గోవర్ధన గిరి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 11 interwiki links, now provided by Wikidata on d:q2353619 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
[[ఫైలు:Govardhan.jpg|thumb|right|175px|బృందావనంలో గోవర్ధనగిరి]]
 
'''గోవర్ధన గిరి''' ([[ఆంగ్లం]]: Govardhan; [[సంస్కృతం]]: गोवर्धन) [[భాగవతం]] లో ప్రస్థావించబడిన ఒక [[పర్వతం]] పేరు. దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం [[బృందావనం]] పట్టణానికి సమీపంలో ఉన్నది. గోవర్ధనం అనగా గోవుల్ని వర్ధనం అనగా వృద్ధిచేయడం అని అర్ధం. [[శ్రీకృష్ణుడు]] యదుకులంలో ఉండగా ఒకసారి [[దేవేంద్రుడు]] యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు. అపుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెని వేలితో ఈ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకూ దాని నీడన తలదాచుకొంటారు.
 
కృష్ణుని మరియు వైష్ణవ భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. చాలా మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కొండ చుట్టూ జపాలు, గానాలు, భజనలు చేస్తూ, [[గిరి ప్రదక్షిణం]] చేస్తారు. ఈ గిరి పరిసర ప్రాంతాలలో శ్రీకృష్ణుడు మరియు [[బలరాముడు]] బాల లీలలు చాలా విశేషంగా ప్రాముఖ్యత వహించాయి.
 
==గోవర్ధనోద్ధారణం==
[[గోవర్ధన పూజ]] దీపావళి తర్వాత రోజు శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు. బృందావనంలో ప్రతి సంవత్సరం ఈ పూజ ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులకు పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని మరియు గ్రామవాసుల్ని ప్రశ్నిస్తాడు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు ఏడు రోజులు కుండపోతగా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. దిక్కు తోచని ప్రజలు కృష్ణున్ని వేడుకొనగా గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి దాని క్రింద గోపాలుర్ని మరియు గోవుల్ని రక్షిస్తాడు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు.<ref> [http://srimadbhagavatam.com/1/3/28/en1 Bhag-P 1.3.28] 'Krishna Is the Source of All Incarnations'. </ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోవర్ధన_గిరి" నుండి వెలికితీశారు