గండికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 7:
==చినతిమ్మానాయుడు==
 
[[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] స్థాపకుడు [[మొదటి బుక్క రాయలు|బుక్క రాయలు]] క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించాడు. ఈతని అల్లుడు పెమ్మసాని తిమ్మానాయుడు. [[ధరణికోట]] సమీపమున గల [[బెల్లంకొండ]] వాస్తవ్యుడు. మగ సంతానములేని కారణమున రామానాయుని తదుపరి తిమ్మానాయునికి అధికారము సంక్రమించింది. కలుబరిగె (గుల్బర్గా) యుద్ధములో తిమ్మానాయుని సాహసానికి సంతసించి [[రెండవ ప్రౌఢ దేవరాయలు]] క్రీ. శ. 1422లో [[యాడికి]] పరగణా వ్రాసి ఇచ్చాడు. తిమ్మానాయుడు క్రమముగా తన రాజ్యాన్ని [[గుత్తి]], [[తాడిపత్రి]], [[జమ్మలమడుగు]] ప్రాంతాలకు విస్తరించాడు. ఈతని తదుపరి వరుసగా [[పెమ్మసాని రామలింగ నాయుడు]], పెదతిమ్మ, బలిచిన్న, అరతిమ్మ, నారసింహ, బొజ్జతిమ్మ మొదలగు వారు పాలించారు. చివరి పాలకుడు చినతిమ్మా నాయుని కాలములో [[గండికోట]] ముస్లిముల వశమయ్యింది.
 
==మీర్ జుంలా==
 
మీర్ జుంలా పారశీక ([[ఇరాన్]]) దేశమునకు చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. [[గోలకొండ]] రాజ్యముతో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి [[భారతదేశము]] చేరాడు. స్వయముగా వజ్రాలవ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. తదుపరి గోలకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగాడు. మచిలీపట్టణములో స్థావరము ఏర్పరచుకొని తెలుగు దేశములోని వజ్రసంపదపై గురిపెట్టాడు<ref>The Life of Mir Jumla, J. N. Sarkar, Rajesh Publications, Delhi, 1979, pp. 4-5</ref>.
 
 
విజయనగర సామ్రాజ్యములోవజ్రాల గనులున్న [[రాయలసీమ]]పై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన [[పెమ్మసాని నాయకులు]] పాలిస్తున్న [[గండికోట]] జుంలా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుంలా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రము తెలిసిన మైల్లీ అను ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణుడు ఉన్నాడు<ref>The French in India, Rose Vincent, 1990, Popular Prakashan, p.9, ISBN 0861322592</ref>.
 
==యుద్ధము==
పంక్తి 28:
 
 
బంధువుల సాయముతో మైసూరు రాజ్యము చేరిన పిన్నయ నాయుడు తమిళదేశానికి తరలించబడతాడు. గండికోట లోని అరువదియారు ఇంటిపేర్లు గల కమ్మ వంశములవారు చెల్లాచెదరైపోయి పలు ప్రాంతాలలో స్థిరపడతారు. వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, మధుర, గుంటూరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతాలకు పోతారు. వీరికే 'గంపకమ్మవారు', 'గండికోట కమ్మవారు' అను పేరులు వచ్చాయి. మధుర చేరిన పెద వీరప్ప నాయుడు నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెడతాడు. వీరి వారసులు మధుర సమీపములోని కురివికులం, నాయకర్పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులయ్యారు.
 
 
మూడు శతాబ్దములు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయములు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గండికోట_యుద్ధం" నుండి వెలికితీశారు