ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
Wikipedia python library
| residence = [[కాకినాడ ]]
| other_names = చాగంటి కోటేశ్వరరావు
| image =Chaganti koteswararao.jpg
| imagesize = 200px
| caption =చాగంటి కోటేశ్వరరావు
| birth_name = చాగంటి కోటేశ్వరరావు
| birth_date =
| birth_place =
| native_place =
| boards =
| religion =
| spouse = శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి
| partner =
| children = షణ్ముఖాంజనేయ సుందర శివ చరణ్ శర్మ ,
నాగ శ్రీ వల్లి
| height =
| weight =
| religion = హిందూమతము

'''బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు''' కాకినాడ వాస్తవ్యులు. వీరి తండ్రి చాగంటి సుందర శివరావు తల్లి సుశీలమ్మ గార్లకు 1959 జూలై 14వ తేదిన జన్మించారు . . కోటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; శ్రీ శారదా మాత అనుగ్రహముతో అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి. మానవ ధర్మం మీద ఆసక్తి తో అష్టాదశ పురాణములను అథ్యయనము చేసి తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ భక్త జన మనసులను దోచుకున్న ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నటువంటి మహా జ్ఞాని.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, మరియు 40 రోజుల పాటు శ్రీ [[లలితా సహస్ర నామ స్తోత్రము]]ను అనర్గళంగా ప్రవచించి పామరుల మరియు పండితుల మనసులు దోచుకొని విన్నవారికి అవ్యక్తానుభూతిని అందించి, కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా ఎంతో మంది తెలుగు వారికి దేశ విదేశ వ్యాప్తంగా తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు.
== ప్రవచనాలు==
చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణము నండు భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతమునందలి అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృ ష్ణావతారం యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రధమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారా స్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్ధం, శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరాకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి బ్రహ్మశ్రీ అని గౌరవ నామాన్ని పొందారు.

==అందుకున్న పురస్కారాలు==
జగద్గురు ఆది శంకరులు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠ ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామివారు, ఉప పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వార్లు ఆశీఃపూర్వకంగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిని నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కామకోటి పీఠం తరఫున సత్కరించి, '''ప్రవచన చక్రవర్తి''' అనే బిరుదు ప్రదానం చేసారు .
=== గౌ.డాక్టొరేట్===
మన దేశంలోని ప్రతిష్టాత్మక "రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి" వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి(05-03-2014)నందు గౌరవ పురస్కారమైన "వాచస్పతి" డాక్టొరేట్ (సాహిత్యమునందు డాక్టొరేట్) పట్టాను ప్రదానం చేశారు.

===శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః===

స్వస్తి శ్రీమదఖిల భూమండలాలంకార త్రయస్త్రింషత్కోటిదేవతాసేవిత

శ్రీకామాక్షీదేవీసనాథ శ్రీమదేకామ్రనాథ శ్రీమహాదేవీసనాథ శ్రీహస్తిగిరిసనాథ

సాక్షాత్కారపరామాధిష్ఠానసత్యవ్రతనామాంకిత కాంచీదివ్యక్షేత్రే శారదామఠ

సుస్థితానాం అతులితసుధారసమాధుర్య

కమాలసనకామినోధమ్మిల్లసంఫుల్లమల్లికామాలికానిష్యందమకరందఝరీ

సౌవస్తికవాఙి నగుంభవిజ్రుంభణానందతుందలితమనీషిమండలానామనవరతాద్వైతవిద్యావినోదరసికానాం

స్త్రీబాలవ్రుధబధుపామరనిర్విషేషం రంజయంధర్మోద్బోధనం విరచయన్ నితారం రారాజతె.

స్వర్గీయ చాగంటి సుందరశివరావ-సుసీలామ్మ దంపత్యొః పుణ్యపుంజరపరిపాకల్లబ్ధజనురయం

ధీరః పౌరాణికకథాలాపైః సధర్మబోధనైస్చ ప్రేక్షకహ్ర్యుదయాన్యావర్జయన్

ధర్మమార్గాం బోధయంస్చ శ్రీసూతపౌరాణికం స్మారయతీతి నాస్త్యత్యుక్తిః.

అధ్యతనప్రసారమాధ్యమాః అస్య ప్రవచనప్రసారణద్వారాత్మనో ధన్యతాం వితన్వంతీతి

సెవాంఛ పరిలక్షయ ఏనం

; '''ప్రవచన చక్రవర్తి'''

ఇతి బిరుదేన సంభావ్య శ్రీమహాత్రిపురసుందరీసమెత శ్రీ ఛంద్రమౌళీశ్వర క్రుపయా

==బయటి లింకులు==
* చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలు ఆడియోలో [http://te.srichaganti.net/Default.aspx ఈ లింకులో] వినవచ్చును
* [http://en.wikipedia.org/wiki/Chaganti_Koteswara_Rao ఆంగ్ల వికీపీడియాలో వ్యాసం]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1179992" నుండి వెలికితీశారు