ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
 
క్రీస్తుశకం 13వ శతాబ్ధానికి చెందిన వీరుడు '''ఖడ్గతిక్కన''' లేదా '''రణ తిక్కన'''. ఈయన [[తిక్కన]] సోమయాజి పెద తండ్రి అయిన సిద్ధన మంత్రి కుమారుడు<ref name=tik1>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.214</ref>. తల్లి పోతాంబ. ఖడ్గ తిక్కన 1190లో జన్మించాడని ఆరుద్ర చారిత్రక మరియు సాహితీ ఆధారలను పరిశీలించి నిర్ణయించాడు. తనకు 70యేళ్ల దాకా అంటే 1260దాకా మనుమసిద్ధి కొలువులో ఉన్నాడని తేలింది. చరిత్రకారులు ఖడ్గతిక్కన 1260లో కాటమరాజుతో జరిగిన యుద్ధంలో మరణించాడని ముక్తకంఠముతో చెబుతున్నారు కానీ కాటమరాజు చరిత్రమీద ప్రత్యేక పరిశోధన చేసిన మీదట అందులో చారిత్రకసత్యం లేదని , 70 ఏళ్ల ఖడ్గతిక్కన యుద్ధానికి వెళ్లటం, 90యేళ్ల తల్లి విరిగిన పాలుపోయటంలో సంభావ్యత లేదని ఆరుద్ర భావించాడు.<ref>సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.110</ref>
 
==కుటుంబం==
కేతన రచించిన ''దశకుమార చరిత్ర''లో ఖడ్గ తిక్కన వంశాన్ని చాలా వివరంగా వర్ణించాడు. ఖడ్గ తిక్కన ఇంటిపేరు కొట్టరువు. ఖడ్గ తిక్కన తాత అయిన భాస్కరమంత్రికి నలుగురు కుమారులు: పెద్దవాడు కేతనప్రగ్గడు, రెండవవాడు మల్లన, మూడవవాడు సిద్ధన, చివరి వాడు కొమ్మన. తిక్కన సోమయాజి తండ్రి కొమ్మన. ఖడ్గతిక్కన తండ్రి సిద్ధన చోడ తిక్కరాజు కు మంత్రిగా పనిచేశాడు. సిద్ధనమంత్రికి ఏడుగురు కుమారులు: ఖడ్గతిక్కన, భాస్కరుడు, కేతన, మల్లన, మల్లన, చిన భాస్కరుడు, పెమ్మన. వీరందరూ నెల్లూరి చోడుల ఆస్థానములో పనిచేసినవారే.<ref>సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.105</ref>
 
ఖడ్గ తిక్కన భార్య జానమ్మ. వీరికి సిద్ధన, కొమ్మన, ఇమ్మడిమనుమసిద్ధి, ముమ్మడి మనుమసిద్ధి అని నలుగురు కుమారులు.<ref>సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.109</ref>
 
==యుద్ధం==
నెల్లూరు తెలుగు చోళ వంశపు పాలకుడు [[రెండవ మనుమసిద్ధి]]<ref>http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf పేజీ.131,132</ref><ref name=tik1>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.214</ref>/[[మూడవ మనుమసిద్ది]]{{చూడు|ref1}}<ref>సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి రెండవ భాగం రచన: ముప్పాళ్ల హనుమంతరావు పేజీ.185</ref>కి, ఆయన సామంతుడు, కనిగిరి సీమలోని ఎర్రగడ్డపాడు యాదవరాజైన కాటమరాజుకు [[పుల్లరి]] విషయమై వైరం వస్తుంది. అది చివరకు యుద్ధానికి దారితీస్తుంది. మనుమసిద్దిరాజు మంత్రి, తన సర్వసైన్యాధక్షుడైన ఖడ్గతిక్కనను కాటమరాజుపై యుద్ధానికి సైన్యంతో సహా పంపాడు. క్రీ.శ. 1260 ప్రాంతాల్లో ఖడ్గతిక్కనకు, కాటమరాజుకు [[పెన్నా నది]] ఒడ్డున [[సోమశిల]] వద్ద భీకర యుద్ధం జరిగింది. ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడి, సైన్యాన్నంతా పోగొట్టుకుంటాడు.
యుద్దములో ఓడిపోయి ఇంటికి వచ్చిన ఖడ్గ తిక్కనకు తన తల్లినుండి కానీ, భార్యనుండి కానీ ఆశించిన పలకరింపు దొరకలేదు. ఆయన భార్య ఒక నులక మంచం అడ్డు పెట్టి రెండు బిందెల నీళ్ళు, ఒక పసుపు ముద్ద పెట్టి స్నానం చేయమని చెప్పింది. ఖడ్గ తిక్కన అవి ఎందుకు అన్నపుడు ' మీరు ఆడువారివలె యుద్దములో ఓడి పారిపోయి వచ్చారు. ఆడువారు స్నానం చేయుట ఎవరూ చూడరాదు అందుకే నులకమంచం అడ్డుగా పెట్టినాను. మీ మొహమునకు రాసుకొనుటకు ఆ పసుపు ముద్ద. ఇకనుండి ఈ ఇంటిలో నేను, మీ తల్లిగారు, మీతో కలసి ముగ్గురు ఆడవాళ్ళమూ అన్నది.
ఆమె మాటలు పద్యరూపంలో:
"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు