గీతం (పాట): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{భారతీయ సంగీతం}}
గీతము సంగీత రచనలలో చాలా ముఖ్యమైనది. సంగీత ప్రపంచములో "గీతము" అను పదమునకు వేరు వేరు స్థానము గలదు. గీతము లోని సంగీతము చాలా ఇంపుగాను, సులభంగాను ఉండును. రాగ భావ ముట్టిపడుచుండును. లయ ఒకేరీతిన నడాచును. గీతమునకు [[పల్లవి]], [[అనుపల్లవి]], [[చరణము]] అను భాగములు లేవు. సంగతులు ఉండావు. చాల కష్టమైన సంచారములుండవు. కాని రాగ స్వరూపము బాగుగా చెవులగట్టును. లయ సామాన్యము. స్వర భాగములోని ప్రతి స్వరమునకును సరియైన అక్షరము సాధారణముగా సాహిత్య భాగములో నుండును. సాహిత్య భాగము దైవ భక్తి, గీతమును ఆపక, మొదటి నుండి చివరి వరకు నిలుపక పాడుటయే గీతమును పాడు పద్ధతి.కొన్ని గీతములలో అర్థము లేని పదములు వాడములు కొన్ని వాడబడినవి. వీటివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాని గీత రచయితలు వీటిని తమ తమ గీతములలో వాడిన గీతము శోభించునను తలంపుతో వాడిరి.
 
వీటిని "గీతాలంకారములు" అని అనుటయు కలదు. కొన్ని ప్రసిద్ధి సంస్కృత శ్లోకములకు గీతములుగా పరివర్తనము చేసి సంగీతములో వాడుకొనుట కలదు. ఉదాః; భైరవ రాగములో "శ్రీ రామచంద్రా" యును, నాట రాగమునందు "అమరీ కబరీ" యును
 
గీతము భాష సాధారణముగా సంస్కృతము, కన్నడము, భాండీర భాష, వాగ్గేయకారూ సంస్కృతములో రచనలు రచించుచుండిరి. కాని కొంత కాలము తరువాత ప్రాకృతములో ఒక భేదమైన భాండీర భాషలో రచించుట మొకలు పెట్టిరి. ఇంకా కొద్ది కాలమునకు ఇతర భాషలలొ రచనలు రచింపబడినవి. ఇతర భాషలలో రచనలు ప్రారంభమైన వెనుక భాండీర భాషలో తగ్గిపోయినవి.
పంక్తి 10:
గీతములు రెండు తెగలు: (1) సామాన్య గీతములు (2) లక్షణ గీతములు
 
ఏ తెగకు చెందిన గీతమైనను పైన చెప్పబడిన లక్షణములనే కలిగి ఉండును. సామాన్య గీతమునకును, లక్షణ గీతములకును సాహిత్య భాగములో మాత్రము తేడాలుండును. సామాన్య గీతముల యొక్క సాహిత్యము ఏదో ఒక దైవముమి ప్రార్థించుటో, వర్ణించుటో నగును. కాని లక్షణ గీతములోని సాహిత్యము ఆ గీతము ఏ రాగములో రచించబడినదో ఆ రాగము యొక్క లక్షణమును తెలుపును.అనగా ఆ గీతము యొక్క రాగము మేళకర్త రాగమా లేదా జన్య రాగమా, దాని పేరు జన్య రాగమైనచో అది జనించిన మేళకర్త పేరు, ఉపాంగమా, భాషాంగమా, భాషాంగమైతే అన్యస్వరమెద్ది,వక్రమా, వర్జమా,న్యాస స్వరమెద్ది,జీవస్వరమెద్ది,ఔఢవమా, షాఢవమా, లేక సంపూర్ణమా అను మొదలగు ప్రతీ అంశమును సాహిత్యమునందు కాననగును.
==లక్షణ గీతములు==
లక్షణ గీతములు చాలా రాగములలో రచింపబడినవి.ప్రసిద్ధ రాగములలో చాలా గలవు. అప్రసిద్ధ రాగములలో కొన్నింటిలో మాత్రము లక్షణ గీతములు రచించబడినవి.ప్రాచీన కాలమందు గురుకులాశ్రమమున శిష్యుడు విద్యనభ్యసించుచుండెను. తాలపత్రములలోకొంత విషయములు వ్రాసియున్నప్పటికీ యిప్పటి వలె వేలకు వేల గ్రంథములు తయారగుటకు యిప్పటి అచ్చు వసతులు లేవు. కనుకనే కొన్ని అంశములు అనగా సంస్కృత శబ్దములు, అమరము వంటివి గురువు శిష్యునికి నోటితో లక్ష్య లక్షణములు నేర్చుచూ వచ్చెను అదే రీతిన సంగీతమునందును రాగ లక్షణములు సంగీత విద్యార్థులకు లక్షణ గీతముల ద్వారా నేర్పబడినవి.
 
72 మేళకర్త రాగాలు, వాటి చట్టము తయారుచేసిన మహాశయుడు 72 రాగములలో లక్షణ గీతములు రచించి యున్నారు. ఇది సంగీత ప్రపంచమున అఖండసేవ. కాని ఇవి ప్రస్తుతం విలువ కోల్పోయినవి.
 
పై 72 రాగాంగ రాగ లక్షణ గీత మొక్కొక్కటిని మూడు భాగములుగా భాగించి వాటికి సూత్రఖండామనియు, ఉపాంగ ఖండమనియు, భాషాంగ ఖండమనియు వ్రాసెను. సూత్ర ఖండాములోని సాహిత్యము ఆ రాగాంగ రాగము యొక్క స్వరములు, వాటి వికృతి భేదములు, ఏ చక్రమునకు చెందినది, దాని వరుస సంఖ్య మొదలగు విషయములు మాత్రమే చర్చింపబడినవి. ఉపాంగ ఖండములో పై రాగాంగ రాగములో జన్మించు ఉపాంగ రాగముల పట్టిక వ్రాయబడినది. భాషాంగ ఖండమందు భాషాంగ రాగముల పట్టిక వ్రాయబదును. పై గీతములలో వ్రాయబడిన ఉపాంగ రాగములలో కొన్ని ఇప్పుడు భాషాంగములైనవి. కొన్ని రాగములు ఇపుడు ఉపయోగమునందు లేవు.
"https://te.wikipedia.org/wiki/గీతం_(పాట)" నుండి వెలికితీశారు