జోగ్ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 4:
| name = జోగ్ జలపాతం
| image = Jogmonsoon.jpg
| caption = జోగ్ జలపాతం (ఋతుపవనాల కాలంలో)
| location = [[షిమోగ]] జిల్లా, [[కర్ణాటక]], [[భారతదేశం]]
| latitude = 16.37 ఉ
పంక్తి 18:
| world_rank = 313
}}
'''జోగ్ జలపాతం''' ([[ఆంగ్లం]]: Jog Falls, [[కన్నడ]]: ಜೋಗ ಜಲಪಾತ ) [[భారత దేశం]] లోని ఎత్తైన జలపాతాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్న ఈ [[జలపాతం]] [[కర్ణాటక]] రాష్ట్రం [[షిమోగ]] జిల్లా [[సాగర]] తాలూకాలో ఉన్నది. ఈ జలపాతం [[శరవతి]] నది, 253 మీటర్ల (829 అడుగులు)ఎత్తు నుండి పడడం వల్ల ఏర్పడుతోంది. ఈ జలపాతం వివిధ రాష్ట్రాలనుండి పర్యటకులను ఆకర్షిస్తున్నది. ఈ జలపాతానికి '''గేరుసొప్ప''' లేదా '''జోగోడా గుండి''' అనే పేర్లు కూడా కలవు.<ref>http://www.world-waterfalls.com/waterfall_print.php?num=156</ref> షిమోగ నుంచి జోగ్ జలపాతం కు బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు కలవు.
 
==జలపాత వివరణ==
[[శరవతి]] నది 829 అడుగుల నుండి పడుతూ నాలుగు పాయలుగా విడిపోయి, నాలుగు వేర్వేరు గతిపథాలలో క్రింద పడుతుంది. ఈ విధంగా 4 గతిపథాలకు నాలుగు పేర్లు కలవు.
ఎడమ నుండి కుడికి ఆ గతిపథాల ఆధారంగా జలపాతాల పేర్లు వాటి పేర్ల వెనుక కారణాలు (ప్రక్కన ఉన్న బొమ్మలో చూడవచ్చు)
 
* '''రాజ''': జలపాతం చాలా నిర్మలంగా సౌమ్యంగా ఉన్న రాజు మాదిరిగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి [[రాజు]] అని పేరు పెట్టారు.
* '''రోరర్''': ఈ జలపాతం పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ క్రింద పడుతుండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి [[రోరర్‌]] అని పేరు పెట్టారు.
* '''రాకెట్''': అత్యంత వేగంతో సన్నటి ధారగా రాకెట్టు మాదిరిగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి [[రాకెట్టు]] అని పేరు పెట్టారు.
* '''రాణి''': వయ్యారాలు , వంపులు పోతూ పడే జోగ్ జలపాతంలో ఈ గతిపథికి [[రాణి]] అని పేరు పెట్టారు.
 
==మహత్మా గాంధీ జలవిద్యుత్తు ప్రాజెక్టు==
భారత దేశంలోని అతి పెద్ద జలవిద్యుత్తు ప్రాజెక్టులలో అతి పెద్ద ప్రాజెక్టు, హిరెబాస్కర డ్యాం శరవతి నది మీద నిర్మించబడినది.ఈ జల విద్యుత్తు ప్రాజెక్టు 1949 నుండి సుమారుగా 1200 మెగా వాట్ల విద్యుత్తు తయారు చేస్తోంది. అప్పటి రోజులలో ఈ ప్రాజెక్ట్ ను పూర్వపు మైసూరు రాజు నాల్గవ కృష్ణ రాజ వడియారు పేరుమీద కృష్ణ రాజేంద్ర విద్యుత్తు ప్రాజెక్టు అని పిలిచేవారు. ఆ తరువాత ప్రాజెక్టు పేరు [[మహాత్మా గాంధీ]] జలవిద్యుత్తు ప్రాజెక్టుగా మార్చబడింది. ఆ తరువాత [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] ప్రణాళికతో 1960 సంవత్సరంలో శరవతి నది పై [[లింగనమక్కి]] అనే డ్యాం నిర్మించబడింది.
 
==ఋతుపవనాలు ప్రారంభం కావడానికి మునుపు జోగ్ జలపాతం==
ఋతుపవనాలు ప్రారంభమవడానికి ముందు లింగనమక్కి డ్యాంలో నీరు ఎక్కువగా ఉండదు.లింగనమక్కి డ్యాంలోని నీరు నిల్వ ఎక్కువగా లేకపోవడం వల్ల పనిదినాల్లో జోగ్ జలపాతం చాలా సన్నగా పడుతుంది. లింగనమక్కి డ్యాంలో నిల్వ చేయబడిన నీరు వారాంతములో పర్యటకులను ఆకర్షించడానికి వదిలి పెడతారు.
 
==జోగ్ కు చేరుకొనే విధానం==
పంక్తి 40:
*జోగ్ జలపాతాలకు దగ్గరలో ఉన్న బస్సు స్టేషన్లు - జోగ్ , సాగర్. [[బెంగళూరు]] నుండి సరాసరి జోగ్ కు చేరడానికి బస్సు సౌకర్యం ఉన్నది. తప్పని పక్షంలో బెంగళూరు నుండి సాగర్‌కు బస్సు తీసుకొని , సాగర్ నుండి జోగ్ కి సులభంగా చేరుకోవచ్చు. [[షిమోగ]] నుండి జోగ్ 104 కి.మీ.దూరంలో ఉన్నది.
*జోగ్ కి దగ్గరలో ఉన్న రైలు స్టేషన్లు - సాగర్, [[షిమోగ]]. బెంగళూరు నుండి సాగర్‌కి రైలు సౌకర్యం ఉన్నది.
*[[కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]], మరియు ప్రైవేటు బస్సులు, చాలా మటుకు టూర్టిస్టు బస్సులు షిమోగ నుండి నడుస్తాయి.
* దగ్గరలోని విమానాశ్రయం - [[షిమోగ]]
 
==జోగ్‌కి దగ్గరలో మరి కొన్ని ఆకర్షణలు==
*లింగనమక్కి డ్యాం నుండి వచ్చే వెనుక నీరు వల్ల హొన్నెమరాడు అనే ఈ ద్వీపం ఏర్పడింది.ఈ ద్వీపం జల క్రీడలకు ప్రసిద్ధి.
 
==జోగ జలపాతాల బొమ్మల సంగ్రహం==
పంక్తి 62:
* [http://surabisantosh.blogspot.com/2006/11/jog-falls-india.html జోగ్ జలపాతం విడియో]
* [http://www.kiruthik.com/Jog+Falls+And+Shimoga.aspx జోగ్ జలపాతం గురించి Kiruthik.Com నుండి]
* [http://www.dreamroutes.org/western/jogfalls.html జోగ్ జలపాతం గురించి డ్రీం రూట్స్ నుండి]
* [http://www.prithvibhat.com/tp/joga.html జోగ జలపాతం గురించి సంక్షిప్త సమాచారం]
* [http://www.world-waterfalls.com/waterfall.php?num=156 జోగ్ జలపాతం పేరు ప్రపంచ జలపాతాల జాబితాలో]
"https://te.wikipedia.org/wiki/జోగ్_జలపాతం" నుండి వెలికితీశారు