తుని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 18:
literacy_female =51.33|
area_magnitude= చ.కి.మీ|
area_total = |
|pincode = 533401}}
[[File:Landscape view at Tuni.jpg|thumb|240px|తుని వద్ద తూర్పుకనుమలు]]
పంక్తి 32:
 
==పట్టణ చరిత్ర==
చారిత్రకంగా తునికి కొంత పేరు లేకపోలేదు. తుని పట్టణము క్షత్రియులు,వైశ్యుల ద్వారా కొంతవరకూ అభివృద్ది చెందినది. తునిని పాలించిన రాజులు వత్సవాయి వంశానికి చెందిన క్షత్రియులు. ప్రసిద్ద కవి [[చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి]] [[కాశీ]] యాత్ర చేసుకుని తిరిగి వస్తూ 1890 ప్రాంతాలలో తునిలోని సత్రంలో ఆగినట్లు చెప్పుకున్నారు. ఈ సత్రము పెద్ద బజారు నుండి రైలు స్టేషన్ కి వెళ్ళే దారిలో, జి. ఎన్. టి. రోడ్డు, మెయిన్ రోడ్డు కలుసుకున్న మొగలో ఉండేది. ఈ జి. ఎన్. టి. రోడ్డు మీద, [[విశాఖపట్నం]]కి, [[రాజమండ్రి]]కి నడిమధ్యలో ఉంది తుని.
 
;ఈ పట్టణమునకు సంబందించిన ఒక నానుడి
 
పూర్వకాలంలో ఎప్పుడో ఒక నాడు [[జ్యేష్ఠా దేవి]] (పెద్దమ్మ), [[లక్ష్మీ దేవి]] (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వు ఇలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యేష్ఠమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు” అని తీర్పు చెప్పేడుట. తెలుగు భాషలో '''తుని తగువు తీర్చినట్లు''' లేదా '''తుంతగువులు తీరవుగాని''' అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు.
 
తుని, [[పాయకరావు పేట]]ల మధ్య ఉన్న [[తాండవ నది]] కి ఎడమ ఒడ్డున పాయకరావు పేట ఉన్నది. తుని తూర్పు గోదావరి జిల్లా లోను, పాయకరావు పేట విశాఖపట్నం జిల్లా లోను ఉన్నాయి.
 
==శాసనసభ నియోజకవర్గం==
పంక్తి 47:
 
;ఆదివారపు సంత
తునిలో ప్రతి ఆదివారము జరిగే సంతకు ఏజన్సీ ప్రాంతాల నుండి పండిన [[చింత|చింతపండు]], [[అడ్డాకులు]], [[కుంకుడు కాయలు]], [[శీకాయ|సీకాయ]], [[కొండ చీపుళ్ళు]] మొదలైన వాటితో పాటు [[చెరకు బెల్లం]], [[ఖద్దరు]], [[తమలపాకులు]], [[మామిడి పళ్ళు]]తీసుకు రాబడుతాయి. ఇలా తీసురాబడిన సరుకులు ఆదివారం సంతలో సరసమైన ధరలకి దొరికేవి. ఈ సంత సత్రవు కి ఎదురుగా ఉన్న బయలులో తాండవ నదికి కుడి ఒడ్డున జరిగేది.
;తునిలో మామిడి పండ్లు
తునిలో ఉండే మరొక లగ్జరీ మామిడి పళ్ళు. ఇక్కడ దరిదాపు 250 రకాల పళ్ళు దొరుకుతాయిట. వీటిలో కొన్ని రకాలు: చెరకు రసం, పెద్ద రసం, చిన్న రసం, నూజివీడు రసం (లేక తురక మామిడి పండు), పంచదార కలశ, నీలం, కోలంగోవ, ఏండ్రాసు, సువర్ణరేఖ, బంగినపల్లి, కలెక్టరు, జహంగీరు. మామిడి పళ్ళతో పాటు తుని నుండి ఎగుమతి అయే వస్తువులు ముఖ్యంగా బెల్లం, తమలపాకులు, చేనేత బట్టలు. స్టేషన్ లో గుడ్స్ షెడ్డులో నిలువెత్తు పేర్చి ఉండేవి ఈ సరుకులు.
;ఏనుగు కొండ
బోడి మెట్ట వెనకాతల కొంచెం ఎత్తయిన కొండ ఒకటి ఉంది. అదే ఏనుగు కొండ. ఈ కొండని సగం పైకి ఎక్కితే చాలు ఏడు మైళ్ళ దూరంలో, పెంటకోట దగ్గర ఉన్న సముద్రం నీలంపాటి చారలా కనిపింస్తుంది. పెంటకోట లో సముద్రపుటొడ్డున ఒక విరిగిపోయిన లైట్‌హౌస్ ఉండేది. ఒకానొకప్పుడు పెంటకోటకి పడవల రాక పోకలు ఎక్కువగా జరుగుతుండేవి.తరువాతి రోజులలో మెల్లమెల్లగా వ్యాపారము క్షీణించిపోయినది.
;తలుపులమ్మలోవ
తుని అనగానే చట్టున గుర్తొచ్చే పేరు తలుపులమ్మ లోవ. తలుపులమ్మ తల్లి ఇక్కడ ఒక చిన్న గుహలాంటి ప్రదేశంలో ఉంటుంది. కొండ మలుపులు ఎత్తు పల్లాలు రాళ్ళు రప్పల మధ్య నడక దారిలో చాలా దూరం ప్రాయాణము చేయగా వచ్చే లోయ ఇది. ఇప్పుడంటే బస్సులు వేసేరు కాని పూర్వం తలుపులమ్మ లోవ కి వెళ్ళటం అంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఘన కార్యంగా భావించేవారు. ఈ లోయలో ఒక ఝరీపాతం ఉంది. ఆ రోజులలో ఈ ఝరీపాతం లోని నీళ్ళు కొబ్బరి నీళ్ళల్లా తియ్యగా ఉండేవి. ఈ సెలయేరుకి ఇటు అటు ఎన్నో రకాల జాతుల మొక్కలు ఉండట వలన ఈ ప్రదేశము సోభాయమానముగా కానవస్తుంది. తలుపులమ్మ లోవ పర్యాటకులని ఆకర్షించటానికి అనువుగా తీర్చిదిద్దిన సుందరమైన ప్రదేశం.
;తుని కిళ్లీ
భోజనం తర్వాత కిళ్ళీకి కూడ తుని ప్రసిద్ధమే. తుని దగ్గర లకారసామి కొండ దిగువన రాంభద్రపురం పక్కన సత్యవరం అనే పల్లెటూరు ఉంది. ఆ ఊరు మట్టిలో ఉన్న అద్భుతం వలననో ఏమిటో కాని అక్కడ పెరిగే తమలపాకుల రుచి మహద్బుతంగా ఉంటుందంటారు. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉంటే తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగి పోతాయి. తుని తమలపాకులు లేకపోతే కాకినాడలో నూర్జహాన్ కిళ్ళీ ఉండేదే కాదు అంటారంతా. హొటల్లో భోజనం చేసి, కోటయ్య కొట్లో కాజా కొనుక్కు తిని, తర్వాత నూర్జహాన్ కిళ్ళీ వేసుకుని సినిమాకి వెళ్ళటం అంటే ఆ చుట్టుప్రక్కల వాళ్ళకు పాత రోజులలో ఒక లగ్జరీ.
;ఊక మేడ
తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అంటారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊకని పేడతో కలిపి పిడకలు చెయ్యవచ్చనీ, ఇటిక ఆవములలో వేసి కాల్చ వచ్చనీ, కాలిన ఊక నుసితో పండ్ల పొడి చెయ్యవచ్చనీ గమనించి, అటువంటి “పనికిమాలిన” ఊకని అమ్మి మేడలు కట్టగలిగే చాకచక్యం ఈ ఊరి వర్తకులకి ఉందనిన్నీ ఊకమేడను చూస్తే తెలుస్తుంది.
;రీడింగు రూం
తుని పట్టణంలో స్టేషన్‌కి ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర గోలీ సోడా తాగి, ఆ పక్కనే ఉన్న రీడింగ్ రూం కి వెళ్ళి పేపరు చదవటం చాలమందికి దైనందిన కార్యక్రమాలలో ఒకటి గాఉండేది. రీడింగ్ రూము అంటే లైబ్రరి కాదు. ఇరవై అడుగులు పొడుగున్న ఒక పెద్ద గది, ఆ గది నిండుగా ఈ కొస నుండి ఆ కొసకి ఒక పొడుగాటి బల్ల, దానికి రెండు వైపులా కుర్చీలు. బల్ల మీద రెండో మూడో ఇంగ్లీషు దిన పత్రికలు, ఒకటో, రెండో తెలుగు దిన పత్రికలు, ఏదో నామకః వారపత్రికలు, ఉండేవి. వాటి కోసం గది ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఎనాటమీ లేబొరేటరీలో శవాన్ని కోసినట్లు, పేపరుని ఏ కీలుకా కీలు విడగొట్టేసి, తలో మూలకీ పట్టుకు పోయి చదువుకునే వారు. ముందు పేజీ ఒకడు నిలబడి చదువుతూ ఉంటే, దాని వెనక పేజీ మరొకడు ఒంగుని చదివే వాడు.
ఈ గది పక్కగా చిన్న కొట్టు. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రేడియోనే బయట అరుగు మీద ఉన్న లౌడ్ స్పీకర్ కి తగిలించేవారు. సాయంకాలం ఐదింటికి వార్తలు, ఆ తర్వాత సంగీతం పెట్టేవారు. రీడింగ్ రూము బయట అరుగు మీద ఎప్పుడూ ఎవ్వరో ఒకరు [[చదరంగం]] ఆడుతూ ఉండేవారు. ఆడేవాళ్ళు ఇద్దరు, చూసే వారు, సలహాలు ఇచ్చేవారు పది మంది!
 
==తెన్నేటి-ప్రజాపార్టీ==
ఈ అరుగుకి ఎదురుగా కొంత ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో సిమెంటుతో కట్టిన ఒక వేదిక, జెండా ఎగరెయ్యడానికి ఒక స్థంబం. ఒక సారి [[తెన్నేటి విశ్వనాధం|తెన్నేటి విశ్వనాథం]] ప్రజాపార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఈ వేదిక మీద నిలబడి ప్రసంగించేడు. విశ్వనాథం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రియ సహాధ్యాయి, శిష్యుడు, రాజకీయ వారసుడూను. కాంగ్రెస్ పార్టీ మీద, జవహర్‌లాల్ నెహ్రూ పరిపాలనా దక్షత మీద విరక్తి పుట్టి ప్రజాపార్టీని స్థాపించేడు ఆ సందర్భం లో "కాంగ్రెస్ పార్టి మండోదరి శరీరంలా చివికి పోయింది. ఇది మరమ్మత్తు చేస్తే బాగుపడేది కాదు. అందుకని దీని స్థానంలో మరొక కొత్త పార్టీని స్థాపించేం” అని అంటూ మండోదరి కథ చెప్పుకొచ్చేడు.
 
==విద్యా సంస్థలు==
పంక్తి 74:
రాజా ప్రభుత్వ పాఠశాల,
బాలికల ప్రభుత్వ పాఠశాల,
లయోల విద్యా సంస్థలు,
భాష్యమ్ విద్యా సంస్థలు,
నారాయణ విద్యా సంస్థలు,
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ అఫ్ ఎడ్యుకేషన్
రవీన్ద్ర భారతీ విద్యా సంస్థలు కలవు
 
==ఇతర సౌకర్యాలు==
* రైల్వే స్టేషన్ {చెన్నై-హౌరా రైలు మార్గం తుని మీదుగానే వెళుతుంది.}
* బస్టాండ్
* పోలీస్ స్టేషన్ {రైల్వే స్టేషన్ సమీపాన}
పంక్తి 93:
 
==ప్రముఖులు==
తుని ప్రక్కనే గల [[పాయకరావుపేట]] సుప్రసిద్ధ ఘట వాయిద్యకారుడు [[కోలంక వెంకటరాజు]] యొక్క స్వస్థలం. ఈయనే ఘట వాయిద్యం కనిపెట్టేడని అంటారు. ఈయన [[ద్వారం వెంకటస్వామినాయుడు]] కచేరీలలో పక్క వాయిద్యం వాయించేవాడు.
;[[అల్లూరి సీతారామరాజు]]
1911 ప్రాంతాలలో, తునిలో తన మామయ్య గారి ఇంట ఉండి తుని రాజా బహదూర్ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుకొనెను. ఆయన గుర్రపు స్వారీ, మల్లుయుద్ధం నందు, ఆటల యందు ఆసక్తి కనబరిచేవాడు అని ఆ పాఠశాలలో వినికిడి. ఈయన తుని ప్రక్కన వున్న సీతమ్మ వారి కొండ మీద తపస్సు చేసేను. విశాఖపట్నంలో ఉన్న మిసెస్ ఎ. వి. ఎన్. కళాశాల కు అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలలో చదువు ప్రారంభించి, పూర్తి కాకుండానే ఆపు చేసేడని ఒక కథనం ఉంది. తర్వాత 1929 లో సీతారామరాజు దండు అడ్డతీగెల, రంపచోడవరం, చింతపల్లి, అన్నవరం, తుని పోలీసు స్టేషన్‌ల పై దాడి చేసి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం జరిగినది.
;[[బాలయోగి]]
తుని ఊరి బయట బాలయోగి మెట్ట అనే కొండ ఉండేది. ఈ మెట్ట మీద సీతామ్మవారి పాదం, మాయలేడి డెక్కల గుర్తులు ఉండేవి. ఈ బాలయోగి మెట్ట మీద, ఒక రాయి మీద, ఒక సారి ఒక బాలయోగి వెలిసేడు - పూర్వాశ్రమంలో రైలు స్టేషన్ లో మసాలా గారెలు అమ్ముకుని బతికే కుర్రాడు. ఆ బాలయోగి కోసం కొండ మీద గుడి కట్టేరు. భక్తులు పాలు, పండ్లు పట్టికెళ్ళి రివాజుగా యోగికి ఇచ్చే వారు. ముమ్మడివరంలో పేరు ప్రఖ్యాతులను పొందిన బాలయోగి ఇంతకు ముందు దశాబ్దం వ్యక్తి; తునిలో బోడిమెట్ట మీద వ్యక్తి కొద్ది రోజులే తపస్సు చేసి తిరిగి అందరిలో కలసిపోయాడు. పేరులో పోలిక తప్ప సిసలైన అసలు బాలయోగి ముమ్మడివరం బాలయోగే!
 
==నీలిమందు==
"https://te.wikipedia.org/wiki/తుని" నుండి వెలికితీశారు