త్యాగరాజు కీర్తనలు: కూర్పుల మధ్య తేడాలు

మూస చేర్పు
చి Wikipedia python library
పంక్తి 1:
{{శుద్ధి|ఫిబ్రవరి 2007}}

త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజు గా ప్రసిద్ది కెక్కిన ఈయన [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామశాస్త్రి]] లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకడు. 16 వ శతాబ్దాంతమున [[విజయనగర సామ్రాజ్యము|విజయ నగర సామ్రాజ్య]] పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. కర్నూలు జిల్లా కు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య. 1767?? లో కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మలకు తిరువారూర్ గ్రామంలో జన్మించాడు త్యాగయ్య. తరువాత కావేరీ నదీ తీరాన ఉన్న తిరువయ్యూరు కు మారాడు కాకర్ల రామబ్రహ్మం. ఇప్పటికీ తిరువయ్యూరులో త్యాగరాజ వంశస్తులు ఆయన ఇంటిని పరిరక్షిస్తూనే ఉన్నారు.

ఈయన [[పంచరత్న కీర్తనలు]], సంగీతం మీద త్యాగయ్య పట్టు ను వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో [[ఉత్సవ సంప్రదాయ కీర్తనలు]], [[దివ్య నామ సంకీర్తనలు]] కూర్చాడు.
పంక్తి 159:
పన్నీరు గంధము పూయరుగా

అందమైన యదునందుని పైని

కుందరదనవర వందగ పరిమళ "గంధము"

తిలకము దిద్దరుగా

కస్తూరి తిలకము దిద్దరుగా

కళకళమని ముఖకళగని సొక్కుచు

పలుకుల నమృతము నొలెకిడి స్వామికి "తిలకము"

చేలము గట్టరుగా

బంగారు చేలము గట్టరుగా

మాలిమితో గోపాల బాలులతో

నాల మేపిన విశాల నయనునికి "చేలము"

హారతులెత్తరుగా

ముత్యాల హారతులెత్తరుగా

నారీమణులకు వారము యవ్వన

వారక యొసగెడి వారిజాక్షునికి "హారతులు"

పూజలు చేయరుగా

మనసారా పూజలు చేయరుగా

జాజులు మరివిర జాజుల దవనము

రాజిత త్యాగరాజ వినుతునికి "పూజలు"

"గంధము" "తిలకము" "చేలము" "హారతులు" పూజలు"

"https://te.wikipedia.org/wiki/త్యాగరాజు_కీర్తనలు" నుండి వెలికితీశారు