జగపతి బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 21:
 
 
'''జగపతిబాబు'''గా తెలుగు సినీరంగములో ప్రసిద్ధి చెందిన '''వీరమాచనేని జగపతి చౌదరి''' తెలుగు సినిమా నటులు. ఇతడు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు [[వి.బి.రాజేంద్రప్రసాద్]] కుమారులు. [[ఫిబ్రవరి 12]], [[1962]]న [[మచిలీపట్నం]]లో జన్మించారు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించారు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారములను అందుకున్నారు.
 
==నేపధ్యము==
పంక్తి 28:
మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు సినిమాల్లోకి రావటం తమాషాగా జరిగింది. చదువుకునే సమయంలో రోజుకు 3 - 4 సినిమాలు చూసిన జగపతిబాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన ఉండేదికాదు. ఎందుకంటే 12 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్నిరోజులు వైజాగ్ లో ఉన్న బిజినెస్ చూసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని, నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు.
 
కో-డైరెక్టర్ ద్వారా విషయం తెల్సుకున్న రాజేంద్రప్రసాద్ గారు జగపతిబాబు ఇష్టాన్ని మన్నించి 1989 లో [[సింహస్వప్నం (1991 సినిమా)|సింహస్వప్నం]] సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేసారు. తొలి సినిమాలోనే డబుల్ రోల్ చేసిన మొదటి నటుడు జగపతిబాబు. ఇది చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత చేసిన చాలాచిత్రాలు ప్లాపులుగానే నిలిచాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతిబాబుకు [[జగన్నాటకం (1991 సినిమా)|జగన్నాటకం]], [[పెద్దరికం]] వంటి చిత్రాల సక్సెస్ తో నటుడిగా గుర్తింపు వచ్చింది. అయితే తన వాయిస్ బాలేదని ఇప్పటివరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాతో [[రాంగోపాల్ వర్మ]] దృష్టిలో పడ్డ జగపతి [[గాయం (సినిమా)|గాయం]] హిట్ తో హీరోగా స్థిరపడ్డారు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కి జనం దాసోహం అయ్యారు.
 
 
1994 లో [[యస్.వి. కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో వచ్చిన [[శుభలగ్నం]] సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇక అక్కడినుండి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాలలో పనిచేసారు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరుతెచ్చుకున్న జగపతిబాబు మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాయించుకున్నారు. అలా అని ఏఒక్క రంగానికో పరిమితం కాకుండా ప్రయోగాలను చేస్తూ వచ్చారు. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో వచ్చిన '[[అంతఃపురం (సినిమా)|అంతఃపురం]]' సినిమాలో చేసిన సారాయి వీరాజు పాత్రలో జీవించి ప్రేక్షకులను మైమరపించారు. ఆ తరువాత [[సముద్రం (సినిమా)|సముద్రం]], [[మనోహరం (సినిమా)|మనోహరం]] వంటి చిత్రాలతో ప్రయోగాలకు చిరునామాగా మారారు.
 
25 సంత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొదుకులను ఎదుర్కున్న జగపతిబాబు, ఇక హీరోగా చేయడం వద్దనుకొని [[నందమూరి బాలకృష్ణ]] హీరోగా [[సింహా (సినిమా)|సింహా]] ఫేం [[బోయపాటి శ్రీను]]దర్శకత్వంలో తెరకెక్కుతున్న [[లెజెండ్‌]] చిత్రంలో ప్రతినాయకుని పాత్రను పోషిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/జగపతి_బాబు" నుండి వెలికితీశారు