గుమ్మడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 33:
 
==భౌతిక రూపము==
పూవుయొక్క, కాయయొక్క పరిమాణమున ఈ కుటుంబమునందలి జాతులందు గుమ్మడి అగ్రస్థానము వహించును, అందుకే దీనిని గుమ్మడి జాతి అందురు. పౌష్టిక శక్తిలోకానీ, తినుట కింపుగా ఉండుటయందు కూడా ఇదే మంచిది. గుమ్మడి కాయ రకరకాల వంటగా చేసుకొని తినవచ్చును , జ్యూస్ గా తయారుచేసుకొని తీసుకోవచ్చును , సూప్ లా వాడుకోవచ్చు .. గుమ్మడితీగ చాలా ఎక్కువగా పాకు మోటు జాతి తీగ. కాండము గరుసుగా ఉండు రోమములు కలిగి ఉండునును. ఆకులు హృదయాకారము కలిగినవి. ... కూరగాయలలో అన్నిటికంటే అతి పెద్ద పరిమాణము కలిగినది గుమ్మడి కాయ. ఇది యాబై కిలోల బరువువరకు కూడ కాస్తాయి.
 
==ఔషద ఉపయోగాలు==
పంక్తి 50:
==ఆయుర్వేదములో గుమ్మడి :==
[[File:Gummadi 2.JPG|thumb|right|తీయ గుమ్మడి]]
గుమ్మడికాయ పండినది:-Pumpkin-ripe బాగుగా ముదిరిన, పండిన గుమ్మడి కాయ వండిన మధురముగ నుండును. రుచిబుట్టించును. దేహ పుష్టి, బలము, వీర్యవృద్ధి, మేహశాంతి, దాహము, తాపము, కడుపుబ్బు లను తగ్గించును. చెడు రక్తమును బుట్టించును. అలస్యముగ జీర్ణమగును; వాతము జేయును; దీనికి విరుగుళ్ళు 1 శొంఠి, 2 కాక ఔషధములు, 3 కానుగ వేరు రసము. ఔషధ సేవలో పథ్యమైన వస్తువు. గుమ్మడి కాయ లేతది:- Pumpkin-tender. దీని కూర మిక్కిలి వాతము, రక్త పైత్యము, అగ్నిమాంద్యము జేయును; దుర్బల దేహులు, రోగులు దీనిని పుచ్చుకొనగూడదు; మిక్కిలి అపథ్యమైనది. దీనికి విరుగుళ్ళు గుమ్మడి పువ్వులు :-Flowers of pumpkin plant. పైత్యమును, సన్నిపాతములను హరించును; వీనిని కూరవండుదురు. గుమ్మడికొసల కూర :-Curry of the tender leaves of pumpkin plant. తియ్య గుమ్మడి తీగె కొసలు అనగా లేత ఆకుల కూర ఆమ్ల దోషము, వాతము, గుల్మము, జ్వరము, ఉబ్బు, విదాహము వీని నణచును; జఠరదీప్తి నిచ్చును
 
==పుట్టుక==
పంక్తి 62:
గుమ్మడి పండునే కాదు; వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా కూరకు వాడుకుంటారు. గుమ్మడి గింజల్ని తింటారు. హల్వాలు వంటి స్వీట్లలో బాదం, పిస్తా, చార (సార) పప్పు లాగే ఈ గింజలలోని పప్పును కూడా డ్రెస్సింగ్‌గా వాడతారు. కొందరైతే గుమ్మడి పండుతోనే హల్వా చేసుకుంటారు. గుమ్మడిలో పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక, విటమిన్ ఎ (అధికంగానూ), కొద్దిగా విటమిన్ సి (కొద్దిగానూ) ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు. గుమ్మడి పండుకు ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. కడుపులోని 'టేప్ వార్మ్స్' నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు.
 
రాత్రి పడుకోబోయే ముందు తినిపించి, తెల్లవారుఝామునే ఆముదం తాగిస్తారు. గనేరియా, మూత్ర వ్యాధులున్న రోగులకు మూత్రం సాఫీగా వెడలేందుకు గుమ్మడి విత్తులు పంచదార లేక తేనెతో తినిపిస్తారు. సెగగడ్డలు, మొండి వ్రణాలకు గుమ్మడి పండు గుజ్జును మలాం పట్టీగా వేస్తారు. తేళ్ళు, కాళ్ళజెర్రులు, మండ్రగబ్బలు మొదలైనవి కుట్టినప్పుడు, గుమ్మడిపండు తొడిమను ఎండబెట్టి పొడి చేసి, దానితో తయారుచేసిన పేస్టును రాస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. కాలిన గాయాలకు గుమ్మడి పండు గుజ్జుతో పట్టు వేస్తారు. గుమ్మడి విత్తులు మూత్రకారిగానే కాక, నరాల బలహీనత ఉన్నవారికి టానిక్‌లా పనిచేస్తాయి.
==రకములు==
===సూర్య గుమ్మడి===
"https://te.wikipedia.org/wiki/గుమ్మడి" నుండి వెలికితీశారు