మండలం: కూర్పుల మధ్య తేడాలు

భారతదేశంలో జిల్లాల ఉప పరిపాలనా విభాగాలు
దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

07:18, 22 సెప్టెంబరు 2005 నాటి కూర్పు

మండలము ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి తాలూకాలను రద్దు చేసి 1985 లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామాలు కలిపి ఒక మండలము యేర్పడును.

ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములో 1,124 మండలములు కలవు. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక రెవిన్యూ డివిజన్‌ యేర్పడును. అటువంటివి ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము 78 కలవు. ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ రెవిన్యూ డివిజన్లు కలిపి ఒక జిల్లా యేర్పడును.


1985 కు ముందు 1985 తర్వాత
జిల్లా జిల్లా
డివిజన్‌ డివిజన్‌
తాలూకా మండలము
బ్లాకు
గ్రామము గ్రామము
"https://te.wikipedia.org/w/index.php?title=మండలం&oldid=11850" నుండి వెలికితీశారు