గరికపాటి రాజారావు: కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గరికపాటి రాజారావు
| residence = [[రాజమండ్రి]]
| other_names =
| birth_date = [[ఫిబ్రవరి 5]],[[1915]]
| birth_place = [[రాజమండ్రి]]
| native_place = [[రాజమండ్రి]]
| death_date = [[సెప్టెంబరు 8]],[[1963]]
| death_place = మద్రాసు
| death_cause = మానసిక వేదన
| known = [[తెలుగు సినిమా]] దర్శకుడు, <br />నాటకరంగ ప్రముఖుడు, <br />ఆంధ్ర [[ప్రజానాట్యమండలి]] వ్యవస్థాపకుడు.
| occupation =లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తా
| title =
 
 
'''గరికపాటి రాజారావు''' ([[ఫిబ్రవరి 5]],[[1915]] - [[సెప్టెంబరు 8]],[[1963]]) [[తెలుగు సినిమా]] దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర [[ప్రజానాట్యమండలి]] వ్యవస్థాపకుడు.
 
ప్రజానాట్యమండలి సాంఘీక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో [[దేవిక]], [[అల్లు రామలింగయ్య]], సంగీత దర్శకులు [[మోహన్ దాస్]] మరియు [[టి.చలపతిరావు]]లు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు మరియు బుర్రకథ కళాకారుడు [[షేక్ నాజర్]] ఉన్నారు.<ref>http://www.idlebrain.com/research/anal/anal-tc4.html</ref>
 
రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన [[రాజమండ్రి]]లో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే కాకినాడలోని [[ఆదిభట్ల నారాయణదాసు]] హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందాడు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, హరిశ్చంద్ర నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందాడు. తరువాత [[విజయనగరం]]లో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. తండ్రి ఉద్యోగం చేసిన సికిందరాబాదు లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తూ, పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో మద్రాసు చేరాడు. మద్రాసులో ఎల్‌.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) డాక్టర్‌ రామదాసు ఈయనకు ప్రాణ స్నేహితులు. అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వలన రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు<ref>[http://www.prajasakti.com/kurnool/article-20971 ప్రజాకళాకారుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు - ప్రజాశక్తి కర్నూలు సంచిక 2009, సెప్టెంబరు 8]</ref>
 
మద్రాసలో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించాడు. మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనాన్ని సృష్టించింది. షాజహాన్‌గా ఎస్‌విఆర్ సాంబశివరావు, జహనారాగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు. ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం. మద్రాసులో విద్యార్థులను సమీకరించి భమిడిపాటి బాగుబాగు, గాలి బాల సుందరరావు అపోహ వంటి నాటకాలను ప్రదర్శించారు.<ref>[http://archives.andhrabhoomi.net/kalabhoomi/kala5-643 నాటక వైద్యుడు గరికిపాటి రాజారావు - ఆంధ్రభూమి 2010, ఆగష్టు 4]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1176818" నుండి వెలికితీశారు