గోవా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 15:
leader_name_2=[[మనోహర్ పారికర్]] |
established_date=[[1987-05-30]] |
footnotes=<sup>"↑"</sup>'''కొంకణి ఏకైక అధికారిక భాష''' కానీ '''మరాఠీని''' అధికారికావసరాలకు వాడుకోగలెగే సౌలభ్యం కల్పించారు. <ref>గోవా, డామన్ మరియు డయ్యూ అధికారిక భాషా చట్టం, 1987 వలన కొంకణి ఏకైక అధికారిక భాష అవితుంది, కానీ మరాఠీని మాత్రం అధికారికావసరాలకు వాడుకోగలిగే సౌలభ్యం కల్పించారు. ప్రభుత్వం కూడా మరాఠీలో వచ్చిన ఉత్తరాలకు మరాఠీలోనే సమాధానం ఇస్తాయి. {{Cite web | last = Commissioner Linguistic Minorities | title = 42nd report: July 2003 - June 2004 | url=http://nclm.nic.in/shared/linkimages/35.htm | access-date = 2007-06-06}} అయితే, మే 2007 నుండి మరాఠీని కూడా అధికారిక భాషగా గుర్తించాలని పలువురు కోరారు, అయినా కొంకణీ ఏకైక అధికారిక భాషగా మిగిలింది. {{Cite web | last = UNI | title = Marathi vs Konkani debate continues in Goa | date=May 30, 2007 | url=http://www.rediff.com/news/2007/may/30goa.htm | access-date = 2007-06-06}}</ref>.|
area_total=3702 |
area_magnitude=9 |
పంక్తి 31:
}}
 
'''గోవా''' (गोवा, Goa ) [[భారతదేశం]]లో పశ్చిమతీరాన [[అరేబియా సముద్రం]] అంచున ఉన్నది. ఈ ప్రాంతాన్ని [[కొంకణ]] తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన [[మహారాష్ట్ర]], తూర్పు, దక్షిణాన [[కర్ణాటక]] రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం<ref name=area> [http://www.statoids.com/uin.html భారతదేశం రాష్ట్రాల వివరాలు] స్టాటైడ్స్ నుండి [[డిసెంబర్ 5]] [[2006]]న సేకరించబడినది. దీని ప్రకారం గోవా వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం</ref>. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. [[సిక్కిం]], [[మిజోరామ్]], [[అరుణాచల్ ప్రదేశ్]]లు గోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి<ref name=population> [http://www.censusindia.net/t_00_005.html 2001 జనాభా లెక్కల] ప్రకారం భారతదేశ రాష్ట్రాలలో గోవా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. </ref>.
 
గోవా రాజధాని [[పనజీ]]. 16వ శతాబ్దంలో [[పోర్చుగీసు]] వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది. <ref name=freedom1>గోవా ప్రభుత్వ పాలిటెక్నిక్ కలాశాలలో [http://gpp.nic.in/Liberation.html గోవా స్వాతంత్ర్యం] గురించి</ref><ref name=freedom2>గోవా [http://www.bharat-rakshak.com/IAF/History/1960s/Goa01.html స్వాతంత్ర్యం పొందిన విధానం] వివరిస్తున్న భారత్-రక్షక్‌లోని ఒక వ్యాసం. </ref>
పంక్తి 48:
 
1498లో క్రొత్త సముద్రమార్గాన్ని కనుక్కొన్న మొదటి ఐరోపా వర్తకుడు [[వాస్కో డ గామా]] [[కేరళ]] లో [[కోజికోడ్]]లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యము. కాని 1501 లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి [[అల్ఫోంసో డి అల్బుకర్క్]] (Afonso de Albuquerque) అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావరంగా చేయాలనేది వారి అభిమతం.
 
 
పంక్తి 60:
 
== భౌగోళికం, వాతావరణం ==
[[దస్త్రం:India Goa Anjouna Beach.jpg|thumb|250px| గోవాకు పొడవైన సముద్ర తీరం ఉన్నది. అక్కడి బీచిలు అందమైనవి.]]
 
[[పడమటి కనుమలు]]లోని [[కొంకణ]] తీరాన ఉన్న గోవాకు 101 కి.మీ. సముద్ర తీరము ఉన్నది. [[మాండవి]], [[జువారి]], [[తెరెఖోల్]], [[ఛపోరా]], [[బేతుల్]]అనేవి గోవాలోని నదులు. జువారి నది ముఖద్వారాన ఉన్న [[మార్ముగోవా]] నౌకాశ్రయం మంచి సహజ నౌకాశ్రయం. జువారి, మాండవి నదులు, అంతటా విస్తరించిన వాటి ఉపనదులు గోవాలో మంచి నీటి వసతి, రవాణా వసతి కలిగించాయి. ఇంకా కదంబ రాజులు తవ్వించిన 300పైగా పాతకాలపు చెరువులు, 100 పైగా ఔషధిగుణాలున్న ఊటలు ఉన్నాయి.
 
గోవా నేల ఎక్కువ భాగం ఖనిజలవణాలుగల [[ఎర్రనేల]]. లోపలి నదీతీరాలలో [[నల్లరేగడి]] నేల ఉన్నది. గోవా, కర్ణాటక సరిహద్దులలో [[మోలెమ్]], [[అన్‌మోడ్]]ల మధ్యనున్న శిలలు [[భారత ఉపఖండం]]లోన అత్యంత పురాతనమైనవాటిలోకి వస్తాయి. కొన్ని శిలలు 3,600 [[మిలియన్]] సంవత్సరాల పురాతనమైనవని గుర్తించారు<ref name=goarock> [http://www.colaco.net/thegoaUdontNO.htm The Goa that you may not know], Dr. Nandkumar Kamat, [http://www.colaco.net Colaco.net], జులై 6, [[2007]]న సేకరించారు.
</ref>.
[[ఉష్ణవాతావరణ మండలం]]లో, అరేబియా సముద్రతీరాన ఉన్నందున గోవా వాతావరణం వేడిగాను, తేమగాను ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు [[సెంటీగ్రేడ్]] వరకు వెళతాయి. వర్షాకాలం (జూన్ - సెప్టెంబరు)పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. డిసెంబరు - ఫిబ్రవరి కాలం చలికాలం. ఉష్ణోగ్రత 20 డిగ్రీలు సెంటీగ్రేడు వరకు జారుతుంది.
 
== ఆర్ధిక రంగం ==
పంక్తి 73:
[[దస్త్రం:India Goa Chapora River Boats.jpg|thumb|250px|చపోరా నదిపై చేపలు పట్టడం]]
 
ప్రజల [[తలసరి సగటు ఆదాయం]] తక్కిన భారతదేశంలో కంటె గోవాలో ఒకటిన్నర రెట్లు ఎక్కువ. గోవా ఆర్ధికరంగం వృద్ధికూడా 1990-2000 కాలంలో 8.23% సాదింపబడింది. [[పర్యాటక రంగం]] గోవా ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక. భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీయాత్రికులలో 12% మంది గోవాను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా తీరప్రాంతంలో యాత్రికులు ఎక్కువ<ref name=goenkar>గోయెంకార్.కాం వెబ్‌సైటు నుండి, [http://goenkar.com/book/print/112 Economy of Goa], &sup1; భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీయాత్రికులలో 12% మంది గోవాను సందర్శిస్తున్నారు, &sup2; ప్రభుత్వాధీనంలోని అరణ్యం సుమారుగా 1224.38 చ.కి.మీ, పైవేటు వ్యక్తుల చేతులలో 200చ.కి.మీ ఉంది. సందర్శించిన తేదీ: [[ఏప్రిల్ 2]], [[2005]]. </ref>.
 
లోపలి భాగంలో మంచి [[ఖనిజ సంపద]] ఉన్నది. ముడి ఇనుము, బాక్సైటు, మాంగనీసు, సిలికా వంటి ఖనుజాలు బాగా లభిస్తున్నాయి.
 
[[వ్యవసాయం]] కూడా చాలామందికి జీవనోపాధి. [[వరి]], [[జీడిమామిడి]], [[పోక]], [[కొబ్బరి]] ప్రధానమైన వ్యవసాయోత్పత్తులు. చాల మందికి వ్యవసాయం రెండవ ఆదాయపు వనరుగా ఉంటున్నది. 40 వేలవరకూ జనాభా [[మత్స్య పరిశ్రమ]] ఆధారంగా జీవిస్తున్నారు.
పంక్తి 89:
మండవి నది ఎడమ ఒడ్డున ఉన్న [[పనజి]] లేదా [[పంజిమ్]]‌లో గోవా అధికార కార్యాలయాలున్నాయ. మాండవి నది అవతలి ఒడ్డున ఉన్న [[పోర్వీరిమ్]]లో గోవా శాసన సభ ఉన్నది. న్యాయ విషయాలకొస్తే గోవా [[ముంబై]], ([[బొంబాయి]]) హైకోర్టు పరిధిలోకి వస్తుంది. పనజిలో ఒక హైకోర్టు బెంచి ఉన్నది. జాతీయ స్థాయి [[పార్లమెంటు]]లో గోవానుండి రెండు [[లోక్‌సభ]] స్థానాలు, ఒక[[రాజ్యసభ]] స్థానము ఉన్నాయి. గోవా [[అసెంబ్లీ]]లో 40 మంది సభ్యులున్నారు. అన్ని రాష్ట్రాలలాగానే [[గవర్నరు]], [[ముఖ్యమంత్రి]], [[మంత్రి మండలి]], [[శాసన సభ్యులు]]తో కూడిన పాలనా వ్యవస్థ ఉన్నది.
 
1990 వరకు నిలకడగా ఉన్న గోవా ప్రభుత్వాలు తరువాత వడివడిగా మారడం మొదలయ్యింది. 1990-2005 మధ్యకాలంలో 15 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారాయి <ref name=thehindu>[[హిందూ పత్రిక]]లో జనవరి 31, 2005 [http://www.hindu.com/2005/01/31/stories/2005013104051100.htm పరికార్ ప్రభుత్వంపై], అనీల్ శాస్త్రి రాసిన కథనం, సేకరించిన తేదీ: జులై 6, 2007. </ref>.
 
గోవాలో ముఖ్యమైన రాజకీయ పార్టీలు:
పంక్తి 107:
గోవా నివాసిని ఆంగ్లంలో ''గోవన్'' అని, కొంకణిలో ''గోయెంకర్'' అని, మరాఠీలో ''గోవేకర్'' అని, పోర్చుగీసు భాషలో మగవారిని ''గోయెస్ Goês'' అని, ఆడువారిని ''గోయెసా Goesa'' అని అంటారు.
 
ఇప్పుడు గోవా జనాభా 13,47,668 - ఇందులో 6,87,248 మంది పురుషులు మరియు 6,60,420 స్త్రీలు. మిగిలిన వివరాలు
* చదరపు కిలోమీటరుకు జనాభా: 364
* పట్టణ జనాభా: 49.8%
పంక్తి 132:
కొన్ని చోట్ల నదులు దాటడానికి [[ఫెర్రీ]]లు వాడతారు. గోవాలో రెండు రైల్వే లైనులున్నాయి - ఒకటి స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన వాస్కో డ గామా - హుబ్లీ మార్గం. మరొకటి 1990 దశకంలో నిర్మించిన [[కొంకణ్ రైల్వే]] మార్గం.
 
ఎక్కువగా మిలిటరీ అవసరాలకు వాడే [[దబోలిమ్ ఎయిర్‌పోర్టు]] మాత్రమే గోవాలో ఉన్న ఎయిర్‌పోర్టు. మార్ముగోవా నౌకాశ్రయం ఎక్కువగా గోవాలో లభించే ఖనిజ సంపద రవాణాకు ఉపయోగపడుతుంది. పనజి పోర్టునుండి ముంబైకి ప్రయాణీకులను చేరవేసే స్టీమర్లు బయలుదేరతాయి.
 
== సంస్కృతి ==
[[దస్త్రం: India Goa Portuguese Villa.jpg|thumb|250px| గోవా సాంప్రదాయిక నిర్మాణానికి ఒక ఉదాహరణ]]
 
[[క్రిస్టమస్]], [[గణేష్ చతుర్ధి]], [[ఆంగ్ల సంవత్సరాది]], [[షిగ్మో]] పండుగ, గోవా [[కార్నివాల్]] (Carnival అంటే [[తిరనాళ్లు]]) - ఇవి గోవాలో పెద్ద ఎత్తున జరుపుకొనే ఉత్సవాలు.
 
సాంప్రదాయిక కొంకణి జానపద గీతాలు, సాంప్రదాయిక "మందో" సంగీతం, పాశ్చాత్య సంగీతం, [[గోవా ట్రాన్స్ సంగీతం]] (Goa trance music) - వీటన్నింటికీ గోవాలో మంచి ప్రజాదరణ ఉన్నది.
 
వరి అన్నము, చేపల కూరా - ఇవి గోవా వాసుల ప్రధాన దైనిక ఆహారము. కొబ్బరి, మసాలా దినుసులు, జీడిమామిడి, మిర్చి వంటి ద్రవ్యాలు వాడి తయారుచేసే ఎన్నో రుచికరమైన వంటలు గోవా ప్రత్యేకం. జీడి మామిడి పండునుంచి, కొబ్బరి కల్లునుంచి తయారు చేసే [[ఫెని]] అనే మధ్యం గోవాలో అత్యంత సామాన్యం.
పంక్తి 170:
అన్ని ప్రాంతాలలాగానే [[ఆల్ ఇండియా రేడియో]] సర్వీసు, ప్రధాన టెలివిజన్ సర్వీసులు ఉన్నాయి. అన్ని ముఖ్యమైన మొబైల్ సెల్‌ఫోను సర్వీసులు ఉన్నాయి.
 
ముఖ్యమైన వార్తా పత్రికలు: ఆంగ్లంలో [[హెరాల్డ్]] (ఇది గోవాలో బాగా పాత పత్రిక. 1983 వరకు ''ఓ హెరాల్డో'' అనే పోర్చుగీసు పత్రిక)), [[గోమంతక్ టైమ్స్]], [[నవహింద్ టైమ్స్]]. ఇవి కాక జాతీయ వార్తా పత్రికలు చదువుతారు.
 
 
"https://te.wikipedia.org/wiki/గోవా" నుండి వెలికితీశారు