తెలుగు సినిమా పాట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
ఈ కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ దాశరథి, సి.నారాయణరెడ్డి మొదలైన సాహితీ ప్రముఖులు సినిమా పాట విలువను పెంచారు. వీరికి తోడుగా వేటూరి, మల్లెమాల, జాలాది, గోపి మొదలైన కొత్త కవులు చిత్రరంగ ప్రవేశం చేశారు.
 
దేవులపల్లి శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ చిత్రానికి నా దారి ఎడారి, నా పేరు బికారి అనే గీతం, ఆరుద్ర ముత్యాలముగ్గు చిత్రం కోసం ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ వంటి తెలుగుతనం నిండిన పాటని రచించారు. దసరా బుల్లోడు, ప్రేమనగర్ చిత్రాల పాటలు అపూర్వ విజయం సాధించి ఆత్రేయకు తెలుగు సినీరంగంలో పేరు ప్రఖ్యాతులు లభించాఅయి. సామాన్యునికి అర్థమయ్యే భాషలో "మనసుగతి యింతో మనిషి బ్రతుకింతే" లాంటి భావుకత కలిగిన మనసుకవి ఆత్రేయ ఈకాలంలో రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడని పేరుపడ్డారు. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం [[తెలుగువీర లేవరా]] పాటను రచించిన [[శ్రీరంగం శ్రీనివాసరావు]] జాతీయ స్థాయిలో మొదటిసారిగా తెలుగు పాటకు గుర్తింపు తెచ్చాడు. తొలిసారిగా సినీ గేయరచయితగా ప్రవేశించిన [[జాలాది రాజారావు]] ప్రాణం ఖరీదు సినిమా కోసం "ఏతమేసి తోడినా ఏరు ఎండదు అంటూ సందర్భోచితమైన పాటను రచించారు. వీరు జానపద, సామాజిక తాత్త్విక భావాలతో నిండిన పాటలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇదే కాలంలో [[రాజశ్రీ]]గా ప్రవేశించిన ఇందుకూరి రామకృష్ణంరాజు కురిసింది వాన నా గుండెలోన అనే గీతంతో పాటు ఉన్నతమైన డబ్బింగ్ చిత్రాలకు సాహిత్య విలువల్ని చేర్చి వాటిని ప్రధానబరిలోని సినిమాలతో సమానంగా సినీ సాహిత్యాన్ని కూర్చారు.
 
==1979-1991==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమా_పాట" నుండి వెలికితీశారు