హిందుస్థానీ సంగీతము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము''' [[భారతీయ శాస్త్రీయ సంగీతము|భారతీయ శాస్త్రీయ సంగీత]] సంప్రదాయాలలో ఒకటి, 13-14 శతాబ్దములలోని సాంస్కృతిక పరిస్థితులచే అమితముగా ప్రభావితమైనది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతపు మూలములు మానవ చరిత్రలోనే అత్యంత ప్రాచీన శాస్త్రములైన [[వేదాలు|వేదముల]] సంప్రదాయములోనివి. ఇందువలన హిందుస్థానీ సంగీతము యొక్క మూలములు మానవ చరిత్రలోని అత్యంత పురాతనమైన సంగీత సంప్రదాయములలోనివని భావించవచ్చును.
 
 
నాలుగు వేదములలో ఒకటైన [[సామవేదము]] దీనికి సంబంధించిన సంపూర్ణ సాహిత్యమును వివరిస్తుంది. హిందుస్థానీ సంగీతము [[ధ్యానము]] రూపములో కూడా కలదు, కానీ ఇది కొందరు అదృష్టవంతులకు మాత్రమే అందుబాటులో కలదు.
 
 
హిందుస్థానీ సంగీతము [[రాగము]] లు మరియు [[తాళము]] లపై ఆధారపడి, మానవ శరీరంలోని వివిధ "చక్రముల"ను ప్రభావితం చేయగలిగి [[కుండలిని]] శక్తి దిశగా తీసుకు వెళ్తున్నది. [[వేదము]]ల యొక్క పద్ధతులు ముఖ్యముగా భౌతిక, మానసిక మరియు [[ఆధ్యాత్మిక]] వికాసములకు తోడ్పడి ఈ చక్రముల ఉత్తేజపరుచుటతో అనుసంధానమై ఉన్నది.
 
 
భారతీయ శాస్త్రీయ సంగీతము మానవ సమాజముచే సృష్టించబడిన సంగీత పద్ధతులన్నింటిలో అత్యంత క్లిష్టమైనది మరియు సంపూర్ణమైనది. [[పాశ్చాత్య సంగీతము]]లోని ఎనిమిది మూల స్వరములు డొ రె మి ఫ సొ ల టి డొ, స రె గ మ ప ద ని స లకు సమానము.
 
 
[[స్వరము]]ల ఆధారముగా పాడే పద్ధతి వేదముల కాలము నాటికే ప్రసిద్ధమైనది. సామ వేదములోని పవిత్ర స్తోత్రములను పాడేవారు కానీ, వల్లె వేసేవారు కాదు. ఇది ఎన్నో శతాబ్దముల నుండి అభివృద్ధి చెంది భారత దేశాన (ప్రస్తుత [[పాకిస్తాన్]], [[బంగ్లాదేశ్]]లతో పాటు) స్థిరపడినది. దక్షిణ భారతము నందు ప్రముఖమైన [[కర్నాటక సంగీతము]] వలె గాక, హిందుస్థానీ సంగీతము ప్రాచీన హైందవ సంస్కృతి, వేదాల తత్వములు, పురాతన శబ్ద వాయిద్యములతో పాటు [[మొఘల్]] సామ్రాజ్య సమయమునందు [[పర్షియా]] దేశపు సంగీత విధానముల కలయిక కలదు.
 
 
[[దక్షిణ ఆసియా]]కు ఆవల హిందుస్థానీ సంగీతము భారతీయ సంగీతముగా పరిగణించబడటము పరిపాటి. భరత ఖండమునకు ఆవల ఇది అత్యంత ప్రీతిపాత్రమైన సంగీత పద్ధతి అని భావించవచ్చు.
 
 
కర్ణాటక సంగీతము మాదిరిగా, హిందుస్థానీ సంగీతము ఆరోహణ, అవరోహణములతో కూడిన [[రాగము]]ల యొక్క స్వభావములతో క్రమబద్ధీకరించబడినవి. రాగమునందు [[ఆరోహణ]] [[అవరోహణ]]ల యందున్న క్రమములో ఒకే స్వరములు ఉండవలెనన్న నిబంధన లేదు. రాగ స్వభావమునకు [[వాది]] మరియు [[సంవాది]]లతో కూడిన ఒక ప్రత్యేకమైన అమరికను [[పకడ్]] అంటారు. వీటితో పాటు ప్రతి రాగమునకు [[అంబిత్]], [[మీండ్]]యను నిబంధనలు మరికొన్ని ప్రత్యేక లక్షణములు కలవు.
 
 
ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభమున, హిందుస్థానీ సంగీతమును ప్రస్తుత [[థాట్]] పద్ధతిన క్రమబద్ధీకరణ చేసిన వారు పండిట్. విష్ణు నారాయణ్ భాత్కండే (1860-1936) గారు. అంతకు ముందు రాగములను [[రాగ]] (మగ), రాగిణి (ఆడ) మరియు పుత్ర (శిశు) క్రమమున ఏర్పరచి ఉండేవి.
 
 
కళాకారులు, ముఖ్యముగా కచేరి చేయువారు (కృతులను రచించువారు కాదు) జనామోదాన్ని పొందిన తరువాత వారి పేర్లకు హిందువులయితే పండిట్ అని ముస్లిములయితే ఉస్తాదులని కలిపి గౌరవిస్తారు.