక్కరికీ మూడు రకాల పరీక్షలుంటాయి. ఒకటి క్లాస్త్రోఫోబియాకి సంబంధించిన విషయం. రెండోది భయాన్ని పెంచేది . మూడోది భయాన్ని తగ్గించేది. ఆ మూడు ఘటనలు ఎలా అనిపించాయో వారిని ప్రశ్నించారు. క్లాస్త్రోఫోబియా చికిత్స‌ తీసుకున్నవాళ్లు ఇచ్చిన మూడు అంశాల్లో క్లాస్త్రోఫోబియాకి సంబంధించిన విషయాల్ని ప్రత్యేకించి గుర్తుపట్టగలిగారు. మిగతా పాజిటివ్‌, నెగెటివ్‌ అంశాల విషయంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. క్లాస్త్రోఫోబియా ఉన్నవాళ్లు అప్పటికే చికిత్స తీసుకున్నారు కాబట్టి సాంకేతికంగా ఇది పెద్ద విషయం అని చెప్పుకోలేం.{{Citation needed|date=December 2009}} ఎందుకంటే అప్పటికే చికిత్స తీసుకున్నవాళ్లు క్లాస్త్రోఫోబియాకి సంబంధించిన విషయాల్ని ప్రత్యేకించి గుర్తుపట్టగలుగుతారు. అంతేకాదు వాటి వల్ల తమకు ఏదో జరిగే అవకాశం ఉందని కూడా ఆలోచిస్తారు. అందుకే వాళ్లలో అలాంటి భావన ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి.<ref>ఓఎస్‌టీ, లార్స్-గోరన్, అండ్ పేటర్ కాట్లస్ "ప్రోబబులిటి రేటింగ్స్ ఇన్ క్లాస్త్రోఫోబియా రోగిస్ అండ్ నార్మల్ కంట్రోల్స్." బిహేవియర్‌ రీసెర్చ్‌ అండ్ చికిత్స 38.11 (2000): 1107.</ref>
 
==వీటిని కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/క్లాస్ట్రోఫోబియా" నుండి వెలికితీశారు