చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{అయోమయం}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''ఆలూరు వెంకట సుబ్బారావు'''
| residence =
| other_names = చక్రపాణి
| image =Chakrapani-1.jpg
| imagesize = 200px
| caption = చక్రపాణి
| birth_name = '''ఆలూరు వెంకట సుబ్బారావు'''
| birth_date = [[1908]], [[ఆగష్టు 5]]
| birth_place = [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]]
| native_place =
| death_date = [[సెప్టెంబరు 24]], [[1975]]
| death_place =
| death_cause = [[క్షయ]]
| known = బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత మరియు దర్శకుడు
| occupation =
| title =
పంక్తి 37:
}}
 
'''ఆలూరు వెంకట సుబ్బారావు''' (కలంపేరు '''చక్రపాణి''') ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత మరియు దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకడు.
==జీవిత విశేషాలు==
చక్రపాణి [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]] లో [[1908]], [[ఆగష్టు 5]] న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై హైస్కూలు విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించాడు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న [[వ్రజనందన వర్మ]] దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించాడు. 'చక్రపాణి' అనే కలం పేరును ఈయనకు అతనే ప్రసాదించాడు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందాడు. [[క్షయ]] వ్యాధిగ్రస్తుడై 1932 లో మదనపల్లి లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళాడు. అక్కడే కొన్ని నెలలు ఉండి, సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో [[బెంగాలీ]] భాష కూడా నేర్చుకొన్నాడు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను [[తెలుగు]] లోకి అనువదించడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా [[శరత్ చంద్ర చటోపాధ్యాయ్|శరత్‌బాబు]] నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టాడు.
 
1940 లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి [[ధర్మపత్ని]] కోసం ఈయన మాటలు వ్రాసాడు. [[బి.ఎన్.రెడ్డి]] రూపొందిస్తున్న [[స్వర్గసీమ]] కు మాటలు వ్రాయడానికి చెన్నై వెళ్ళాడు.
 
1949-1950 లో [[నాగిరెడ్డి]], చక్రపాణి కలవడం, కలసి [[విజయా ప్రొడక్షన్స్]] ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి [[వాహినీ స్టుడియో]] లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి [[షావుకారు]], [[పాతాళ భైరవి]], [[మాయాబజార్]], [[గుండమ్మ కథ]], [[మిస్సమ్మ]], [[అప్పు చేసి పప్పు కూడు]] లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి నాగిరెడ్డి తో కలసి పిల్లల కోసం [[చందమామ]] కథల పుస్తకం ప్రారంభించాడు.
 
1934-1935 లో [[కొడవటిగంటి కుటుంబరావు]] తో కలసి తెనాలిలో [[యువ]] మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించాడు. 1960 లో దీనిని [[హైదరాబాదు]] కు తరలించారు.
 
ఈయన [[సెప్టెంబరు 24]], [[1975]] సంవత్సరంలో పరమపదించాడు.
"https://te.wikipedia.org/wiki/చక్రపాణి" నుండి వెలికితీశారు