తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ధ తెలుగువారు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption =
| birth_name = తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి
| birth_date = [[1920]] [[అక్టోబరు 4]]
| birth_place = కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం, [[చినపాలపర్రు]]
| native_place = [[చినపాలపర్రు]]
| death_date = 16.9.2013
| death_place = హైదరాబాదు
| death_cause =
| known = ప్రముఖ [[హేతువాది]] మరియు వామపక్షవాది
| occupation =
| title =
పంక్తి 38:
 
 
'''తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి''' ప్రముఖ [[హేతువాది]] మరియు వామపక్షవాది. కృష్ణా జిల్లా [[ముదినేపల్లి]] మండలం [[చినపాలపర్రు]] లో తమ్మారెడ్డి వెంకటాద్రి,సౌభాగ్యమ్య దంపతులకు 1920 అక్టోబర్ 4న [[1920]] అక్టోబరు నాలుగో తేదీన జన్మించాడు. 'గోరా' ప్రభావానికి లోనయ్యాడు.మాలపల్లిలో సహ పంక్తి భోజనాలు చేసిన అభ్యుదయవాది. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి 'స్వతంత్ర భారత్' అనే పత్రిక రాతప్రతిని చుట్టుపక్కల గ్రామాల్లో సర్క్యులేట్ చేశారు. సూరపనేని శేషగిరిరావుతో కలసి ట్యుటోరియల్ ప్రారంభించాడు. సినిమాలవైపు ఆకర్షితుడయ్యాడు. 1945లో కృష్ణవేణిని వితంతు వివాహం చేసుకున్నారు.1950 నవంబర్‌లో మద్రాసుకు మకాం మార్చిన కృష్ణమూర్తి మొదట్లో ట్యూషన్లు చెప్పుకుంటూ కొంత కాలం గడిపారు. కొడవటిగంటి కుటుంబరావు పేరు పెట్టిన 'పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్' సంస్థలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తొలిసినిమా ''[[పల్లెటూరు]]'' తీసాడు. సారథి సంస్థ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, జనరల్ మేనేజర్‌గా ఎన్నో చిత్రాల నిర్మాణానికి కృషి చేశాడు. ''సారథి నా విశ్వవిద్యాలయం'' అంటాడు. తెలుగు, తమిళం లలో సుప్రసిద్ధ నటీనటులతో పదమూడు చిత్రాలు తీశాడు. హైదరాబాద్‌లో 'సారథి స్టూడియో' ఏర్పాటుకు కృషి చేశాడు. ఆయనే దానికి తొలి జనరల్ మేనేజరు.'ఏరువాక సాగారో' పాటకు నర్తించిన వహీదా రెహమాన్‌ను తీసుకొచ్చింది కృష్ణమూర్తే. 1962 లో తానే సొంతంగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో [[రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్]] ప్రారంభించాడు. ఆయనకు రవీంద్ర కవి అంటే ప్రాణం. ఆయన సంస్థలన్నీ ''రవీంద్ర''తోనే మొదలయ్యాయి. [[లక్షాధికారి]], [[జమీందారు]], [[బంగారుగాజులు]], [[ధర్మదాత]]... ఇలా ఎన్నో చిత్రాలు. [[జూబ్లీ హిల్స్‌]] లో ఫిల్మ్‌నగర్ వ్యవస్థాపకుడు. జంట నగరాల్లో ఇరవైమూడు కాలనీలను ఒక గొడుగు క్రిందకు తెచ్చి, ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. తెలుగు భాషా చైతన్య సమితికి గౌరవాధ్యక్షుడు. తెలుగు భాషాభ్యుదయ సమాఖ్యకు సలహాదారు. ప్రజానాట్యమండలి పోషకులు. [[నంది అవార్డు]] ల కమిటీలో సభ్యుడు, ఛైర్మన్ అయ్యాడు. చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ సభ్యుడు.వృద్ధాప్యంలో ఎవరికీ భారం కాకూడనే అభిప్రాయంతో కనుమూసే వరకు వృద్ధాశ్రమంలో కాలం గడిపారు.చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సభ్యుడు. ఆ సంస్థ నడిపే వృద్ధాశ్రమంలోనూ సేవ చేస్తున్నాడు. 'సినిమా ఒక మజిలీ... సమసమాజం నా అంతిమ లక్ష్యం' అంటారు. ఇతడు2007 లో "రఘుపతి వెంకయ్య అవార్డు" ను పొందినాడు.<ref>[http://www.indiaglitz.com/channels/telugu/article/44994.html Raghupathi Venkaiah award 2007 to Tammareddy Krishna Murthy]</ref><ref>[http://www.hindu.com/2009/02/15/stories/2009021560040500.htm Starry fare marks awards night in The Hindu]</ref>