గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

+{{తెలంగాణ సాహిత్యం}}
చి Wikipedia python library
పంక్తి 2:
స్వాంభువ, స్వారోచుష, ఉత్తమ [[మనువు]]ల కాలం గడిచి తామసుడు మనువు గా ఉన్న సమయంలొ శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని [[శుక మహర్షి]] పరిక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అదివిని పరిక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా అడుగగ ఆ మహర్షి '''గజేంద్ర మోక్షం''' ([[సంస్కృతం]]: गजेन्द्रमोक्षः) గాధను వివరిస్తాడు. ఇది [[పోతన]] రచించిన [[భాగవతం]]లోనిది.

==త్రికూట పర్వత విశేషాలు==
[[File:Brooklyn Museum - Vishnu Saving the Elephant (Gajendra Moksha).jpg|thumb|మహావిష్ణువు గజేంద్రున్ని రక్షించడం.]]
[[File:Gajendra Moksha.jpg|thumb|విష్ణుమూర్తి గజేంద్రున్ని రక్షించడం.]]
క్షీరసాగర మధ్యంలో [[త్రికూటం]] అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మాడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో , ఇంకో శిఖరం ఇనుము తో, మరొకటి వెండితో అలరారుతూండేవి. ఆ కొండల మీద రత్న ధాతువు రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలొ అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన క్రూర మ్రుగాలతొ పాటు [[ఏనుగు]]లు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గంపులు గా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలొ అంధకారం అలముకొనేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరు కొన్నాయి.

==గజరాజు తప్పిపోవడం జల క్రీడలు ఆడడం==
అలా ఏనుగులు చేరుకొన్న ఆ సరోవరం అతి విశాలమైనది, ఆ సరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. ఆ జల చరాలతో పాటు కొన్ని [[మొసళ్ళు]] కూడా ఉన్నట్లూ ఏనుగు లకు తెలియదు. ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకొని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరం లొకి ప్రవేశించి దాహబాధ తీర్చుకొని, తోండం నిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. అలా నీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలొని కర్కకాటక మీనాలు , రోదసిలోని మీన కర్కాకాటాకాలను చేరినట్లు కనిపించింది.

==కరిమకర సంగ్రామం==
ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలొ ఆ చెరువు లో ఉన్న ఒక మకరం ఆ గజరాజు కాలు పట్టింది. పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది. వేంటనే ఆ మెసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది. ఆ ఏనుగు తన దంతాలతో మెసలిని కుమ్మి విడిచింది. అప్పుడు ముసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. అలా ఆ కరి మకరం ఒక దానిని ఒకటి కుమ్మి చీల్చుకొంటుండగా కరి బలం సన్నగిల్లుతోంది. జలమే తన నివాసస్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తోంది.

కరి దిగుచు మకరి సరసికి

పంక్తి 85:
అని పలికి, మఱియు నరక్షిత రక్షకుండైన యీశ్వరుండాపన్నుండైన నన్నుం గాచుఁ గాక యని, నింగి నిక్కి చూచుచు, నిట్టూర్పులు నిగడింపుచు, బయలాలకింపుచు, నగ్గజేంద్రుండు మొఱసేయుచుల్న సమయంబున,

==కరి మొర విని [[శ్రీమహావిష్ణువు]] భూలోకానికి రావడం==
[[బొమ్మ:Gajendra moksham1.JPG|thumb|400px|right|వైకుంఠం తరలి వచ్చే చిత్రం]]
అలా మొరపెట్టుకొన్నప్పుడు శ్రీమహావిష్ణువు ఎలా ఉన్నాడయ్యా అంటే

పంక్తి 113:

==శ్రీ లక్ష్మీ దేవి సంశయం==
అలా వెళ్తున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తన మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది. ఏ దుష్ట [[దుశ్శాసనుడు]] [[కబంధుడు|కబంధ]] హస్తాలలోనైన చిక్కుకొని [[ద్రౌపది]] దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా! మళ్ళి పరమ మూర్ఖుడైన [[సోమకాసురుడు]] [[చతుర్వేదాలు|వేదాలు]] దొంగిలించడానికి వచ్చాడా! అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా! [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] వంటి భక్తులను హింసించే [[హిరణ్యాక్షుడు]] మళ్ళీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది.

తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ, డనాథ స్త్రీ జనాలాపముల్

పంక్తి 124:

==శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం==
ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరీచేరుతూనే తన [[సుదర్శన చక్రం|సుదర్శన చక్రాన్ని]] విడిచి పెట్టగానే విస్ఫుల్లింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలితలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని([[శంఖం]]) పూరిస్తాడు. ఆ పాంచజన్య ధ్వని శతృ జనానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది. నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు [[వైకుంఠం|వైకుంఠాన్ని]] చేరుకొంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని [[శ్రీదేవి]]కి చెప్పగా, ఆ లక్ష్మి దేవి దీనుల మొర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది.

కరుణాసింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపె, స

పంక్తి 141:

:''శ్రీ శుక ఉవాచ''
:ఎవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనో హృది |
:జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం || 1 ||

:''గజేంద్ర ఉవాచ''
:ఓం నమో భగవతే తస్మై యత ఎతచ్చిదాత్మకం |
:పురుషాయాది బీజాయ పరెశాయాభిధీమహి || 2 ||

:యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం ఇదం స్వయం |
:యోస్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం || 3 ||

:యః స్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం |
:అవిద్ధదృక్సాక్ష్యు భయం తదీక్షతె ఆత్మమూలోవతు మాం పరాత్పరః || 4 ||

:కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లొకేశు పాలేషు సర్వహేతుషు |
:తమస్తదాసీద్గహనం గభీరం యస్తస్య పారేభివిరాజితే విభుః || 5 ||

:న యస్య దేవా ఋషయ: పదం విదుర్జంతు: కోర్హతి గంతుమీరితుం |
:యథా నటస్యాకృతిర్విచేష్టతో దురత్యయానుక్రమణ: మావతు || 6 ||

:దిదృక్షవో యస్య పదం సుమంగలం విముక్తసంగా మునయ: సుసాధవ: |
:చరంత్య లోక వ్రతమవ్రణం వనే భూతాత్మ భూతా: సహృద: మే గతి: || 7 ||

:న విద్యతే యస్య జన్మ కర్మవా నామరూపే గుణదోష ఏవ వా |
:తథాపి లోకాప్యయ సంభవాయ య: స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి || 8 ||

:తస్మై నమ: పరేశాయ బ్రహ్మణేనంతశక్తయే |
:అరూపయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే || 9 ||

:నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే |
:నమో గిరాం విదూరాయ మనశ్చేతసామపి || 10 ||

:సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా |
:నమ: కైవల్యనాథాయ నిర్వాణసుఖసంవిదే || 11 ||

:నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే |
:నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ || 12 ||

:క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే |
:పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమ: || 13 ||

:సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వప్రత్యయ హేతవే |
:అసతాచ్ఛాయాయ యోక్తాయ సదాభాసాయ తే నమ: || 14 ||

:నమో నమస్తేఖిలకారణాయ నిష్కారణాయాద్భుతకారణాయ |
:సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ || 15 ||

:గుణారణిచ్ఛన్నచిదూష్మపాయ తత్క్షోభవిస్ఫూర్జితమ్ఆనసాయ |
:నైష్కర్మ్యభావేన వివర్జితగమ స్వయంప్రకాశాయ నమస్కరోమి || 16 ||

:మాదృక్ప్రపన్న పశుపాశవిమోక్షణాయ ముక్తాయ భూరికారణాయ నమోలయాయ |
:స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీతప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే || 17 ||

:ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తైర్దుష్ప్రాపణాయ గుణసంగవివర్జితాయ |
:ముక్తాత్మభి: స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ || 18 ||

:యం ధర్మకామార్థవిముక్తకామా భజంత ఇష్టాం గతిమాప్నువంతి |
:కిం త్వాశిషోరాత్యపి దేహమవయం కరోతు మేదభ్రదయో విమోక్షణం ||19 ||

:ఏకాంతినో యస్య కంచనార్థం వాంఛంతి యే వై భగవత్ప్రపన్నా: |
:అత్యద్భుతం తచ్చరితం సుమంగలం గాయంత ఆనందసముద్రమగ్నా: || 20 ||

:తమక్షరం బ్రహ్మ పరం పరేశ మవ్యక్తమాధ్యాత్మికయోగగమ్యం |
:అతీంద్రియం సూక్ష్మమివాతిదూరమనంతమాద్యం పరిపూర్ణమీడే || 21 ||

:యస్య బ్రహ్మాదయోదేవా వేదా లోకాశ్చరాచరా: |
:నామరూపవిభేదేన ఫల్గ్వ్యా కలయా కృతా: || 22 ||

:యథార్చిషోగ్నే: సవితుర్గర్భస్తయో నిర్యాంతి సంయాంత్యసకృత్స్వరోచిష: |
:తథా యతోయం గుణసంప్రవాహో బుద్ధిర్మన: ఖాని శరీరసర్గా: || 23 ||

:స వై దేవాసురమర్త్య తిర్యక్ స్త్రీ షండో పుమాన్నజంతుః |
:నాయం గుణ: కర్మ సన్నచాసన్నిషేధశేషో జయతాదశేష: || 24 ||

:జిజీవిషే నాహమిహాముయా కిమంతరబహిశ్చావృత్తయేభయోన్యా |
:ఇచ్ఛామి కాలేన యస్య విప్లవ: తస్యాత్మలోకావరణస్య మోక్షం || 25 ||

:సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వమేదసం |
:విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం || 26 ||

:యోగరంధితకర్మణో హృది యోగవిభావితే |
:యోగినో యం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం || 27 ||

:నమో నమస్తుభ్యసహ్యవేగ శక్తిత్రయాయాఖిలాధీగుణాయ |
:ప్రపన్నపాలాయ దురంతశక్తయే కదింద్రీయాణామనవాప్యవర్త్మనే || 28 ||

:నాయం వేద స్వమాత్మానం యచ్ఛక్త్యా హంధియా హతం |
:తం దురత్యయమాహాత్మ్యం భగవంతమితోస్మ్యహం || 29 ||

:''శ్రీ శుక ఉవాచ''
:ఏవం గజేంద్రముపవర్ణిత నిర్విశేషం బ్రహ్మాదయో వివిధ లింగ భిదాభిమానా: |
:నైతే యదోపసృపుర్నిఖిలాత్మకత్వతాత్తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్ || 30 ||

:తం తద్వదార్త్తముపలభ్య జగన్నివాస: స్తోత్రంనిశమ్య దివిజై:సహ సంస్తువద్బి: |
:ఛందోమయేన గరుడేన సముహ్యమానొశ్చక్రాయొధోభ్యగమదాశు యతో గజేంద్ర: || 31 ||

:సోంతస్సరస్యురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వాగరుత్మతి హరిం ఉపాత్తచక్రం |
:ఉత్క్షిప్య సాంబుజకరం గిరిమాహ కృచ్ఛాన్నారాయణాఖిలగురొ భగవన్నమస్తే || 32 ||

:తం వీక్ష్యపీడితమజ: సహసావతీర్య సగ్రాహమాశు సరస: కృపయోజ్జహార |
:గృహాద్ విపాటిత ముఖాదరిణా గజేంద్రం సంపశ్యతాం హరిరమూముచదుస్రీయాణాం || 33 ||

:|| శ్రీకృష్ణార్పణమస్తు ||
"https://te.wikipedia.org/wiki/గజేంద్ర_మోక్షం" నుండి వెలికితీశారు