గిరిజా షెత్తర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person| name = గిరిజా షెత్తర్
| image = Girija_Shettar.jpg
| image_size =
| caption = గీతాంజలి కథానాయకిగా ప్రసిద్ధిచెందిన గిరిజా షెత్తర్ (మే 2008)
| birth_name = గిరిజా ఎమ్మా జేన్ షెత్తర్
| birth_date = {{Birth date and age|1969|7|20|mf=y}}
| birth_place = {{flagicon|England}} [[ఓర్సెట్ట్]], [[ఎస్సెక్స్]]
| death_date =
| death_place =
| other_names =
| occupation = నటి, [[పాత్రికేయురాలు]], [[తత్త్వవేత్త]], నర్తకి
| years_active = 1989-ప్రస్తుతం
| spouse =
}}
తెలుగు సినీరంగములో '''గిరిజ'''గా పరిచయమైన '''గిరిజా ఎమ్మా జేన్ షెత్తర్''' (Girija Emma Jane Shettar) (జ. [[జూలై 20]], [[1969]]) తెలుగు సినిమా నటి. [[మణిరత్నం]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా [[గీతాంజలి (1989 సినిమా)|గీతాంజలి]]లో కథానాయికగా ప్రసిద్ధురాలు. ఈమె ''వందనం'' అనే మలయాళ చిత్రము ద్వారా చిత్రరంగములో ప్రవేశించింది.
పంక్తి 17:
 
==గీతాంజలి==
గిరిజ చెన్నైలో మణిరత్నం మరియు సుహాసినిల పెళ్ళికి క్రికెట్ ఆటగాడు శ్రీకాంత్ యొక్క చెల్లెలితో వచ్చింది. పెళ్ళిలో ఆమెను చూసిన మణిరత్నం, తను తీయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. సీనియర్ అసోషియేట్ డైరెక్టరైన గాదిరాజు కేశవరావుతో ఆమెకు షూటింగుకు ముందు రెండు నెలలపాటు శిక్షణ ఇప్పించారు. సంభాషణలను ఇంగ్లీషులో వ్రాసుకొని ఈమె కేశవరావుతో కలిసి ప్రాక్టీసు చేసింది. ఆ తరువాత గిరిజ, ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన వందనం అనే మళయాళం సినిమాలోనూ హృదయాంజలి అనే తెలుగు చిత్రంలోనూ నటించింది. హృదయాంజలి 1992లో పూర్తయినా 2002లో విడుదలైంది. ఈ సినిమాలో గిరిజ సరసన సంజయ్ మిత్రా నటించాడు. ఏ.రఘురామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎల్.వైద్యనాథన్ సంగీతము, మధు అంబట్ ఛాయాగ్రహణము సమకూర్చారు. హృదయాంజలి నాలుగు నంది అవార్డులను అందుకున్నది. ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు యేసుదాసు పాడిన మంచిన పాటలున్నా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు. గిరిజి జో జీతా వహీ సికందర్ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు స్టేజిపై డ్రామా వేసే సన్నివేశంలో ఒక పాటలో కనిపించింది. ఈ సినిమాకు మొదట కథానాయిక పాత్రకు గిరిజను ఎంపిక చేసుకున్నారు. కానీ ఎందుకనో మొదటి షెడ్యూలు తర్వాత ఈమె స్థానంలో ఆయేషా జుల్కాను తీసుకున్నారు.<ref>http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_geetanjali_1989.php</ref> ఆ తర్వాత గిరిజ లండన్ కు తిరిగి వెళ్లిపోయింది. గిరిజ ప్రస్తుతము రచయితగా లండన్లో స్థిరపడింది. ఈమె నటనపై ఇప్పటికీ తన అధ్యయనము కొనసాగిస్తూ ఇతర నటులు మరియు సినీ నిర్మాతలతో పనిచేస్తూనే ఉన్నది. 2005 నుండి లండన్ లో ఆరోగ్య సంబంధ విషయాల విలేఖరిగా పనిచేస్తున్నది.
 
==గిరిజ నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/గిరిజా_షెత్తర్" నుండి వెలికితీశారు