జంషీద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q2578060 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
'''జంషీద్ కులీ కుతుబ్ షా''' (? - [[1550]]), [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశానికి]] చెందిన రెండవ సుల్తాను. ఈయన [[1543]] నుండి [[1550]] వరకు పాలించాడు. జంషీద్ కులీ కుతుబ్ షా గోల్కండ రాజ్యపు తొలి స్వతంత్ర పాలకునిగా చెప్పుకోవచ్చు. షా అన్న బిరుదము చేర్చుకొని, గోల్కొండ టంకశాల నుండి సొంత పేరు మీద నాణేలు ముద్రింపజేసిన తొలి కుతుబ్‌షాహీ సుల్తాను కూడా ఈయనే. చరిత్రలో కౄరునిగా చాలా ప్రసిద్ధి చెందినా, రాజ్యాన్ని పఠిష్టపరచి సమర్ధవంతమైన పాలకునిగా రణరంగంలోనూ, దౌత్యరంగంలోనూ నిరూపించుకున్నాడు.<ref name=marika>[http://books.google.com/books?id=q8zERtJWtSUC&pg=PA110&lpg=PA100&dq=jamshid#v=onepage&q=jamshid&f=false Golconda Through Time: A Mirror of the Evolving Deccan By Marika Sardar]</ref>
 
==రాజ్య సంక్రమణ==
పంక్తి 8:
 
==బీదరుతో వైషమ్యాలు==
జంషీద్ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించగానే బీదర్ సుల్తాను అలీ బరీద్ గోల్కొండపై దండయాత్ర చేశాడు. గోల్కొండ కోటకు ఏడు మైళ్ళ దూరంలో ఉండగా ఆ విషయాన్ని తెలుసుకొన్న జంషీద్ కులీ వెంటనే సైన్యాన్ని కూడగట్టుకొని మెరుపువేగంతో బీదర్ వైపు సైన్యాన్ని కదిలించాడు. ఈ పైఎత్తు ఫలించి అలీ బరీద్ తన రాజధానిని రక్షించుకోవటానికి సేనలను గోల్కొండ నుండి వెనక్కు మరలించాడు. అలీ బరీద్ ముప్పు శాశ్వతంగా వదిలించుకోవటానికి జంషీద్ కులీ [[ఆదిల్‌షాహీ వంశము|బీజాపూరు సుల్తాను]] [[ఇబ్రహీం ఆదిల్‌షా]]తోనూ, అహ్మద్‌నగర్ నవాబు [[బుర్హాన్ నిజాంషా]]తో చేతులు కలిపాడు. ఆ సుల్తానులు బీదరుపై ఉన్న పాత కక్షల వల్ల అందుకు సంతోషంగా సమ్మతించారు. బుర్హాన్ నిజాంషా బీదరు ఆధీనంలో ఉన్న కంధార్ (నాందేడ్ జిల్లా)ను ఆక్రమించుకొన్నాడు. అలీ బరీద్, ఆదిల్షాను సహాయం అర్ధించడానికి వస్తే ఆయన్ను బంధించి, ఆదిల్షా బీదరు రాజ్యం యొక్క దక్షిణ భాగాన్ని మొత్తం ఆక్రమించుకున్నాడు. అలీ బరీదును సమర్ధవంతగా గద్దె దించారు కానీ ఆ తర్వాత పరిస్థితులు మరిన్నీ ఎత్తులు, పైఎత్తులు, జిత్తులకు దారితీసాయి.
 
ఆదిల్షా ఆక్రమించుకొన్న బీదరు ప్రాంతాల మూలంగా ఆయనకు నిజాంషా కంటే కొంత పైచేయి అయ్యింది. ఈ విషయాన్ని నిరసించిన నిజాంషా, ఆదిల్షాను చికాకు పెట్టేందుకు, ఆదిల్షాకు ఆధీనంలో ఉన్న [[షోలాపూర్|షోలాపూరు]] కోటపై దండెత్తాడు. ఇద్దరి బలాలు సమానంగా ఉండటంతో ఇబ్రహీం ఆదిల్షా తనకు మద్దతుగా జంషీద్ కులీని సహాయాన్ని కోరాడు. జంషీద్ అందుకు అంగీకరించాడు కానీ, ప్రతిగా అలీ బరీద్ ను విడుదల చేయాలని షరతు పెట్టాడు. ఆదిల్షా, అలీ బరీదును విడుదల చేసిన వెంటనే, జంషీద్ ఆదిల్షాకు సహాయం చేయకుండా బీదరు వెళ్లి అలీ బరీదును ఏ సింహాసనం నుండైతే తను పూనుకొని దించాడో మళ్లీ అదే సింహాసనం ఎక్కించాడు. దీనితో పరిస్థితి యధాస్థితికి చేరుకొని బీజాపూరు, అహ్మద్‌నగర్ మధ్య వైషమ్యాలు కొన్నాళ్ళు చల్లబడ్డాయి.