తంతి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''తంతి ''' లేదా టెలిగ్రాఫ్ అనునది విద్యుత్ స్పందనల సంకేతాల ద్వారా సమాచారాన్ని ఒకచోటు నుండి మరొక ప్రదేశానికి పంపించే వ్యవస్థ. టెలీగ్రాఫ్ అనే పదం ''టెలి'' (tele, [[గ్రీకు]]:τηλε అనగా "దూరం") మరియు ''గ్రాఫియన్'' (graphein [[గ్రీకు]]:γραφειν అనగా "రచన") అనే రెండు గ్రీకు పదాల కలయిక. సమాచారాన్ని సుదూర ప్రాంతాలకు ప్రసారం చేయుటకు ఉపయోగపడే వ్యవస్థ.
 
==చరిత్ర==
టెలిగ్రాఫ్ విధానం క్రొత్తదైనప్పటికీ, దీని మూలసూత్రం పాతదే. క్రీ.పూ.500 ప్రాంతంలో [[పర్షియా]] చక్రవర్తి డేరియన్ రాజాజ్ఞలను, వార్తలనూ ప్రకటించటానికి బిగ్గరగా అరవగలిగే వాళ్ళను కొండశిఖరాలపై నియోగించేవాడట. గ్రీకులు దృశ్య టెలిగ్రాఫ్ విధానాన్ని వాడేవారు. మండుతున్న దివిటీల సముదాయాన్ని పర్వత శిఖరాలనుంచి ప్రత్యేక పద్ధతిలో తిప్పుతూ సంకేతాల ద్వారా అక్షరాలను ఇతరులకు సూచిస్తుండేవారు. కార్తజీనియన్లు, రోమన్లు ఇలాంటి పద్ధతులనే ఉపయోగించారు. నేడు ఆర్లియన్స్ అని పిలువబడుతున్న సెనాకం వద్ద ఆనేక మంది రోమనులు హత్య చేయబడ్డారనే వార్త అరుపుల మూలంగా ప్రజలందరికీ త్వరగా అందించబడిందని [[జూలియన్ సీజర్]] ఒక పుస్తకంలో వ్రాశాడు. ఏదైనా ప్రముఖ సంఘటన జరిగితే, అక్కడి ప్రజలు బిగ్గరగా అరవడం ద్వారా ఇతరులకు తెలపడం పరిపాటిగా ఉండేదట. [[ఆఫ్రికా]] లో మరో పద్ధతి ఇప్పటికీ అమలులో ఉంది. తొర్ర పరిమాణాలు వేరు వేరుగా ఉండే చెట్టు బోదెలతో తయారుచేసిన ఢంకాలను బజాయిస్తే, వివిధ శబ్ద స్వరాలు యేర్పడతాయి. వీటి సంకేతాల ద్వారా సందేశాలు పంపబడుతూ ఉండేవి. [[దక్షిణ అమెరికా]] [[అమెజాన్]] ప్రాంతంలో కూడా ఇలాంటి సాధనం ద్వారానే సమాచారాన్ని ఒక మైలు దూరం దాకా అందించుకునేవారు. పచ్చి కట్టెలను అంటించి, పొగ సంకేతాల ద్వారా అనేక దేశలలో వార్తలు పంపుతుండేవారు.
 
==దృశ్య టెలిగ్రాఫ్==
పంక్తి 14:
 
==విద్యుత్ టెలిగ్రాఫ్==
[[స్కాట్లండ్]] వైద్యుడు చార్లెస్ మారిసన్ విద్యుత్తు ద్వారా సంకేతాలను ప్రసారం చేయచచ్చునని 1753 లోనే సూచించాడు. ఈ పద్ధతి లోనే కొన్ని ప్రయోగాలు జరిగాయి కూడా. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగించి టెలిగ్రాఫ్ చేస్తే, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తి అవుతాయి. వోల్టా విద్యుత్ ఘటాలలో రెండు డజన్ల లోహం చీలలని వాడాడు. ఒక్కొక్క చీల ఒక అక్షరాన్ని సూచిస్తుంది. ప్రసారిణి వద్ద వోల్టా ఘటాలు రెండు డజన్ల చీలలు ఉంటాయి. ఒక గాజు పాత్రలో ఆసిడ్ కలిపిన నీళ్ళు గ్రాహకంగా పనిచేస్తుంది. ఇందులో కూడా 24 లోహపు చీలలు ఉంటాయి. ప్రసారిణిలో ఉండే చీలలను గ్రాహకం లో ఉండే చీలలతో 24 తీగలు కలుపుతాయి. ప్రసారిణి వద్ద ఒక్కొక్క అక్షరాన్ని సూచించే చీలను వోల్టా ఘటానికి కలిపితే గ్రాహకంలో చీలవద్ద హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ గాలి బుడగల రూపంలో ఉత్పత్తి అవుతుంది. ఏ ఏ చీలల వద్ద ఇలా గాలి బుడగలు బయలు దేరతాయో వాటి ఆధారంగా సందేశాల్ని తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి కాస్త క్లిష్టమైనప్పటికీ బాగానే పనిచేసింది.
ఒక్ లోహం తీగలో విద్యుత్తు ప్రవహించినపుడు, దానికి దగ్గరగా ఉండే అయస్కాంత సూచిక అపవర్తనం చెందుతున్నదని కోపెన్ హేగెన్ లో ఫొఫెసర్ [[ఆయిర్‍స్టెడ్]] కనుక్కోవటం టెలిగ్రాఫ్ పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులకు కొత్త బాట చూపింది. గాటింజన్ వేధశాల(objervatory) డైరక్టర్ గా పని చేస్తున్న ఫ్రీడిచ్ గాన్ మ్యూనిచ్ లో సోమరింగ్ నిర్మించిన టెలిగ్రాఫ్ పరికరాన్ని చూచి, చాలా ప్రభావితుడై ఈ విభాగంలో కృషి చేయడం ప్రారంభించాడు. గొటింజన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యుడుగా పనిచేస్తున్న వెబర్ తో కలిసి వేధశాల నుంచి భౌతిక శాస్త్ర ప్రయోగశాల వరకు సుమారు రెండు మైళ్ళ దూరం తెలిగ్రాఫ్ తీగలను సంధించాడు. గ్రాహకంలో అయస్కాంత సూచికకు బదులు ఇనుప బద్దని వాడారు. ప్రసారిణి నుంచి వచ్చే తీగలో విద్యుత్తు మారినప్పుడల్లా గ్రాహకంలోని ఇనుప బద్దలో కదలికలు ఏర్పడతాయి. దీనికి ఓ చిన్న అద్దం అతికించబడి ఉంటుంది. అద్దానికి ముందు భాగంలో టెలిస్కోప్, స్కేలు ఉంటాయి. టెలిస్కోప్ లో చూచినప్పుడు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి. ఇనుపబద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్కోప్ లో చూచినప్పుడు అద్దంలో స్కేలు విభాగాలు కనబడతాయి. ఇనుప బద్ద ఏ మాత్రం కదిలినా టెలిస్కోప్ లో అపవర్తనం ఏర్పడుతుంది. ఇలాంటి అపవర్తనాలలో అక్షరాలను సూచించే కోడ్ ని శాస్త్రజ్ఞులిద్దరూ తయారుచేసుకున్నారు.
 
పంక్తి 42:
 
కుక్-వీట్‍స్టన్ టెలిగ్రాఫ్ పద్ధతి ఒకే సూచికతో పనిచేసేలా నిర్మాణంలో మార్పులు చేశారు. ఈ పద్ధతి బ్రిటన్ లో చాలా కాలం వాడుకలో ఉండేది. దీనికంటే మెరుగైన పద్ధతి అమెరికా లో కనుగొనబడింది. దీన్ని కనుగొన్నవాడు విజ్ఞాన శాస్త్రజ్ఞుడు కాకుండా ఒక కళాకారుడు కావటం ఆశ్చర్యకరమైన విషయమే. కనెక్టికట్ లో ఓ చర్చి అధికారికి మోర్స్ అనే కొడుకు పుట్టాడు. అతడు చిన్నప్పటి నుండి పాఠశాలలో తనతోపాటు చదువుకునే విద్యార్థుల చిత్రపటాలను గీచి వాళ్ళనుంచి కొంత డబ్బు పొందేవాడు. 30 యేళ్ళ వయస్సు వచ్చేసరికి చిత్రకారుడుగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అతడు గీసిన ప్రెసిడెంట్ మన్రో, లాఫయటీ మొదలైన నాయకుల చిత్రపటాలు ఇప్పటికీ వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లోని సార్వజనిక భవనాల్లో చూడవచ్చు. అతని భార్య చాలా అందంగా ఉండేది. ఆమె మరణానంతరం అతడు వియోగ బాధతో ఏ పనీ చేయలేకపోయాడు. మనశ్శాంతి కోసం యూరప్ యాత్రకెళ్ళి 1832 లో తిరిగి వచ్చాడు. అప్పటికే అతడు నలభయ్యో వడిలో పడ్డాడు.
ఓడలో తిరిగి వస్తుండగా, అమెరికా కి చెందిన ఓ కుర్ర డాక్టరు విజ్ఞాన సంబంధమైన వార్తలను, తమాషాలను ముచ్చటిస్తూ తోటి ప్రయాణీకులకు వినోదం కల్పించసాగాడు. పారిస్ లో ఫొఫెసర్ ఆంపియర్ ప్రదర్శించిన విద్యుదయస్కాంతాన్ని చూసి ప్రభావితుడై అతడు [[వోల్టా ఘటం]] తో సహా ఓ విద్యుదయస్కాంతాన్ని తనతో బాటు తెచ్చాడు. ఇనుపకడ్డీ చుట్టూ తీగను చుట్టి [[విద్యుత్తు]] ప్రవహింప జేస్తే అది తాత్కాలిక అయస్కాంతంగా మారుతుందని, విద్యుత్తును ఆపివేయగానే అది మామూలు ఇనుప కడ్డీ అయిపోతుందనీ అతడు ప్రయోగం చేసి అందరికీ చూపించాడు.
పంక్తి 78:
వాషింగ్టన్, బాల్టిమోర్ మధ్య పని వెంటనే ప్రారంభమైంది. ఓ ప్రముఖ వాణిజ్య సంస్థ ప్రతినిధి, ఎజ్రా కార్నెల్ రాగితీగలను సరఫరా చేశాడు.(కొన్నేళ్ళ తరువాత బాగాడబ్బు సంపాదించి తన జన్మస్థలంలో కార్నెల్ విశ్వవిద్యాలయం స్థాపించాడు) తపాలా శాఖ అధ్యక్షుడు శక్తి వంచన లేకుండా అనేక అంతరాయాలు కలిగించాడు. అతని మనుషులు రాత్రిపూట తీగలు తుంచివేసేవారు. నాటిన స్తంభాలను పడగొట్టేవారు. పనిచేస్తున్న కార్మికులను బెదిరించటానికి గాలిలో కాల్పులు జరిపేవారు. ఈ విధ్వంసక చర్యలను ఎదుర్కోవటానికి మోర్స్, వైల్ ఇద్దరూ రంగంలోకి దిగారు. విధ్వంసకాండకు కారకులైన వాళ్ళపై ఋజువులతో సహా అమెరికా అధ్యక్షునికి వినతి పత్రం సమర్పించారు. ఫలితంగా తపాలా శాఖ అధ్యక్షుడు రాజీనామా చేశాడు.
1844 [[మే 24]] వ తేదీన "భగవంతుడు ఏం చేశాడు"(What hath god wrought) అనే సందేశం టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారమైనది. కానీ సామాన్య ప్రజలు దీన్ని పట్టించుకోలేదు. ఇంగ్లండు లో జరిగినట్టుగానే కాకతాళీయంగా జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల టెలిగ్రాఫ్ అమాంతంగా ప్రచారంలోకి వచ్చింది. అధ్యక్ష పదవికి అభ్యర్థులను నిర్ణయించటం కోసం డమోక్రాటిక్ పార్టీ, బాల్టిమోర్ లో సమావేశం ఏర్పాటు చేసింది. అమెరికా 11 వ అధ్యక్షుడుగా పోటీ చేయడానికి జేమ్స్ నాక్స్ పోక్‍ నీ, ఉపాధ్యక్ష అభ్యర్థిగా సిలాన్ రైట్ నీ సమావేశం ఎన్నుకుంది. ఈ వార్తను వైల్ టెలిగ్రాఫ్ ద్వారా వాషింగ్టన్ కు చేరవేసే సరికి రైట్ కాంగ్రెస్ సభ చర్చల్లో పాల్గొంటున్నాడు. మోర్స్ స్వయంగా సందేశాన్ని రైట్ కి అందించాడు. పోటీలో పాల్గొనటం తనకిష్టం లేదని రైట్ ప్రకటించగానే మోర్స్ ఈ సమాచారాన్ని బాల్టిమోర్ కి పంపించాడు. ఉపాధ్యక్ష పదవికి రైట్ ని ఆమోదించి అరగంట గడవక ముందే అతడు అంగీకరించడం లేదన్న వార్తను డెమోక్రాటిక్ పార్టీ సమావేశం లో ప్రకటించేసరికి అందరూ దిగ్భ్రాంతులయ్యారు. వార్తను నమ్మలేక సతమతమవుతున్న సందర్భంలో, వాషింగ్టన్ నుంచి పార్టీ ప్రత్యేక దూత వచ్చి రైట్ తిరస్కృతిని ఆధికారికంగా తెలియజేశాడు. దీంతో మోర్స్ కనుగొన్న టెలిగ్రాఫ్ సాధనానికి అనన్య ప్రచారం లభించింది. పన్నెండేళ్ళ నిరంతర కృషి, నిరాశా నిస్పృహలు, యాతనలు ముగిశాయి. అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది. డాష్, డాట్ లతో కూడిన కొత్త టెలిగ్రాఫ్ భాష జైత్ర యాత్రకు బయలుదేరింది.
 
==మహా సముద్రాలలో టెలిగ్రాఫ్ తీగలు==
పంక్తి 95:
|url=http://books.google.com/books?id=Zup4V2wSZtMC}}, [http://books.google.com/books?id=Zup4V2wSZtMC&pg=PA278 Extract of page 278]
</ref>
1895 మే 7 న తాను రూపొందించిన తంతిలేని గ్రాహకం(Wireless receiver) ని విలేకరుల సమావేశంలో గర్వంగా ప్రదర్శించాడు.ఇది 30 అడుగుల స్తంభమునకు తగిలించబడి సంకేతాలను వృద్ధిచేస్తుంది. ఆ విలేకరులలో ఒకరు తుపానులో కూడా ఈ లోహపు కడ్డీని ఉంచడం మంచి ఆలోచనేనా అని అడిగినపుడు ఇది చాలా మంచిది అని సమాధానమిచ్చాడు. మెరుపుల తో కూడిన పిడుగు తగిలిన తర్వాత కూడా తన ఆవిష్కరణ మెరుపులను గుర్తిస్తుందని గర్వంగా ప్రకటించాడు.
 
1895 లో [[ఫ్రాన్స్]] లో [[ఆల్బెర్ట్ టర్‍పైన్]] అనే శాస్త్రజ్ఞుడు మోర్స్ కోడ్ ఉపయోగించి 25 మీటర్ల దూరం వరకు రేడియో సంకేతాలను ప్రసారం మరియు గ్రహించడం చేశాడు..<ref name="dspt">{{cite web |url=http://dspt.club.fr/TURPAIN.htm|title=Raconte-moi la radio: Albert TURPAIN|accessdate=2009-05-07|work=Pierre Dessapt}}</ref>
 
[[File:Post Office Engineers.jpg|thumb|Post Office Engineers inspect [[Marconi Company|Marconi]]'s equipment on Flat Holm, May 1897]]
1897 ,[[మే 17]] న [[ఇటలీ]] లో [[మార్కోనీ]] అనే శాస్త్రజ్ఞుడు 6 కి.మీ వరకు రేడియో సంకేతాలను పంపించగలిగాడు. మార్కోనీ కాడిఫ్ తపాలా కార్యాలయ ఇంజనీరు యొక్క సహకారంతో మొదటి వైర్‍లెస్ సంకేతాలను నీటి పైనుండి లివర్‍నాక్ నుండి వేల్స్ వరకు ప్రసారం చేయించాడు.<ref>{{cite web |url=http://www.bbc.co.uk/wales/southeast/sites/flatholm/pages/marconi.shtml |title=Marconi: Radio Pioneer |accessdate=2008-04-12 |work=BBC South East Wales }}</ref>
ఇటలీ ప్రభుత్వము దీనిపై శ్రద్ధ కనబరచక పోవటంతో 22 యేండ్ల ఆవిష్కర్త తాను రూపొందించిన తంతి విధానాన్ని(టెలిగ్రాఫీ) బ్రిటన్ కు తీసుకుని వెళ్ళి అచట జనరల్ తపాలా కార్యాలయం యొక్క ఛీఫ్ ఇంజనీర్ అయిన [[విల్లియం ప్రీస్]] ను కలిశాడు. 34 మీటర్ల పొడవు గల రెండు స్తంభముల ను లీవెన్ హాక్ మరియు ప్లాట్ హోం ల వద్ద నిలపడం జరిగినది. లీవిన్ హాక్ వద్ద గ్రాహకం కలిగిన 30 మీటర్ల స్తంభముపై స్థూపాకార మూత జింకు తో మరియు శోధకం విద్యుద్బంధక రాగితీగతో ఉంచడం జరిగినది. ఫ్లాట్ హోం వద్ద ప్రసారం యొక్క వ్యవస్థ [[రుహ్ం కాఫ్ కాయిల్]] మరియు ఎనిమిది బ్యాటరీలతో కూడినట్లు అమర్చాడు. మే నెల 11,12 తేదీల లో జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ మే 13 న లీవెన్ హాక్ వద్ద నిలకొల్పిన స్తంభం ఎత్తును 50 మీటర్ల ఎత్తుకు పెంచినపుడు మోర్స్ కోడ్ లో గల సంకేతాలు స్పష్టంగా గ్రహింపబడినవి. మొదటి సందేశం --" నీవు సిద్ధంగా ఉన్నావా"--("ARE YOU READY");
 
1898 లో తంతి రహిత ప్రసారాన్ని [[పోపోవ్]] అనే శాస్త్రజ్ఞుడు నేవల్ కేంద్రం నుండి యుద్ధ నౌకకు విజయవంతంగా పంపించగలిగాడు.
పంక్తి 131:
* 1995 : భారత్‌లో ఇంటర్నెట్‌ వ్యవస్థ ఆరంభం.
 
<br /><center><div style="text-align:left;width:80%;padding:1em;border:solid 2px gold;background:#99ffff;color:green;font-blue:bold">
<center><big>[[2013]],[[జూలై 15]] :Closing Day of Telegraph in India, ఇండియాలో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడిన రోజు</big></center>
 
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు