ఛాయరాజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొంక్యాన ఛాయరాజ్
| residence = గుజరాతీ పేట, శ్రీకాకుళం
| other_names = ఛాయరాజ్
| image =Chayaraj.jpg
| imagesize = 200px
| caption = ఛాయరాజ్
| birth_name = కొంక్యాన ఛాయరాజ్
| birth_date = [[1948]] [[జూలై 6]]
| birth_place = [[గార]] మండలం కొంక్యానపేట
| native_place = [[గార]] మండలం కొంక్యానపేట
| death_date = [[సెప్టెంబరు 20]] [[2013]]
| death_place = గారమండలం వేణుగోపాలపురం
| death_cause = క్యాన్సర్ వ్యాధి
| known = ప్రముఖ కవి, సాహితీవేత్త, రచయిత, జనసాహితి రాష్ట్ర అధ్యక్షులు
| occupation = జీవశాస్త్ర ఉపాధ్యాయులు<br />ప్రధానోపాధ్యాయులు
| title =
పంక్తి 36:
}}
 
'''ఛాయరాజ్''' శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు.
==జీవిత విశేషాలు==
[[శ్రీకాకుళం జిల్లా]] లోని [[గార]] మండలం కొంక్యానపేట లో [[1948]] [[ జూలై 6]] లో కొంక్యాన సూరమ్మ, సూర్యనారాయణ దంపతులకు ఛాయరాజ్‌ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఊళ్లోనే సాగింది. బిఎస్సీ బిఇడి చేసిన ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు.ఈయన జీవ శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశారు. 2005లో గజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుని గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, [[దూసిపేట]] లో ఉద్యోగ విరమణ పొందారు. మొదటి నుండి సాహిత్య కృషి సాగించారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని కావ్యరూపంగా మలిచారు. కొండకావ్యం 'గుమ్మ', స్త్రీ, పురుష సంబంధాలను విప్లవీకరించిన 'నిరీక్షణ', బుదడు, తొలెరుక, మన్ను నన్ను మౌనంగా ఉండనీయదు, మాతృభాష, దర్శిని, రసస్పర్శ, దుఖ్ఖేరు తదితర కథలు, కావ్య రచనలు చేశారు. ఆయన రచనలు శ్రీకాకుళం, కారువాకిని ఇటీవలే ఆవిష్కరించారు. 1980లో జనసాహితీలో సభ్యునిగా చేరిన ఛాయరాజ్‌ 2007 నుండి ఇప్పటివరకూ ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌, తెలుగు వెలుగు, ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక సమాఖ్య, జిల్లా సాంస్కృతిక మండలి అవార్డులు అందుకున్నారు.
పంక్తి 48:
==రచనలు==
===ముద్రిత రచనలు===
* శ్రీకాకుళ కావ్యం (1989): శ్రీకాకుళం ఉద్యమం ప్రభావంతోనే ఛాయరాజ్ ‘శ్రీకాకుళ కావ్యం’ రాసారు.
* గుమ్మ (కొండ కావ్యం) - ఫిబ్రవరి 1995<ref>[http://www.amazon.com/Gumma-Konda-kavyam-Chayaraj/dp/8185682119 గుమ్మ కావ్యం]</ref>
* దర్శిని (కావ్యం) - ఫిబ్రవరి 1995 <ref>[http://chaduvu.wordpress.com/2009/11/16/darsani/ దర్శిని కావ్యం గూర్చి]</ref>
పంక్తి 63:
* కథలు: "అనుపమాన" కథారూపకాల పుస్తకం - మార్చి 2010
* సెల్‌ఫోన్ కథలు : సుమారు 6 కథలు "ప్రజాసాహితి" పత్రికలో 2009-10 సం.లలో ప్రచురితం.
* అనుపమాన కథారూపకాలు <ref>[http://www.prajasakti.com/newbooks/article-141166 అసమాన కథారూపాలు]</ref>
* కుంతి <ref>[https://groups.google.com/forum/#!topic/telugu-unicode/sWgFZf3w7OI మానభంగ సంస్కృతికి ఛాయారాజ్ చెంపపెట్టు]</ref>
===అముద్రిత రచనలు===
"https://te.wikipedia.org/wiki/ఛాయరాజ్" నుండి వెలికితీశారు