గూడవల్లి రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గూడవల్లి రామబ్రహ్మం
| residence =
| other_names =
| image =Gudavalli Ramabrhmam.jpg
| imagesize = 200px
| caption = గూడవల్లి రామబ్రహ్మం
| birth_name = గూడవల్లి రామబ్రహ్మం
| birth_date = [[1902]], [[జూన్ 24]]
| birth_place = [[కృష్ణా జిల్లా]], <br />[[ఉంగుటూరు, కృష్ణా|ఉంగుటూరు]] మండలములోని <br />[[నందమూరు (ఉంగుటూరు మండలం)|నందమూరు]]
| native_place =
| death_date = [[1946]], [[అక్టోబర్ 1]]
| death_place =
| death_cause =
| known = ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు,[[హేతువాది]],స్వాతంత్ర్య సమరయోధుడు
| occupation =ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు <br />[[అఖిలాంధ్ర రైతు మహాసభ]] ను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు<br />[[ఆంధ్ర నాటక పరిషత్]] చతుర్థ సమావేశాలకు కార్యదర్శి
| title =
పంక్తి 36:
}}
 
'''గూడవల్లి రామబ్రహ్మం''' ([[1902]], [[జూన్ 24]] - [[1946]], [[అక్టోబర్ 1]]) ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని [[మాలపిల్ల]], [[రైతుబిడ్డ]] చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.[[హేతువాది]] .
 
==జీవిత విశేషాలు==
[[1902]] వ సం.లో [[కృష్ణా జిల్లా]], [[ఉంగుటూరు, కృష్ణా|ఉంగుటూరు]] మండలములోని [[నందమూరు (ఉంగుటూరు మండలం)|నందమూరు]] గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య - బాపమ్మ లకు కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు [[జ్ఞానపీఠ్ అవార్డు]] గ్రహీత, కవి సామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] కూడా ఈ గ్రామంలోనే జన్మిచాడు. రామబ్రహ్మం చదువు [[ఇందుపల్లి]], [[గుడివాడ]], [[బందరు]] లలో సాగింది. ఆయనకు 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబ తో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి [[సహాయనిరాకరణోద్యమం]]లో పాల్గొన్నాడు.
 
 
[[1924]] లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి [[1930]] లో మూసివేయవలసి వచ్చింది. ఆయన [[1931]] లో [[అఖిలాంధ్ర రైతు మహాసభ]] ను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు. [[1934]] లో [[ఆంధ్ర నాటక పరిషత్]] చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీనికి నాట్యకళ ప్రపూర్ణ [[బళ్ళారి రాఘవ]] అధ్యక్షులు. ఆయన ''కమ్మ కుల చరిత్ర'' అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి [[కడప]]కు వెళ్ళాడు. అక్కడ ఆయన [[గండికోట]] పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి '[[గండికోట పతనం]]' అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.
 
==ప్రజామిత్ర==
ఆయన [[మద్రాసు]] నుంచి '[[ప్రజామిత్ర]]' వారపత్రికను పదేళ్ళ పాటు నడిపాడు. ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్ళే తెలుగు రచయితలు, కళాకారులకు ప్రజామిత్ర ఆఫీసే సమావేశ ప్రదేశమైంది. అంతవరకు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత, సాహిత్య, నాటక, చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మం తీర్చిదిద్దారు. ఆయన ప్రజామిత్ర లోనే కాక సమదర్శిని, వాది లాంటి ఇతర పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వ్రాశాడు.
 
[[సముద్రాల రాఘవాచార్య]], [[కుర్రా సుబ్బారావు]]లు ఇతనికి సహాయపడుతుండేవారు. [[నార్ల వెంకటేశ్వరరావు]] గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత [[ఆండ్ర శేషగిరిరావు]], [[ముద్దా విశ్వనాథం]], [[బోయి భీమన్న]]లు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు.
పంక్తి 70:
 
 
ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా [[త్రిపురనేని గోపీచంద్]] మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, [[జమీన్ రైతు]] ఉద్యమంలో [[నెల్లూరు వెంకట్రామానాయుడు]] వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు [[బి.నరసింహారావు]].
 
 
పంక్తి 112:
==బయటి లింకులు==
*[http://www.vepachedu.org/gudavalli.html వేపచేదు.ఆర్గ్ లో వ్యాసం]
*[http://yoursay.imdb.com/name/nm0707892/ ఐఎండిబి.కాం లో వ్యాసం]
 
[[వర్గం:1902 జననాలు]]