ఖారవేలుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 7 interwiki links, now provided by Wikidata on d:q1391280 (translate me)
చి Wikipedia python library
పంక్తి 9:
 
 
ఖారవేలునికి సమకాలీనుడు ఆంధ్రదేశంలో [[శాతవాహనులు|శాతవాహన]] రాజు శాతకర్ణి. వారికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని [[హథీగుంఫ శాసనం]] (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట."
ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా [[భట్టిప్రోలు]] అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ దేశాలనుండి రత్నాలు తెచ్చాడు.
 
 
ఖారవేలుడు యుద్ధవీరుడే కాక ఎంతో సమర్ధత గల రాజు. పౌర జానపదులకు అనేక సౌకర్యాలు కలిగించాడు. అంతకు పూర్వం మగధ రాజులు వేయించిన కాలువలు పూడిపోగా ఖారవేలుడు వాటిని తిరిగి మరమ్మతు చేయించాడు. రాజధానికి నీటివసతి కల్పించాడు. జైనానికి ఇతోధికంగా ప్రోత్సాహం కలిగించాడు. 164 జైనమత గ్రంధాలను పునరుద్ధరించాడు. తుఫానులవలన పడిపోయిన గోపుర ప్రాకారాలను బాగుచేయించాడు. 35 లక్షల ప్రజలు అతని రాజ్యంలో ఉండేవారు.
 
==వనరులు==
* ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
 
* ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
"https://te.wikipedia.org/wiki/ఖారవేలుడు" నుండి వెలికితీశారు