"గోధుమ" కూర్పుల మధ్య తేడాలు

11 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
==ఆహారధాన్యంగా గోధుమ==
ప్రపంచ ఆహార విపణిలో గోధుమది అగ్రస్ధానం. ప్రపంచంలో వరి తరువాత ఎక్కువగా వాడబడుతున్న ఆహారధాన్యం గోధుమలే. 550 మి.టన్నుల పై చిలుకు గోధుమలు సాలీన వాడకం ఉంది. ఇందులో 2/3 వంతు ఆహారానికి, 1/6 వంతు పశువుల దాణాగాను మిగిలినవి విత్తనాలు తదితరాలకి వాడబడుతున్నాయి. 1949-1978 మధ్య కాలంలో ప్రపంచ గోధుమ సాగు 3.3% పెరిగింది. 1960 కాలం నాటి హరిత విప్లవం, పెరిగిన సాగు విస్తీర్ణం, కొత్త అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, పురుగుమందుల వాడకం అధికమవడం దీనికి దోహదబడ్డాయి. గోధుమ నేడు 80 దేశాలలో 232 మి.హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సరాసరి ఉత్పత్తి 1664 కి.గ్రా / హె. సాధించగలిగాము. ఉష్టమండలాలలోని మధ్య అక్షాంశ గడ్డి మైదానాలలో ముఖ్యంగా పండిస్తారు. ముఖ్యంగా పండించే ప్రాంతాలు--పూర్వ సోవియట్ రష్యా , అమెరికా,కెనడా , చైనా,ఆస్ట్రేలియా , అర్జెంటీనా,యూరప్ .
 
==గోధుమ రకాలు==
* గోధుమలో ముఖ్య రకాలు వసంతకాల గరుకు ఎరుపు గోధుమ (Hard Red Spring Wheat)
* శీతాకాల గరుకు ఎరుపు గోధుమ (Hard Red winter Wheat)
* శీతాకాల మృదువైన ఎరుపు గోధుమ (Soft Wheat)
* మృదువైన తెల్లని గోధుమ (White Wheat)
* దూరమ్ (డ్యూరమ్) గోధుమ (Durum Wheat)
 
[[File:WheatGrassJuice 01.JPG|thumb|గోధుమ గడ్డి రసం]]
 
-- నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు గోధుమ గడ్డి రసాన్ని సేవిస్తుండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాళ్ళు, పచ్చ కామెర్లు, మధుమేహం, కీళ్ళవాతం వున్నవారు తాజా గోధుమ రసాన్ని సేవిస్తే ఈ జబ్బులు మటుమాయమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
 
 
=== గోధుమ గడ్డి రసం ప్రయోజనాలు===
# ఎర్ర రక్త కణాల అభివృద్ధి: గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణా లు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్‌, ఐరన్‌ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహ దం చేస్తాయి.
# అధిక రక్తపోటు నివారిణి: గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది.
# తాల్‌సేమియా రోగులకు మంచిది: ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో 'తాల్‌ సేమియా' రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ రసాన్ని తీసుకోక పోతే వాళ్ళు ప్రతివారం రక్తం మార్పిడి చేసుకోవ లసి వస్తుంది. చంఢఘీడ్‌ లోని పెడియాట్రిక డిపార్ట్‌మెంట్‌, ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది.
# రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది. 5. శక్తి ప్రదాయిని:
# నూతనోత్తేజం కలిగిస్తుంది:
# బరువును పెంచుతుంది: గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. బరువు పెరిగినవారికి ఇది శరీరంలోని మెటబాలిజంను సరిచేస్తుంది.
# క్యాన్సర్‌ నివారిణి: గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌,బేటా కరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, బి,సి,ఇ విటమిన్ల కారణాన క్యా న్సర్‌ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
# చర్మ రక్షణ: ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కన్నుల కింద నల్లటి వల యాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక పరిశ్రమ గోధుమగడ్డి రసాన్ని వారిఉత్పత్తులలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానికగాే పని చేస్తుంది. రోజూ ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు: ఈ రసాన్ని ఆరెంజ్‌,యాపిల్‌, ఫైనాఫిల్‌, లెమన్‌ తది తర జ్యూస్‌లతో కలిపి తాగవచ్చు. గోధుమ గడ్డి పొడిని కూడా పోషక పదార్థంగా వాడవచ్చును. నేడు గోధుమ గడ్డి టాబ్‌లెట్లు ఆహారానికి ప్రత్యా మ్నాయాంగా మార్కెట్‌లో విక్రయం చేస్తున్నారు.
 
===గోధుమ గడ్డి రసం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు:===
గోధుమ గడ్డి రసం నిర్ణీత పరిణామంలోనే (30ml) తీసుకోవాలి. అధి కంగా తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స ఉంటాయి. తల నొప్పి, జీర్ణకోశ వ్యాధులు, పళ్లరంగు మారడం, మగతగా ఉండడం జరుగుతుంది. గోధుమ రసాన్ని తాజాగానే, వెంటనే వాడాలి. నిలువ వుంచి తీసు కోరాదు. ఈ రసం ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. అయితే, ఆహారంలో భాగంగా దీనిని తీసుకోవచ్చు. ఎవరికైతే గోధుమ రసం పడదో, వారు మానివేయడం మంచిది. డాక్టర్‌ లేదా న్యూట్రిషియన్‌ ఎక్సపర్ట్‌ లేదా పౌష్టికాహార నిపు ణుని సలహా మేరకు ఈ రసాన్ని తాగాలి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1178833" నుండి వెలికితీశారు