గురజాడ కృష్ణదాసు వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గురజాడ కృష్ణదాసు వెంకటేష్
| residence =
| other_names =జి. కె. వెంకటేష్
| image =G.k.venkatesh.jpg
| imagesize = 200px
| caption = జి. కె. వెంకటేష్
| birth_name = జి. కె. వెంకటేష్
| birth_date = [[సెప్టెంబర్ 21]] [[1927]]
| birth_place = [[హైదరాబాద్]], [[బ్రిటిష్ ఇండియా]]
| native_place =
| death_date = నవంబరు 1993 (వయసు 66)
| death_place = [[చెన్నై]], [[తమిళనాడు]]
| death_cause =
| known =
| occupation = [[సంగీత దర్శకత్వం]], [[నేపథ్య గానం]]
| title =
పంక్తి 40:
 
==తొలి జీవితం==
జి.కె.వెంకటేష్ స్వస్థలం [[హైదరాబాదు]], ఆయన పెరిగింది [[మద్రాసు]]లో. ఆయన జీవితంలో ఒక వింత ఏమిటంతే ఆయన ఎన్నడు స్కూలుకి వెళ్ళి చదువుకోలేదు. ఆయన తండ్రి సంగీత విద్వాంసుడు, ఆయన నుంచి వెంకటేష్‌కి సంగీతం వారసత్వంగా లభించింది. వెంకటేష్ వారు ఐదుగురు సోదరులు, అందరూ సంగీతంలో ఆరితేరినవారే, ఆపై ఒక్కొక్కరు ఒక్కో వాద్య విద్యలో నైపుణ్యం సంపాదించారు. వెంకటేష్ [[వీణ]] వాయించడంలో నైపుణ్యం సాధించాడు. తండ్రిగారు రంగస్థల నటుడు కూడా కావడం వలన వెంకటేష్ వేషాలు కూడా వేశాడు. తనకు సంగీతం, నటన తెలుసు గనక మద్రాసు వెలితే అవకాశాలు దొరకవచ్చని 1938లో మద్రాసు వెళ్ళాడు, అప్పుడాయనకి పదకొండేళ్ళు. అతన్ని జూపిటర్ సంస్థ మూడు రూపయిలు నెల జీతానికి తీసుకుంది, అయితే వసతి, భోజనం అంతా సంస్థ వారే చూసుకునేవారు. తమిళం నేర్చుకుని ''కణ్ణగి'', ''కుబేర-కుచేల'', ''మహామాయ'', ''భక్త మీరా'' వంటి చిత్రాలలో బాలనటుడుగా వేషాలు వేశారు. ఆప్పుడే అదే సంస్థలో బాలనటుడిగా పని చేస్తున్న ప్రముఖ సంగీతదర్శకుడు [[ఎమ్.ఎస్.విశ్వనాథన్]] పరిచమయ్యాడు. వారిద్దరికి సంగీతం తెలుసుగనక సంస్థవారు కోరస్ గీతాలు పాడించారు. [[కడారు నాగభూషణం]] తమిళంలో [[హరిశ్చంద్ర]] సినిమా తీస్తే అందులో విశ్వనాథన్, వెంకటేష్ లోహితుని స్నేహితుల వేషాలు వేశారు. తొలినాళ్ళలో తమిళ చిత్రరంగంలో విశ్వనాధన్ తో కలసి పనిచేశారు. [[సంతోషం]] అనే చిత్రం (ఎన్టీ రామారావు కథానాయకుడు) లో విశ్వనాథన్ రామ్మూర్తి సంగీత దర్శకత్వంలో నేపథ్యగానం కూడా చేశారు. కన్నడ చిత్రరంగంలో స్టార్ సంగీత దర్శకునిగా వెలుగొందారు. తెలుగులో తొలిసారిగా [[నాటకాల రాయుడు]] (భగవాన్ హిందీ చిత్రం అల్బెలా చిత్రం ఆధారంగా నాగభూషణం హీరోగా నిర్మితమైంది) ద్వారా పరిచయమయ్యారు. తర్వాత [[జమీందారు గారి అమ్మాయి]] చిత్రానికి సంగీతమిచ్చారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, [[పి.సుశీల]]కు మంచిపేరు తెచ్చిన ''మ్రోగింది వీణ'' పాట ఈ చిత్రంలోనిదే. తరువాత [[అమెరికా అమ్మాయి]] (ఒక వేణువు వినిపించెను, [[జి.ఆనంద్]] పాటలలో అత్యుత్తమమైనది), [[చక్రధారి]] (మానవా ఏమున్నది ఈ దేహం, ఎక్కడున్నావు, నువ్వెవరయ్యా నేనెవరయ్యా (రామకృష్ణ), విఠలా విఠలా (రికార్డులలో ఆనంద్, చిత్రంలో బాలు), [[తరం మారింది]] మొదలైన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
 
జి.కె.వెంకటేష్ కన్నడ చిత్ర సీమలో బి.కె.సుమిత్ర, బెంగుళూరు లత, సి.అశ్వద్థ, సులోచన వంటి అనేక ప్రతిభ గల నూతన గాయకులను పరిచయం చేశాడు. [[రాజ్ కుమార్]] ను గాయకుడుగా పరిచయం చేసింది కూడా వెంకటేషే. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సంగీత దర్శకులు [[ఇళయరాజా]], [[ఎల్.వైద్యనాథన్]], శంకర్ గణేష్ వంటివారు జి.కె.వెంకటేష్ శిష్యులే. కన్నడ చిత్రరంగంలో 600కు పైగా సినిమాలకు సంగీతం అందించిన వెంకటేష్, ''భక్త తుంబుర'' మరియు ''హూస నీరు'' చిత్రాలకు కర్ణాటక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నాడు.