చైతన్య మహాప్రభు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person
|name = చైతన్య మహాప్రభు
|image = Chaitanya-Mahabrabhu-at-Jagannath.jpg
|caption = చైతన్య మహాప్రభు
|birth_date = 1486
|birth_place= [[నవద్వీప్]] , ప్రస్తుతం [[నదియా జిల్లా]] , [[పశ్చిమ బెంగాల్]]
|birth_name = విశ్వంభర్
|death_date = 1534
|death_place =[[పూరీ]], [[ఒరిస్సా]], [[భారత దేశం]]
|known =
|philosophy = [[భక్తి యోగ]]
|honors = Followers of [[Gaudiya Vaishnavism]] believe him to be the full incarnation of [[Lord Krishna]].
|quote =
|footnotes =
}}
{{వ్యాఖ్య|<big>శ్రీ గురుగౌరాంగౌ జయతః</big>|}}
పంక్తి 20:
 
== బాల్యం ==
కృష్ణ ప్రేమను పంచుటకు అరుదెంచినారు. సామూహిక హరినామ సంకీర్తనమునకు పితయును అయిన "శ్రీ చైతన్య మహా ప్రభువు" బెంగాలు లోని నవద్వీపము నందలి శ్రీధామ మాయాపురములో క్రీ. శ. '''1407''' శతాబ్దమున ( క్రీస్తు కాలమాన ప్రకారము ఫిబ్రవరి 1486 నంవత్సరమున) ఫాల్గుణ పౌర్ణమి సంద్యా సమయమున అవతరించిరి. శ్రీ చైతన్య మహా ప్రభువు తండ్రియైన జగన్నాథ మిశ్రులు సిల్హట్ జిల్లాకు చెందిన విద్వత్పూరుడైన బ్రహ్మణుడు.చైతన్యుడి తల్లిదండ్రులకు మొదట ఎనిమిదిమంది సంతానం పుట్టడం, వెంటవెంటనే చనిపోవడం జరిగిన తర్వాత తొమ్మిదవ సంతానంగా విశ్వరూపుడు జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి దక్షిణానికి వెల్లిపోయాడు. ఆఖరి సంతానం చైతన్యుడు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు విశ్వంభరుడు. తెల్లగా మెరిసిపోతూ ఎంతో అందంగా ఉన్నందున అతడిని [[గౌరాంగుడు]] అని పిలిచేవారు. ఇది కాక ఇతడి తోటి పిల్లలు ""నిమాయి" అని పిలిచేవారు. సన్యాసం స్వీకరించిన తర్వాతనే "శ్రీకృష్ణచైతన్యుడు" అనే పేరు వచ్చింది.
==విద్యాభ్యాసం==
గౌరాంగుడు చిన్నతనంలోనే సకల శాస్త్రాలూ, పురాణేతిహాసాలూ చదివి మహా పండితుడయ్యాడు. తర్కం, వ్యాకరణం అతని అభిమాన విషయాలు. 16వ ఏటనే నవద్వీపంలో అతడు పాఠశాల స్థాపించి, వందలాది విద్యార్థులకు తర్క, వ్యాకరణాలు బోధించాడు. సంస్కృతంలో ఒక వ్యాకరణ గ్రంథం కూడా రచించాడు. గౌరాంగుని 11వ ఏట తండ్రి చనిపోవడం జరిగింది. ఆయన శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడానికి తన 23వ ఏట గౌరాంగుడు ఒకసారి గయ వెళ్ళాడు. అక్కడ ఒక విష్ణ్వాలయంలో పూజలు చేస్తుండగా అతని హృదయం భగవంతుని పట్ల అపార భక్తి భావంతో తన్మయుడయిపోయాడు. ఆ స్థితిలో అతడిని చూసిన ఈశ్వరపురి అనే సాధువు అతడు మహాభక్తుడు కాగలడని తలచి కృష్ణమంత్రోపదేశం చేసాడు.
 
ఆ సమయమున నవద్వీప ప్రాంతము విద్యాసంస్క్రతులకు కేంద్రమై ఉన్నందున ఆయన విద్యార్థిగా నవద్వీపమునకు చేరిరి. నవద్వీపములోని గొప్ప విద్వాంసులైన శ్రీ నీలాంబరి చక్రవర్తి యొక్క తనయయైన శచీదేవిని వివాహము చేసికొనిన తరువాత జగన్నాథముశ్రులు గంగాతటమునందు తమ నివాస మేర్పరుచుకొనిరి. జగన్నాథ మిశ్రుడు తన భార్యయైన శ్రీమతి శచీదేవి ద్వారా పలువురు పుత్రికలను పొందినను వారిలో దాదాపు అందరు పసివయస్సులలోనే మరణించిరి. చివరికి మిగిలిన శ్రీ విశ్వరూపుడు మరియు విశ్వంభరుడను పుత్రుల వలననే పిత్రు ప్రేమను చూపుటకు వారికి అవకాశము కలిగినది. సంతానమున కడపటివాడును, దశమ సంతానము అయిన విశ్వంభరుడే తరువాత నిమాయి పండితుడుగా పేరుగాంచినారు. ఆ నిమాయ పండితుడే సన్యాసమును స్వీకరించిన పిమ్మట " శ్రీ చైతన్య మహా ప్రభువు" గా ప్రసిద్దిగాంచినారు.
 
== సన్యాస స్వీకారం ==
పంక్తి 37:
 
చైతన్యుడి జ్ఞానమీమాంస మరియు ధార్మిక బోధనలు పదివున్నాయి. వీటినే "దశ మూల బోధనలు" అని వ్యవహరిస్తారు.
# ధార్మిక గ్రంధాలు అయినటువంటి [[భగవద్గీత]] మరియు [[శ్రీమద్భాగవతం]], గ్రంధాల ఆధారంగా క్రింది తొమ్మిది సత్యాలు స్థాపించబడినవి;
# శ్రీకృష్ణుడు "మహా" మరియు "అనంత" 'సత్యం'.
పంక్తి 49:
# శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ అత్యున్నత లక్ష్యం.
==దివ్య లీలలు==
శ్రీ చైతన్య మహా ప్రభువు తమ దివ్యలీలలను నలుబదిఎనిమిది సంవత్సరముల కాలము ప్రదర్సించిన పిమ్మట '''1455''' శతాబ్దమున పూరి జగన్నాథ క్షేత్రము నందు అంతర్థానము చెందిరి. శ్రీ చైతన్య మహా ప్రభువు తొలి ఇరువదినాలుగు సంవత్సరములు నవద్వీపమున బ్రహ్మచర్యాశ్రమమును మరియు గృహస్థ జీవనమును గడిపిరి. ఆయన తొలి భార్య శ్రీమతి లక్ష్మీప్రియాదేవి. కార్యార్థమై శ్రీ చైతన్య మహా ప్రభువు ఇంటి నుండి వెళ్ళినప్పుడు చిన్న వయస్సులోనే ఆమె దేహమును త్యజించిరి. శ్రీ చైతన్య మహా ప్రభువు తూర్పు బెంగాలు నుండి తిరిగి వచ్చిన తరువాత రెండవ భార్యను స్వీకరింపుమని తల్లి అర్థించగా దానికి ఆయన అంగీకరించిరి. ఈ ప్రభువు రెండవ భార్య శ్రీమతి విష్ణుప్రియాదేవి. శ్రీ చైతన్య మహా ప్రభువు ఇరువది నాలుగవయేటనే సన్న్యాసమను స్వీకరించిన కారణముగా ఆవిడ తన జీవితమునంతయు ఆయన వియోగముననే గడిపినది. మహా ప్రభువు సన్యాసమును స్వీకరించు సమయమునకు ఆమె వయస్సు కేవలము 14 సం.లు. సన్యాసమును స్వీకరించిన పిమ్మట మహాప్రభువు తన తల్లియైన శ్రీమతి శచీదేవి కోరిక పై పూరి జగన్నాథమును తన కేంద్రనివాస స్థానముగా చేసికొనిరి. ఆ పూరి క్షెత్రమున ఆయన ఇరువది నాలుగేండ్ల కాలమును గడిపిరి. ఆ ఇరువది నాలుగేండ్ల సమయములో ఆరు సంవత్సరములు ఆయన శ్రీమద్భాగవతమును ఉపదేశించుచు దేశమంతట ముఖ్యముగా దక్షిణ భారతదేశమున మర్యటించిరి. శ్రీ చైతన్య మహా ప్రభువు శ్ర్రీమద్భాగవతమునే కాకుండా గీతోపదేశములను కూడా ఆచరణీయ పద్దతిలో ప్రచారము చేసిరి. శ్రీ కృష్ణుడు దేవదేవునిగా భగవద్గీత యందు వర్ణింపబడినాడు. సర్వ ధర్మములను త్యజించి తననొక్కడినే (శ్రీ కృష్ణ భగవానుడు) ఏకైక ఆరాధ్య భగవానునిగా శరణుపొందుమని అతడు దివ్యగ్నాన గ్రంథమైన గీత యందు చివరి ఉపదేశముగా తెలిపియునాడు. తన భక్తులందరు సర్వపాపముల నుండి రక్షింపబడుదురనియు, అందువలన వారు ఎటువంటి చింతను పొందనవసరము లేదనియు తదుపరి ఆ దేవ దేవుడు అశ్వాసమొసగినాడు. శ్రీ చైతన్య మహా ప్రభువు స్వయముగా శ్రీ కృష్ణ భగవానుడే. ఈ కలియుగమున ఈ మారు శ్రీ కృష్ణ భగవానుడు మహా భక్తుని రూపమున అవతరించియుండెను. ఆది దేవుడును, సర్వకారణకారణుడును ఐన శ్రీ కృష్ణ భగవానుని దివ్యస్థితిని సమస్త మానవాళికి ముఖ్యముగా ధార్మికులకు మరియు తత్వవేత్తలకు ఉపదేశించుటకే శ్రీ చైతన్య మహా ప్రభువు అవతరించిరి.
వ్రజభూమిలో (బృందావనము) వ్రజరాజ (నంద మహరాజు) తనయునిగా అవిర్భవించిన శ్రీ కృష్ణ భగవానుడే దేవ దేవుడనియు, తత్కారణమున సర్వులచే పూజనీయుడనియు తెలుపుటయే శ్రీ చైతన్య మహా ప్రభువు యొక్క ముఖ్య ఉపదేశసారము.
శ్రీ కృష్ణ భగవానుని అవగతమొనర్చుకొనుటకు అమలమైన శ్రీ మద్భాగవతమే సరియైనదని ఆయన పలికిరి. అంతియేగాని భగవంతుని ప్రేమను పొందుటయే సర్వ మానవుల జీవిత పరమ లక్ష్యమని ఆయన ఉపదేశించిరి.శ్రీ చైతన్య మహా ప్రభువు యొక్క భక్తులు ముఖ్యముగా శ్రీ బృందావన దాస ఠాకూరు, శ్రీలోచనదాస ఠాకూరు, శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, శ్రీ కవికర్ణపూరుడు, శ్రీ ప్రభోధానంద సరస్వతి, శ్రీ రూప గోస్వామి, శ్రీసనాతనగోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, మరియు ఈ మధ్యకాలము నాటి ( దాదాపు 200 సంవత్సరముల పూర్వము ) శ్రీ విశ్వనాథ చక్రవర్తి, శ్రీబలదేవవిద్యాభూషణుడు, శ్రీ శ్యామనందగోస్వామి, శ్రీ నరోత్తమదాస ఠాకూరు, శ్రీభక్తి వినోద ఠాకూరు, చివరికి అస్మద్ గురువర్యులైన శ్రీ భక్తి సిధాంత సరస్వతి ఠాకూరు పలువురు ఇతర ఘన విద్వాంసులు, భక్తులు మహా ప్రభువుల వారి జీవితము మరియు ఉపదేశముల పై విస్రృత రచనలను గాంచిరి.
== ఇవీ చూడండి ==
* [[:en:Achintya Bheda Abheda|అచింత్య భేద అభేద]]
"https://te.wikipedia.org/wiki/చైతన్య_మహాప్రభు" నుండి వెలికితీశారు