జమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:9వ లోకసభ సభ్యులు తొలగించబడింది; వర్గం:9వ లోక్‌సభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగ...
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = జమున
| residence =
| other_names = జమున
| image = Jamuna.jpg
| imagesize = 200px
| caption = జమున
| birth_name = యమున
| birth_date = [[1937]]
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =
| title =
పంక్తి 39:
'''జమున''', తెలుగు సినిమా నటి. [[తెలుగు]] మాతృభాషకాకపోయినా తెలుగునేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార.
 
జమున [[1937]] సంవత్సరం [[హంపీ]]లో పుట్టింది. బాల్యం గడిచింది [[గుంటూరు]] జిల్లా [[దుగ్గిరాల]]లో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాబాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా [[నది]] పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు [[యమున]]ను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు [[జగ్గయ్య]]దీ అదే గ్రామం కావడంతొ జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులొ చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది.
 
[[తెనాలి]] సమీపంలోని [[మండూరు]] గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు [[గుమ్మడి]] కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. [[బి.వి.రామానందం]] తీసిన [[పుట్టిల్లు]] ఆమె తొలిచిత్రం.
 
ఆ తరువాత [[అక్కినేని నాగేశ్వరరావు]], జగ్గయ్య, [[నందమూరి తారక రామారావు]] తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగ పేరు తెచ్చింది [[సత్యభామ]] పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె. [[వినాయకచవితి]] చిత్రంలో మొదటి సారి సత్యభామలొ జమున కనిపిస్తుంది. ఆ తర్వాత [[శ్రీకృష్ణ తులాభారం]] చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ [[నాజర్‌]] దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు.<ref>(ఈనాడు11.11.2009)</ref>
 
సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. ''దివంగత ప్రధాని [[ఇందిరా గాంధీ]] అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి'' అని తన రాజకీయ జీవితం గురించి చెబుతుంది జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన [[మిస్సమ్మ]], [[ఇల్లరికం]], [[ఇలవేల్పు]], [[లేతమనసులు]], [[గుండమ్మ కథ]] చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/జమున_(నటి)" నుండి వెలికితీశారు