జామ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 23:
About 100, see text
}}
[[జామ]] లేదా [[జామి]] ([[ఆంగ్లం]] ''Guava'') [[మిర్టేసి]] కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామి పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి.
జామి పండు, Gauva
 
జామ మొక్కలు మిర్టిల్‌ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో,మధ్య మరియు దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి. జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు ఉండి చూడడానికి ఏపిల్‌ పండులాగాని, బేరి పండులాగ గాని ఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీవర్ణం కలిగి తియ్యగా ఉండి కమ్మని వాసనతో ధృడమైన పచ్చని పై తొడుగు కలిగి ఉంటుంది. స్ట్రా బెర్రీ జామ (పి. కాటిల్‌ యానమ్‌) బ్రెజిల్‌ దేశంలో పుట్టి, ఎర్రని పళ్లు కలిగి ఉంటుంది. ఈ పళ్లు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగ ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన సువాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగి ఉంటుంది. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉండి, పండుకూ పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది. [[జామతోటల్లో ఈగ పురుగు నిర్మూలన]]
 
పెక్టిన్‌ నిల్వలు పైన తొడుగులో ఎక్కువగా ఉండటం చేత ఉడికించిన జామను కాండీలు (అమెరికాలోని స్వీట్స్‌) జాములు, నారింజతో చేసే జాములు, రసాల తయా రీలో ఉపయోగిస్తారు. టొమాటోలకు బదులు గా, ఎర్రజామ ఉప్పుతో చేసే ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. జామ పళ్ల నుంచి, ఆకులనుంచి 'టీ' కూడా తయారు చేస్తారు. పోషకవిలువలు జామపళ్లను 'మేలైన ఫలాలుగా' పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్‌ 'ఏ' మరియు విటమిన్‌ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్‌ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. వీటిలో మిన రల్స్‌, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి సాధారణంగా అవసర మైన పోషకాలు తక్కువ కేలరీలలో ఉంటాయి. జామపళ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పొలీఫెనాల్స్‌- ఇవి ఆక్షీకరణం కాని సహజరంగు కలిగించే గుణాలు ఈ పళ్లకి ఎక్కువ ఏంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలుగజేస్తాయి. ఔషధపరమైన ఉపయోగాలు నాటు వైద్యంలో 1950 సంవత్సరం నుంచి జామ ఆకులు వాటిలోని విభాగాలు, ఔషధ లక్షణాలు పరిశోధ నలలో అంశంగా ఉన్నాయి. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు.
పంక్తి 56:
 
జామ ఏడాది పొడవునా అడపాదడపా లబిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది . ప్రపంచం లొ అన్ని దేశాలలో ను లభిస్తుంది . . ఆసియా దేశాలలొ విసృఉతం గా పండుతుంది . కమలా పండు లో కంటే ఇదు రెట్లు అధికం గా విటమిను " సి " ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయ లో ఉంటుంది . చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచేందుకు అవసరమయ్యే " కొల్లాజన్ " ఉత్పత్తికి ఇది కీలకము , కొవ్వు మెటబాలిజం ను ప్రభావితం జేసే " పెక్టిన్" జామ లొ లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి , పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడం లో సహకరిస్తుంది . జామ లొ కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు .
జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.
 
జామకాయలో ఉండే పీచు పదార్ధం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .
పంక్తి 69:
 
==పోషక విలువలు==
'''పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు'''
నీరు: 81.7 గ్రా:
కొవ్వు. 0.3 గ్రా.
ప్రోటీన్ 0.9 గ్రా
పీచు పదార్తాలు: 5.2 గ్రా.
సి.విటమిన్ 212 మి.గ్రా.
పాస్పరస్. 28 మి.గ్రా
సోడియం 5.5 మి.గ్రా
పొటాసియం: 91 మి.గ్రా.
కాల్సియం: 10 మి.గ్రా
ఇనుము; 0.27 మి.గ్రా.
శక్తి: 51 కిలో కాలరిలు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జామ" నుండి వెలికితీశారు