తెలుగు విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
విజ్ఞాన సర్వస్వము అనగా మానవాళికి తెలిసిన జ్ఞానాన్ని ఒకచోట పొందుపరచిన పుస్తకాలు లేక మాధ్యమాలు. సాధారణంగా విద్యావేత్తలు విజ్ఞాన సర్వాస్వ రచనలో పాలు పంచుకుంటారు. ప్రాచీన కాలంలో ఒక్క పండితుడు విజ్ఞాన సర్వస్వము రాయకలిగినా, తరువాతికాలంలో జ్ఞానము విపరీతంగా అభివృద్ధి కావడంతో, ఒక్కరే ఈ పనిచేయటం కష్టసాధ్యము.
 
తెలుగు భాషలో [[పెద్ద బాలశిక్ష]] మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వము. ఆ తరువాత [[ కొమర్రాజు లక్ష్మణరావు]] ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం , [[తెలుగు భాషా సమితి]] వారి విజ్ఞాన సర్వస్వము ప్రచురణ అయ్యాయి. తెలుగు [[వికీపీడియా]] ఆధునిక అంతర్జాల యుగంలో ప్రతిఒక్కరు పాల్గొనగల విజ్ఞాన సర్వస్వము.2004 తరువాత పెద్దబాలశిక్షపేరుతో చాలా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. వాటిలో గాజుల సత్యన్నారాయణ సంకలనంచేసిన తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష ప్రజాదరణ పొందింది.
 
==పెద్ద బాలశిక్ష==
ప్రధాన వ్యాసం: [[పెద్ద బాలశిక్ష]]
[[దస్త్రం:PeddaBalaSikshaPage11.jpg|left|thumb|పెద్దబాలశిక్ష 11 వ పేజి]]
1832 లో మేస్తర్ క్లూ లో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి చేత బాలశిక్ష అనే గ్రంథాన్ని రచింపచేశాడు. ఈయన రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న మన దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది. 1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు. 1865లో అంటే రమారమి పదేళ్ళ తర్వాత ముద్రణలో పుటల సంఖ్య 90. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, చందస్సు సంస్కృత శ్లోకాలు , భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు.దానిని బాలవివేకకల్ప తరువుగా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోవున్న పుస్తకం పెద్ద బాలశిక్షగా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు- అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు- నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారత్రిక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పూదూరువారు పొందుపరచారు.
 
<gallery>
File:AndhraVignanaSarvaswam2KVLaxmanaRao.PNG| ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం
దస్త్రం:Vignana Sarvasvam(Vol-V) -Vishwa Sahithi.png|విశ్వసాహితి
ఫైలు:Wikipedia-logo-te.png|తెలుగు వికీపీడియా లోగో
పంక్తి 25:
"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవుసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంధాలు పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. [[మదనపల్లె]]లో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ [[మద్రాసు]] వచ్చాడు. ఆంధ్ర సంపుటం రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే [[1923]] [[జూలై 12]]న లక్ష్మణరావు మరణించాడు.
 
అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం "అ"కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంధాలోను కనిపించలేదట. చేసిన ప్రతిపనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు. తర్వాత [[కాశీనాధుని నాగేశ్వరరావు]] మరింత మంది పండితుల సహకారంతో తిరిగి 'అ'కార పరంపరనే రెండు ముచ్చటైన సంపుటాలలో <ref>[http://www.new.dli.ernet.in/ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటి 4 నకలు ([[భారత డిజిటల్ లైబ్రరీ]]లో) ]</ref>ప్రచురించాడు.
 
== తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వము==
 
1947లో చెన్నయిలో ప్రారంభమైన [[తెలుగు భాషా సమితి]] [[బెజవాడ గోపాలరెడ్డి]] అధ్యక్షతన ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక విషయానుక్రమంగా రూపకల్పన చేసింది. ఆ తరువాత హైద్రాబాదునుండి పనిచేసి 14 కోశాల విజ్ఞాన సర్వస్వమును ప్రచురించింది. 15 అక్టోబరు 1986 లో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] లో భాగమై ఇప్పుడు [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] విజ్ఞాన సర్వస్వ కేంద్రము <ref>[http://teluguuniversity.ac.in/encyclopedia/encyclo_home.html పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము విజ్ఞాన సర్వస్వ కేంద్రము] </ref> అని పిలవబడుతున్నది. క్రింద ఇవ్వబడిన శీర్షికలకు , దగ్గరి సంబంధమున్నతెలుగు వికీపీడియా వ్యాసాల లింకులు ఇవ్వబడినవి.
# [[సంస్కృతి| తెలుగు సంస్కృతి సంపుటి-I]]
# [[చతుష్షష్ఠి కళలు|లలిత కళలు]]
# [[న్యాయ మీమాంస|న్యాయ]] పరిపాలనా శాస్త్రములు
# [[జీవ శాస్త్రము| జీవ శాస్త్రములు]]
# [[సామాజిక శాస్త్రం| సాంఘీక శాస్త్రములు ]]
# [[ఇంజినీరింగ్| అభియాంత్రికత మరియు సాంకేతికము (?) (Engineering and Technology)]]
# [[గణితము|గణిత]] [[ఖగోళ శాస్త్రము| ఖగోళ]] శాస్త్రములు
# [[మతము]]లు- [[తత్వము|దర్శనములు]]
# [[సంస్కృతి| తెలుగు సంస్కృతి సంపుటి-II]]
# [[తెలుగు సాహిత్యము| విశ్వసాహితి]] <ref> [http://www.archive.org/stream/vignanasarvasvam026046mbp#page/n2/mode/1up విశ్వసాహితి ఆర్కైవ్.ఆర్గ్లో నకలు ]</ref>
# [[భాష|భారత భారతీ]]
 
పంక్తి 46:
ప్రధాన వ్యాసం: [[తెలుగు వికీపీడియా]]<br />
 
2001 లో మొట్టమొదటగా [[ఆంగ్ల భాష]]లో [[వికీపీడియా]]ను [[జిమ్మీ వేల్స్]] , [[లారీ సాంగెర్]] ఆరంభించారు. దీని ముఖ్య ఊహ, స్వచ్చందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియుమార్చగలగటం. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతంగా నడక సాగించి, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 7 వ స్థానంలోకి వచ్చింది. ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం అభివృద్ధి పధంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే తెలుగు వికీపీడియా ఆవిర్భావం. [[వాడుకరి:Vnagarjuna|వెన్న నాగార్జున]] ద్వారా '''తెవికీ''' [[2003]] [[డిసెంబర్ 9]]న ఆవిర్భవించింది. నిరంతర కృషి వలన తెవికీ దినదిన ప్రవర్థమానమవుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగు వికీపీడియా ప్రస్తుత సభ్యుల సంఖ్య {{NUMBEROFUSERS}} మరియు వ్యాసాల సంఖ్య {{NUMBEROFARTICLES}}. ప్రధాన వర్గాలు :[[ఆంధ్ర ప్రదేశ్]], [[భాష]], [[సంస్కృతి]], [[భారత దేశము]], [[ప్రపంచము]], [[:వర్గం:విజ్ఞాన శాస్త్రము| విజ్ఞానము]], మరియు[[ఇంజనీరింగ్ |సాంకేతికం]]
 
==తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష==
 
[[గాజుల సత్యన్నారాయణ]] రాసిన "తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష"
<ref> "తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష" గాజుల సత్యన్నారాయణ, అన్నపూర్ణ పబ్లిషర్స్, జనవరి 2004</ref> మొదటిసారిగా జనవరి 2004లో [[అన్నపూర్ణ పబ్లిషర్స్ ]]విడుదల చేశారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. కేవలం 116 రూపాయలు విలువతో [[భాష]] విజ్ఞానము, [[సంస్కృతి]] [[సంప్రదాయము]], [[బాలానందము]], [[శతక]], [[నీతికథా]], [[సంఖ్య]] శాస్త్రము, [[ఆధ్యాత్మిక]], [[కంప్యూటర్]], [[గణితము|గణిత]] శాస్త్ర, [[:వర్గం:విజ్ఞాన శాస్త్రము| విజ్ఞాన]], [[వాస్తు]], [[పంచాంగము]],[[మహిళ]], [[ఆరోగ్యము]], [[క్రీడలు|క్రీడారంగము]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశము]], [[ప్రపంచము]] అనే 18 పర్వాలతో 1000 పైగా పేజీలతో ఒకే ఒక కోశంగా ముద్రితమైంది.
 
==వనరులు==
పంక్తి 59:
[[వర్గం:తెలుగు]]
 
5.[http://www.teluguthesis.com/2013/03/encyclopedia-telugu-culture.html విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి PDF]