థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 18:
| ethnic_groups =
{{unbulleted list
| 89% [[Thai people|Thai]]{{\}}[[Thai Chinese]]
{{nowrap|{{*}} 34.2% Northeastern ([[Isan people|Isan]])}}<br/>
{{*}} 33.7% Central<br/>
పంక్తి 24:
{{*}} 14.0% Thai Chinese<br/>
{{*}} 13.3% Southern<br/>
| 11% Other (incl. [[Malay people|Malay]], [[Northern Khmer people|Khmer]], "[[Hill tribe (Thailand)|Hill tribes]]")
}}
| ethnic_groups_year = 2009<ref name=CIA/><ref>{{citation |author=Barbara A. West |title=Encyclopedia of the Peoples of Asia and Oceania |publisher=Facts on File |year=2009 |page=794|isbn=1438119135}}</ref>
పంక్తి 72:
| GDP_nominal_per_capita_rank =
| Gini_year = 2010
| Gini_change = <!--increase/decrease/steady-->
| Gini = 39.4 <!--number only-->
| Gini_ref =<ref name="wb-gini">{{cite web |url=http://data.worldbank.org/indicator/SI.POV.GINI/ |title=Gini Index |publisher=World Bank |accessdate=2 March 2011}}</ref>
పంక్తి 95:
 
థాయ్‌లాండ్ అధికారికంగా " కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్ " గా పిలువబడుతుంది. సాధారణంగా సియాం అనిపిలువబడే థాయ్‌లాండ్ ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది.
థాయ్‌లాండ్ ఉత్తరదిశలో బర్మా మరియు లావోస్ , తూర్పుదిశలో [[లావోస్]] మరియు [[ కంబోడియా]], దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ మరియు మలేషియా మరియు పడమర దిశలో అండమాన్ సముద్రం దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో గల్ఫాఫ్ థాయ్‌లాండ్ ఆగ్నేయంలో వియత్నాం మరియు ఇండోనేషియా మరియు భారతదేశం ఉన్నాయి. ఇది దక్షిణాసియా దేశాలలో ఒకటి. థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ పాలిస్తూ ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా చరిత్రలో స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనిఅదళాధిపతి, బౌద్ధమతానుయాయుడు మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు.
 
థాయ్‌లాండ్ విస్తీర్ణంలో ప్రపంచంలో 51వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ విస్తీర్ణం షుమారు 5,13,000 చదరపు కిలోమీటర్లు (1,96,000 చదరపు మైళ్ళు) ఉంటుందని అంచనా. అలాగే జనసాంద్రతలో ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ జనసంఖ్య 6.4 కోట్లు. అలాగే థాయ్‌లాండ్‌లో అతిపెద్ద మరియు రాజధాని నగరం [[బాంకాక్]]. బంకాక్ థాయ్‌లాండ్ రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక మరియు సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. థాయ్‌లాండ్ ప్రజలలో 75% మంది తాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు తాయ్%చైనీయులు మరియు 3% మంది ప్రజలు మలాయ్ సంప్రదాయానికి చెందిన వారు. మిగిలిన అల్పసంఖ్యాకులలో మోనుకు, ఖెమరానులు మరియు వివిధ గిరిజన సంప్రదాయానికి చెందునవారు. థాయ్‌లాండ్ అధికారిక భాధ తాయ్. థాయ్‌లాండ్ ప్రధాన మతం బౌద్ధం. బుద్ధిజాన్ని థాయ్‌లాంశ్‌లో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్ 1985 మరియు 1996లో అతివేగంగా ఆర్ధికాభివృద్ధి చెందింది. అలాగే ప్రస్థుతం ప్రధానంగా పారిశ్రామికంగా మారుతూ ప్రధాన ఎగుమతి కేంద్రంగా విలసిల్లుతుంది. దేశాదాయంలో పర్యాటకం కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. దేశంలో చట్టబద్ధంగా మరియు చట్టవ్యతిరేకంగా
20 లక్షల వలసప్రజలు నివసిస్తున్నారు. అలాగే దేశంలో అభివృద్ధి చెందిన దేశాలనుండి వచ్చి చేరిన బహిష్కృతులు అనేకమంది నివసిస్తున్నారు.
 
పంక్తి 103:
థాయ్‌లాండ్‌ను ఇక్కడి ప్రజలు సాధారణంగా మెయాంగ్ థాయ్‌లాండ్ అని పిలుస్తూ ఉంటారు, ఇతరులు " ది ఎక్సోనిం సియాం " అని సియాం, శ్యాం, శ్యామ అని కూడా అంటారు. శ్యామా అంటే సంస్కృతంలో శ్యామా అంటే నల్లని అని అర్ధం. 1851-1868 మద్యకాలంలో సియాం రాజ్యాన్ని మాంకట్ రాజు పరిపాలించాడు. 1939 జూన్ 23లో ఈ దేశానికి థాయ్‌లాండ్ పేరు మార్చబడింది.
1945 మే 11 - 1949 వరకు థాయ్‌లాండుకు తిరిగి సియాం అని పేరు మార్చబడింది. తరువాత కాలంలో తిరిగి థాయ్‌లాండుగా మార్చబడింది. థాయ్ అనేమాట థాయ్ భాషలోని థాయ్ (స్వతంత్రం) కాదు కాని థాయ్ అనేమాట థాయ్ సంప్రదాయక ప్రజలను సూచిస్తుంది. ప్రముఖ పరిశోధక విద్యార్ధి థాయ్ అంటే " ప్రజలు " మరియు " మానవుడు " అని అర్ధమని అభిప్రాయపడ్డాడు.
ఇప్పటికీ థాయ్‌లాండ్ గ్రామాలలో ప్రజలు (థాయ్ భాషలో ప్రజలు అంటే ఖాన్ అంటారు) ఖాన్ మాటకు బదులుగా థాయ్ మాటను వాడుతుంటారు. థాయ్ అనే మాట స్వేచ్చ అని అర్ధం కూడా ఇస్తుంది. " లాండ్ ఆఫ్ ఫ్రీ " (స్వతంత్ర భూమి) అనే మాటకు అర్ధం . దక్షిణాసియాలో యురేపియన్ ఆక్రమణకు గురికాని ఒకేఒక దేశం థాయ్‌లాండ్ కనుక ఇక్కడి ప్రజలు తమదేశానికి " థాయ్‌లాండ్ " ( సర్వస్వతంత్ర భూమి ) అని సగర్వంగా చెప్పుకుంటారు. అయినప్పటికి కొందరు ప్రజలు ప్రాథెట్ థాయ్, మెయాంగ్ థాయ్ లేక చిన్నాగా థాయ్ అనీ అంటుంటుంటారు. థాయ్ అంటే దేశం అనికూడా అంటారు అయినప్పటికీ దీనిని నగరం, పట్టణం అని కూడా అర్ధం స్పురిస్తుంది. రాచా అనాచక్ థాయ్ అంటే థాయ్‌లాండ్ సాంరాజ్యం అని అర్ధం స్పురిస్తుంది. రాచా అంటే సంస్కృతంలో రాజా, రాజరికం అని అర్ధం. అనా అంటే సంస్కృతంలో ఆఙ అని అర్ధం. చక్ అంటే సంస్కృతంలో చక్రం అంటే అధికారానికి పాలనకు గుర్తు. థాయ్‌లాండ్ జాతీయగీతాన్ని 1930లో దేశభక్తుడైన పీటర్ ఫియట్ రచించాడు.
 
==చరిత్ర==
థాయ్ ల్యాండ్ పుట్టుక కొద్ది కాలమే ఉన్న 1238 నాటి సుఖోథాయ్ రాజ్యానికి ఆపాదిస్తారు. దీని తర్వాత ఆయుత్థాయ రాజ్యం 14 వ శతాబ్ధంలో స్థాపించబడింది. థాయ్ సంస్కృతి చైనా మరియూ భారత దేశముల వల్ల చాలా ప్రభావితము చెందినది. మిగిలిన దక్షిణాసియా దేశాలలో మాదిరిగా థాయ్‌లాండ్‌లో 40,000 సంవత్సరాలాకు పూర్వమే మానవులునివసించిన ఆధారాలు ఉన్నాయి. మొదటి శతబ్ధంలో ఖేమర్ సాంరాజ్యానికి చెందిన ఫ్యునాన్ పాలన నుండి థాయ్‌లాండ్ ప్రజలమీద భారతీయ సంప్రదాయం మరియు మత ప్రభావం అధికంగా ఉంది.ఆయుధాయ వద్ద ఉన్న " వాట్ చైనావాతానారాం " అవశేషాలు 1767లో బర్మీయులు రాజా హిబంషిన్ ఆధ్వర్యంలో ఈ దేశంలో సాగించిన భస్మీపటలానికి గుర్తుగా నిలిచాయి. 13వ శతాబ్ధంలో ఖేమర్ సాంరాజ్యం పతనం తరువాత థాయ్, మాన్ మరియు మలాయ్ రాజ్యాలు తలెత్తి వర్ధిల్లాయి. ఈ ప్రదేశాలలో పురాతత్వ పరిశోధనలు మరియు కళాఖండాలు సియామీ సాంరాజ్య అవశేషాలు ఇప్పటికీ విశేషంగా లభిస్తున్నాయి. 12 వ శతాబ్ధానికి ముందు థాయ్ లేక సియామీ సాంరాజ్యానికి చెందిన బుద్ధసంప్రదాయాన్ని అనుసరించే సుఖోథాయ్ పాలనసాగినట్లు 1238లో లభించిన ఆధారాలు తెలియజేస్తున్నాయి.
[[File:WatChaiwatthanaram 2292.JPG|thumb|left|The ruins of [[Wat Chaiwatthanaram]] at [[Phra Nakhon Si Ayutthaya Province|Ayutthaya]]. The city was [[Burmese–Siamese War (1765–1767)|burned and sacked]] in 1767 by a [[Burma|Burmese]] army under the King [[Hsinbyushin]].]]
 
13-15వ శతాబ్ధంలో ఖేమర్ సాంరాజ్యం పతనం తరువాత భౌద్ధసంప్రదాయానికి చెందిన సుఖోథాయ్ సాంరాజ్యం, లాన్నా మరియు క్సాంగ్ (ఇప్పుడు లావోస్) వర్ధిల్లాయి. అయినప్పటికీ ఒక శబ్ధం తరువాత సుఖోథాయ్ అధికారం 14 వ శతాబ్ధంలో దిగువ చాయో ఫ్రయా నది లేక మెనాం ప్రదేశంలో స్థాపించబడిన అయుథాయ సాంరాజ్యం వశమైంది. మెనాంను కేంద్రీకృతం చేసుకుని అయుథాయా సాంరాజ్యం విస్తరిస్తున్న సమయంలో నార్తన్ వెల్లీలో లాన్నా సంరాజ్యం మరియు థాయ్ నగరం భూభాగం కూడా దానిలో అనత్భాగం అయ్యాయి. 1431లో ఖేమర్ అంకారును విడిచివెళ్ళిన తరువాత అయుథాయా సైన్యాలు ఈ నగరాన్ని ఆక్రమించుకున్నాయి. థాయ్‌లాండ్ పొరుగు రాజ్యాలతో చేరి వాణిజ్య సంప్రదాయం దక్కించుకుని చైనా, భారతదేశం, పర్షియా మరియు అరబ్ దేశాలతో వాణిజ్యసంబంధాలు ఏర్పరచుకుంది. అయుథాయ ఆసియాలో వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. 16వ శతాబ్ధంలో పోర్చుగీసు వారితో మొదలై ఫ్రెంచ్,డచ్ మరియు ఆగ్లేయులు మొదలైన ఐరోపావ్యాపారుల రాక కొనసాగింది.
[[File:Chedis at Ayuthhaya.jpg|right|thumb|Stupas at [[Ayutthaya Historical Park]]]]
1767 తరువాత అయుథాయ సాంరాజ్య పతనం తరువాత రాజా టక్సిన్ తన రాజ్య రాజధానిని థాయ్‌లాండ్ నుండి థాన్‌బురికి 15 సంవత్సరాల వరకు తరలించాడు. ప్రస్థుత రత్తానకోసియన్ శకం 1787 నుండి ఆరంభమైంది. తరువాత మొదటి రాజారామా ఆధ్వర్యంలో బ్యాకాక్‌ను రాజధానిగా చేసుకుని చక్రి సంరాజ్య స్థాపన జరిగింది. బ్రిటానికా ఎంసైక్లోపీడియాను అనుసరించి థాయ ప్రజలలో మూడుభాగాలు మరియు బర్మీయులు 17-19 శతాబ్ధాలలో బానిసలుగా వాడుకోబడ్డారు.
 
యురోపియన్ల వత్తిడికి ప్రతిగా యురేపియన్ సాంరాజ్యలకు లోబడని ఏకైక దక్షిణాసియా దేశంగా థాయ్‌లాండ్ నిలబడింది. నాలుగు శతాబ్ధాల కాలంగా శక్తివంతమైన పాలకులు దీర్ఘకాలం థాయ్‌లాండ్‌ను పాలించడమే ఇందుకు ప్రధాన కారణం. థాయ్‌లాండ్ పాలకులు ఫ్రెంచ్ ఇండోచైనా మరియు బ్రిటిష్ సాంరాజ్యం వత్తిడిని మరియు శత్రువానికి 4 శతాబ్ధాల కాలం నిలబడడం మరింత విశేషం అని చెప్పవచ్చు. దక్షిణాసియా దేశాలలో ఫ్రెంచ్ మరియు బ్రిటిన్ సాంరాజ్యల మద్య ఉన్నందున థాయ్‌లాండ్ పశ్చిమదేశాల ప్రభావానికి లోనయ్యింది. పశ్చిమదేశాల ప్రభావంతో 19వ శతాబ్ధంలో వివిధరకాల సంస్కరణలు జరిగాయి. అలాగే ప్రధానంగా మెకాంగ్ తూర్పు భాగంలో విస్తారమైన భూభాగం ఫ్రెంచ్ వశపరచుకోగా బ్రిటన్‌ ప్రభుత్వం అంచలంచలుగా మలాయ్ ద్వీపకల్పంలోని భూభాలను స్వాధీనం చేసుకుంది.
 
== 20వ శతాబ్ధం ==
[[File:BlackCeramicBanChiangCultureThailand1200-800BCE.jpg|An example of pottery discovered near [[Ban Chiang]] in Udon Thani province, the earliest dating to 2100 BCE.|thumb|left]]
పెనాంగ్‌తో మొదలైన నష్టం కొనసాగి చివరకు మలాయ్ సంప్రదాయక ప్రజలు నివసిస్తున్న నాలుగు ప్రాంతాలు కూడా ఆక్రమణకు లోనయ్యాయి. తరువాత 1909లో ఆంగ్లో - సియామీ ఒప్పందం కారణంగా ఆ నాలుగు భూభాగాలు మలేషియా ఉత్తరభూభాగ ప్రాంతాలుగా అయ్యాయి. 1932లో సైన్యానికి చెందిన ఖానా రాసడాన్నా బృందం మరియు సివిల్ అధికారుల యకత్వంలో రక్తపాతరహిత ఉద్యమం చెలరేగి పాలనాధికారం చేతులుమారింది. రాజా ప్రజాధిపాక్ సియాం భూభాగాన్ని ప్రజలహస్థగతం చేయడంతో శతాబ్ధాలుగా సాగిన రాజులపాలన ముగింపుకు వచ్చింది.
రెండవ ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ థాయ్‌లాండ్ అధికారాన్ని మయాయ్ సరిహద్దులకు మార్చమని వత్తిడి చేసింది. థాయ్‌లాండ్ దేశంమీద దండయాత్ర చేసిన జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలను ప్లిక్ పిబల్సంగ్రం వద్ద 6-8 గంటల వరకు నిలిపి ఉంచాయి. 1941 డిసెంబర్ 21 న జరిగిన ఈ సంఘటన తరువాత జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలకు దారి ఇచ్చింది. థాయ్‌లాండ్ మరియు జపాన్ ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ సైన్యాలకు ఎదురించి పోరాడడానికి రహస్యఒప్పందం కుదుర్చుకున్నాయి. 1942లో థాయ్‌లాండ్ జపాన్ సాయతో [[అమెరికా]] మరియు యునైటెడ్ కింగ్‌డం మీద యొద్ధం ప్రకటించింది. థాయ్‌లాండ్ అదేసమయం సెరీ-థాయ్ పేరుతో జపాన్‌ను అడ్డుకునే ఉద్యమం కూడా కొనసాగించడం విశేషం. థాయ్‌లాండ్- బర్మా డెత్-రైల్వే పనిలో 2,00,000 ఆసియన్ (ప్రధానంగా రోముషాకు చేరినవారు) కూలీలు మరియు 60,000 సంయుక్త సైనికదళ సభ్యులు పాల్గొన్నారు. యుద్ధం తరువాత థాయ్‌లాండ్ అమెరికా సహాయ దేశంగా మారింది.
ప్రచ్చన్న యుద్ధం తరువాత థాయ్‌లాండ్ మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలమాదిరిగా రాజకీయ అస్థిరత వంటి సమస్యలను ఎదుర్కొంది. అయినప్పటికీ 1880 నాటికి స్థిరమైన సమృద్ధి మరియు స్వాతంత్ర్యం సాధించింది.
== చిత్రమాలిక ==
<gallery>
పంక్తి 130:
== దక్షిణ భూభాగం ==
[[File:Souththailandmap.GIF|thumb|The southern provinces of Thailand showing the Malay-Muslim majority areas.]]
థాయ్‌లాండ్ 1400 లో మలాయ్ ద్వీపకల్పం మీద ఆధిక్యత సాధించింది. మలాక్కా అనకూడా పిలువబడే ఈ భూభాగంలో టమాసెక్ (ప్రస్థుత సింగపూర్) , అండమాన్ ద్వీపాలలో కొన్ని , మరియు జావా కాలనీ కూడా అంతర్భాగంగా ఉండేది. అయినప్పటికీ చివరకు సుల్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా దాడి చేసిన బ్రిటిష్ సైన్యాల ధాటికి వెనుకంజ వేయక తప్పలేదు. మలాయ్ సుల్తాన్ రాజ్యానికి చెందిన ఉత్తర భూభాగం నుండి థాయ్ రాజాకు బంగారు పుష్పాలరూపంలో సంవత్సర కానుకలు సామంతరాజులు ఇచ్చే కప్పంలా అందుతూ ఉండేవి. మలాయ్ సాంరాజ్యంలో
బ్రిటిష్ ప్రవేశం తరువాత " ఆంగ్లో-సియామీస్ " ఒప్పందం తరువాత బ్యాంకాక్ వరకు రైల్వే మార్గం నిర్మించడానికి సన్నాహాలు ఆరంభం అయ్యాయి. ఈ ఒప్పంద తరువాత సాతన్ మరియు పట్టాని భూభాగాలు థాయ్‌లాండుకు ఇవ్వబడ్డాయి.
 
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మలాయ్ ద్వీపకల్పం జపానీయుల చొరబాటుకు గురైంది. 1942 నుండి 2008 వరకు కమ్యూనిస్టుల ఆధిపత్య కొనసాగింది. చైనా సాంస్కృతిక విప్లవం తరువాత
పంక్తి 137:
== విదేశీసంబంధాలు ==
[[File:Yingluck Shinawatra and Barack Obama.jpg|thumb|Thai Prime Minister [[Yingluck Shinawatra]] greets U.S. President [[Barack Obama]] at the [[Government House of Thailand|Government House]], during his official state visit to Thailand on 18 November 2012.]]
థాయ్‌లాండ్ అత్యధికంగా అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది. థాయ్‌లాండ్ అలీనోద్యమరాజ్యాలలో ప్రధానమైనది అలాగే యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ వాచ్ లిస్ట్ 301 దేశాలలో ప్రాధాన్యత కలిగి ఉన్నది. అసోసేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఎ.ఎస్.ఎ.ఎన్) లో క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉంది. థాయ్‌లాండ్ మిగిలిన ఆగ్నేయాసియా దేశాలైన [[ఇండోనేషియా]], [[మలేషియా]],[[ఫిలిప్పైన్స్]],[[సింగపూర్]], [[బ్రూనై]],[[లావోస్]],[[కంబోడియా]],[[బర్మా]] మరియు [[వియత్నాం]] లతో సంబంధాలను అభివృద్ధి చేసుకుంటుంది. అలాగే సంవత్సర విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటూ ఉంది. ఆర్ధిక, వాణిజ్యం, బ్యాంకింగ్, రాజకీయ మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు సహాయసహకారాలు అందిస్తుంది. 2003లో ఎ.పి.సి.ఇ కి ఆతిథ్యం ఇచ్చింది. థాయ్‌లాండ్ గత ఉపముఖ్యమంత్రి డాక్టర్ సుపాచై పనిట్చ్‌పక్డి ప్రస్థుతం ఐఖ్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌గా ఐఖ్యరాజ్యసమితి
ట్రేడ్ ఎండ్ డెవలప్మెంట్ సమావేశంలో ( యు.ఎన్.సి.టి.ఎ.డి) పాల్గొన్నాడు. థాయ్‌లాండ్ 2005 లో ఈస్ట్ ఆసియా సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది.
 
గత కొన్నిసంవత్సరాలుగా అంతర్జాతీయ వేదిక మీద చురుకైన పాత్రపోషిస్తుంది. తూర్పు తైమూర్ [[ఇండోనేషియా]] నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత థాయ్‌లాండ్ మొదటిసారిగా ఐఖ్యరాజ్యసమితి శాంతి దళాలలో భాగస్వామ్యం వహించింది. థాయ్‌లాండ్ సైనిక బృందాలు ఇప్పుడు ఐఖ్యరాజ్యసమితి శాంతిసైన్యంలో నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భాగంగా థాయ్‌లాండ్ ప్రాంతీయ సంస్థలు, అమెరికా సంస్థలు, " ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్ " సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది.
ఆఫ్ఘనిస్థాన్ మరియు ఇరాక్ పునర్నిర్మాణ కార్యక్రమాలలో థాయ్‌లాండ్ బృందాలు పనిచేస్తున్నాయి. థాయ్‌లాండ్ [[చైనా]], [[ ఆస్ట్రేలియా]], [[బహ్రయిన్]],[[భారతదేశం]] అరియు [[అమెరికా]] లతో వ్యాపారసంబంధాలకు ప్రయత్నాలు చేస్తున్నది. తరువాత అధికథరలు కారణంగా తీవ్రవిమర్శలకులోనై థాయ్ పరిశ్రమలు తుడిచిపెట్టుకు పోయాయి. థాక్సిన్ విదేశీసహాయాన్ని నిరాకరించి నిధిసహాయ దేశాలతో కలిసి పొరుగున ఉన్న మెకాంగ్ భూభాగ అభివృద్ధి కొరకు కృషిచేసింది. థాక్సిన్ పొరుగున ఉన్న [[లావోస్]] వంటి వెనుకబడిన దేశాలకు థాయ్‌లాండ్ నాయకత్వం వహించాలని అభిలషిస్తూ వాటి అభివృద్ధి కొరకు వివిధ ప్రణాళికలను ప్రవేశపెట్టింది. థాక్సిన్ వివాదాస్పదంగా నిరంకుశ బర్మాప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. యు.ఎస్ నాయకత్వం వహించిన [[ఇరాక్]] యుద్ధానికి 423 మంది శక్తివంతమైన యోధులను పంపి సహకరించింది. 2004 సెప్టెంబర్ లో థాయ్ తన బృందాలను వెనుకకు తీసుకుంది. ఈ యుద్ధంలో థాయ్ ఇద్దరు యోధులు మరణించారు.
 
పంక్తి 151:
థాయ్‌లాండ్ సైనికదళ వ్యయం దాదాపు 100 కోట్లు అమెరికన్ డాలర్లు.
 
రాజ్యాంగబద్ధంగా సైన్యంలో పనిచేయడం ప్రతిఒక్క పౌరుని బాధ్యతగా భావించబడుతుంది. అయినప్పటికీ రిజర్వ్ దళ శిక్షణలో చేరనివారిలో 21సంవత్సరాలు నిండిన వారికి సవచ్చంధ సైనికసేవలో కాని లేక ఆపత్జాల సైనిక బృందాలలో కాని పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. శిక్షణాకాలానికి అభ్యర్ధులకు కాలనిర్ణయానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. 6-24 మాసాల శిక్షణ వారి విద్యార్హత మరియు వారి రిజర్వ్ శిక్షణ లేక సైనికదినంలో (సాధారణంగా ఏప్రెల్ 1 వ తారీఖు ) వారి స్వచ్చంద సేవ మీద ఆధారపడి ఉంటుంది. గుర్తింపు పొందిన కళాశాల 1 విద్య పూర్తిచేసిన వారికి సంవత్సర ఆపత్కాల సైనిక శిక్షణకు కాని వారి జిల్లాలోని సైనిక కాత్యాలయంలో 6 మాసాల పనిచేయడానికి అర్హులౌతారు. 3 సంవత్సరాల పట్టవిద్య పూర్తిచేసిన వారు 1 సంవత్సరం ఆపత్కాల సైనికసేవ లేక వారి వారి జిల్లాలలో ఆరుమాసాల సేవకు అర్హులౌతారు. అంటే 1 సంవత్సర విద్య పూర్తిచేసినవారికి ఒక సంవత్సర శిక్షణార్హత ఉంటుంది.
2 సంవత్సర విద్య పూర్తిచేసినవారికి ఒక సంవత్సర శిక్షణార్హత ఉంటుంది , సంవత్సర విద్య పూర్తిచేసినవారు పూర్తిశిక్షణకు అర్హులౌతారు. " ది రాయల్ ఆర్ముడ్ ఫోర్స్ " దినం జనవరి 18 జరుపుకుంటున్నారు. 1593 లో బర్మారాజకుమారునితో రాజనరేసుయన్ యుద్ధంచేసి విజయం సాధించిన రోజును సైనికదినంగా జరుపుకుంటున్నారు.
 
== భౌగోళికం ==
[[File:Nan z doi phuka 2006 1003.jpg|thumb|left|View of the [[Luang Prabang Range]] straddling the Thai/Lao border in northern Thailand.]]
థాయ్‌లాండ్ వైశాల్యం 5,13,120 చదరపు కిలోమీటర్లు (1,98,120 చదరపు మైళ్ళు. వైశాల్యారంగా థాయ్‌లాండ్ ప్రపంచంలో 51వ స్థానంలో ఉంది. ఇది యోమన్ కంటే స్వల్పంగా చిన్నది అలాగే స్పెయిన్ కంటే స్వల్పంగా పెద్దది. థాయ్‌లాండ్ పలు విభిన్న భూభాగాలకు పుట్టిల్లు. థాయ్ ఉన్నతభూములు ( హైలాండ్స్) అనిపిలువబడే పర్వతభూభాగం థాయ్‌లాండ్ ఉత్తరదిశలో ఉన్నాయి. తనాన్ తాంగ్ చై పర్వతావళిలో సముద్రమట్టానికి 2,565 మీటర్ల (8,415 అడుగులు ) ఎత్తులో ఉన్న ఇంతానాన్ శిఖరం దేశంలో ఎత్తైన భూభాగంగా భావించబడుతుంది. ఈశాన్యంలో సముద్రతీరం మరియు మెకాంగ్ నది సరిహద్దుల మద్య " ఖోరత్ పీ,ఠభూమి " ఉంది. దేశం మద్యభాగంలో ప్రధానంగా థాయ్‌లాండ్ అఖాతం (గల్ఫ్) వద్ద సముద్రసంగమం చేస్తున్న చయో ఫర్యా నదీ మైదానం ఆధిఖ్యత కలిగి ఉంది.
[[Image:July 2011 Thailand Flooding.jpg|thumb|Satellite image of flooding in Thailand in October 2011.]]
దక్షిణ థాయ్‌లాండ్ భుభాగంలో సన్నని క్రా ఇస్త్మస్ [[మలేషియా ]] వరకు విస్తరించి ఉన్నది. థాయ్‌లాండ్ జసంఖ్య, ప్రధాన వనరులు, సహజసిద్ధమైన భూభాగం, మరియు సాంఘిక అరియు ఆర్ధిక స్థితిగతుల భేదంకలిగిన ఆరుభాగాలుగా రాజకీయంగా విభజించబడి ఉంది. థాయ్‌లాండ్ భౌతిక ఆకర్షణీయతకు ఈ వైవిధ్యాలు విపరీతంగా భాగస్వామ్యం వహిస్తున్నాయి.
 
చయో ఫర్యా మరియు మెకాంగ్ నదులు గ్రామీణ థాయ్‌లాండ్ స్థిరమైన వనరుగా భావించబడుతుంది. ఈ రెండు నదులు మరియు ఉపనదులు థాయ్‌లాండ్ వ్యవసాయ ఉత్పత్తికి ఆధారభూతంగా ఉదహరించబడుతున్నాయి. 3,20,000 కిలోమీటర్ల (1,24,000 మైళ్ళ ) పొడవైన థాయ్‌లాండ్ అఖాత సముద్రతీరాలో చాయో ఫర్యా, మెకాంగ్, బాంగ్ పకాంగ్ మరియు తాపి నదులు సముద్రసంగమం చేస్తున్నాయి. ఇది థాయ్‌లాండ్ పర్యాటకరంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. థాయ్ అఖాతం లోతు తక్కువైన స్వచ్చమైన జలాలు పర్యాట్కులను అత్యధికంగా ఆకర్షిస్తున్నాయి.
ప్రధానంగా దక్షిణ తీరంలో ఉన్న క్రా ఇస్త్మస్ ప్రాతం ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. థాయ్‌లాండ్ అఖాతం పారిశ్రామికంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. థాయ్‌లాండ్ ప్రధాన నౌకాశ్రయం అయిన సతాహిప్ పోర్ట్ బాంకాక్ ఇన్‌లాండ్ సీపోర్ట్ ప్రవేశంగా ఉంది. అత్యధికంగా పర్యాటక ఆకర్షణ కలిగిన విలాసవంతమైన రిసార్ట్లు ఉన్న అండమాన్ సముద్రతీర ప్ర్రంతం ఆసియాలో పసిద్ధి చెందాయి. ఫూకెట్, క్రబీ, రనాంగ్, ఫంగ్ న్గా మరియు ట్రాంగ్ మరియు సుందరమైన థాయ్‌లాండ్ ద్వీపాలు అన్నీ అండమాన్ సముద్రతీరంలో ఉన్నాయి. 2004లో సంభవించిన సునామీ సంఘటనలను అధిగమించి ఆసియా ఉన్నత వర్గానికి చెందిన ప్రజలకు ఇవి జలక్రీడా మైదానాలుగా ఉన్నాయి. సూయజ్ మరియు పనామా కాలువల మాదిరిగా " తాయ్ కెనాల్ " నిర్మించి రవాణా సౌకర్యాన్ని ఏర్పరచాలన్న వ్యూహాత్మకంగా ప్రణాళికలు సాగుతున్నాయి. థాయ్ రాజకీయనాయకులు సహితం ఈ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కాలువ నిర్మాణంతో [[సింగపూర్]] నౌకాశ్రయ చార్జీలు తగ్గడం అలాగే చైనా మరియు భారత్‌లతో వాణిజ్యసంభంధాలు మెరుగుపడగలవని యోచిస్తున్నారు. మలాకా సంధిలోని సముద్రచోరులనుండి రక్షణ లభించడం రవాణా సమయం తగ్గడం వంటి ప్రయోజనాలే కాక ఆసియాలో థాయ్‌లాండ్ ప్రధాన నౌకాకేంద్రంగా మారే అవకాశాల దృష్ట్యా ఈ ప్రభుత్వ ప్రణాళికు వ్యాపారవర్గాల మద్దతు కూడా లభిస్తుంది. థాయ్‌లాండ్ దక్షిణతీర నౌకాశ్రయాలు దేశ ఆర్ధికరంగ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది. ప్రధానంగా పర్యాటకరంగం ద్వారా లభిస్తున్న దేశాదాయం ఇప్పుడు సేవారంగానికి విస్తరించడం ద్వారా థాయ్‌లాండ్ ఆసియా సేవాకేంద్రగా మారనున్నది. ఇంజనీరింగ్ ప్రాధాన్యత కలిగిన ఈ కాలువ నిర్మాణానికి షుమారుగా 20-30 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయం కాగలదని భావిస్తున్నారు. ఉష్ణమండల ఉష్ణోగ్రతలు కలిగిన థాయ్‌లాండ్ వాతావరణం మీద వర్షాల ప్రభావంకూడా అధికంగానే ఉంటుంది. వర్షాలతో కూడిన, వెచ్చని మరియు చల్లని సౌత్-వెస్ట్ వర్షపాతం మే మాసం మద్య నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. దక్షిణ ఇస్త్మస్ వేడి మరియు తడితో కూడిన మిశ్రిత వాతావరణం కలిగి ఉంటుంది.
 
== విద్య ==
పంక్తి 171:
2001 నాటికి విద్యావిధానం అత్యున్నత స్థాయికి చేరుకుంది. వర్తమాన విద్యార్ధులలో అధికులు కంప్యూటర్ సంబంధిత విద్యకు ముఖ్యత్వం ఇస్తున్నారు. ఆంగ్లభాషా సామర్ధ్యంలో థాయ్‌లాండ్ ఆసియాలో 54వ స్థానంలో ఉంది.
 
2010 నుండి 2011 జనవరి వరకు దేశమంతా ఐ.క్యూ పరీక్షలు నిర్వహించబడ్డాయి. సరాసరి ఐక్యూ 98.59 గా నిర్ణయించబడింది. ఇది ముపటి అధ్యయనాలకంటే అధికం. దక్షిణ భూభాగం ఐక్యూ శక్తి 88.7 గా నిర్ణయించబడింది. నాంతబురీ భూభాగంలో అత్యధికంగా ఐక్యూ శక్తి 108.91 గా నిర్ణయించబడింది. థాయ్ ఆరోగ్యశాఖ ఐడోడిన్ లోపం ఇందుకు కారణమని భావించి పశిమదేశాల మాదిరిగా అయోడిన్ చేర్చబడిన ఉప్పును ప్రజలకు అందించాలని సూచిస్తుంది. 2013లో విధ్యాశాఖ 27,231 పాఠశాలలకు అంతర్జాల వసతి కల్పించబడుతుందని ప్రకటించింది.
 
== సైన్స్ మరియు టెక్నాలజీ ==
థాయ్‌లాండ్‌లో సైన్ గురించిన పరిశోధనలు మరియు ఆర్ధిక సంభంధిత బాధ్యతను " ది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ " విభాగం వహిస్తుంది. భౌతిక, రసాయనిక, మెటీరియల్ సైంసెస్ సంబంధిత విషయాలకు " ది సిన్‌క్రోట్రాన్ లైట్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ (ఎస్.ఎ.ఆర్)" సంస్థ సహకారం అందిస్తున్నది. ఇది " సురానరీ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ " (ఎస్.యు.టి) లో అంతర్భాగంగా ఉంది. ఈ ఇస్టిట్యూటుకు " మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎం.ఒ.ఎస్.టి) ఆర్ధికసాయం అందిస్తుంది. దక్షిణాసియాలో అత్యధిక ఆర్ధికసాయంతో నడుస్తున్న ఇంస్టిట్యూట్‌గా భావించబడుతుంది. ఎస్.ఒ.ఆర్.టి.ఇ.సి సింక్రోట్రాన్ ముందుగా జపాన్‌లో ఆరంభించి తరువాత థాయ్‌లాండుకు తరలించబడింది.
=== అంతర్జాలం ===
థాయ్‌లాండ్‌ ప్రభుత్వం 23,000 వై.వై అంతర్జాల అనుసంధాన కేంద్రాలు ప్రజల కొరకు అందిస్తుంది. థాయ్‌లాండ్‌లో అంతర్జాలం 10గిగాబైట్ల హైస్పీడ్ ఫైబర్-ఆప్టిక్ లైన్లు ఉన్నాయి. ఐ.ఎస్.పి మరియు కె.ఐ.ఆర్.జెడ్ సంస్థలు నివాసగృహాలకు అంతర్జాల వసతి అందిస్తుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వం అంతర్జాలాన్ని సెంసార్ చేసి కొన్ని సైట్స్‌ను ప్రజలకు చేరకుండా అడ్డుకుంటుంది. రాయల్ థాయ్ పోలీస్, ది కమ్యూనికేషన్ అథారిటీ, మరియు సమాచార మంత్రిత్వశాఖ సెంసార్ బాధ్యత వహిస్తుంది.
=== శక్తి ===
థాయ్‌లాండులో అణుధార్మిక విద్తుత్ సంస్థలు లేవు. అయినప్పటికీ 2026లో ఆరంభించడానికి అవకాశం ఉంది. ప్రస్థుతం 80% విద్యుత్తు ఫాసిల్ ఫ్యూయల్ నుండి లభిస్తుంది.
 
== ఆర్ధికరంగం ==
[[File:Aerial view of Lumphini Park.jpg|thumb|[[Bangkok]], the largest city, business and industrial centre of the country.]]
[[File:Rice fields Chiang Mai.jpg|thumb|Thailand is the [[Rice production in Thailand|largest rice exporter in the world]].]]
థాయ్‌లాండ్ సరికొత్తగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్న దేశాలలో ఒకటి. 1985-1996 మద్య అత్యధికసాయిలో సాధించిన అభివృద్ధి తరువాత థాయ్‌లాండ్ ద్రవ్యం సంవత్సరానికి 12.4% అభివృద్ధి రేటును నమోదు చేస్తుంది. 1997లో దేశం ఎదుర్కొన్న ఆర్ధికసంక్షోభం కారణంగా దేశ ఆర్ధిక అభివృద్ధి 1.9% పతనం అయింది. సంక్షోభాన్ని నివారించలేని అసమర్ధత కారణంగా " చవాలిత్ యోంగ్‌చైయుధ్ రాజ్యాంగం మంత్రిమండలితో సహా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఎదురైంది. 1978 నాటికి అమెరికన్ డాలరుకు బదులుగా 25 బాహ్త్‌(థాయ్ ద్రవ్యం) 1997 నాటికి 56 బాహ్త్‌ల స్థాయికి పతనం అయింది. 1998 నాటికి మరో 10.8% పతనం అయింది. ఈ పతనం ఆసియన్ ఆర్ధిక సంక్షోభం మీద మరింత ప్రభావం చూపింది. 1999 లో థాయ్‌లాండ్ ఆర్ధికవ్యవస్థ కోలొకోవడం ప్రారంభం అయింది. అత్యధికంగా పెరిగిన ఎగుమతులే ఇందుకు ప్రధానకారణం. 2001లో సరళీకృతం చేయబడిన ప్రపంచ ఆర్ధికవ్యవస్థ కారణంగా థాయ్‌లండ్ 2.2% ఆర్ధికాభివృద్ధి సాధ్యమైంది. తురువాత కాలంలో థాయ్‌లాండ్ ఆసియా ఆర్ధికవ్యవస్థలో క్రమాభివృద్ధి సాధించింది. బలహీనమైన బాహ్త్ ఎగుమతులను ప్రోత్సహించిఅడమేకాక భారి ప్రణాళికలు మరియు ప్రధానమంత్రి అందిచిన ప్రోత్సాహం దేశాంతర్గత కొనుగోలుశక్తి అధికం అయింది. 2002,2003 మరియు 2004 సంవత్సరానికి 5.7% ఆర్ధికాభివృద్ధి సాధ్యమైంది.2005,2006 మరియు 2007 సంవత్సర అభివృద్ధి 4-5% అభివృద్ధి కొనసాగింది. 2008 నాటికి అమెరికన్ డాలర్ బలహీనపడడం మరియు థాయ్‌లాండ్ ద్రవ్యం బలపడడం కొనసాగిన కారణంగా 2008 నాటికి అమెరికన్ డాలర్‌కు ఎదురుగా బాహ్త్ 33 స్థాయికి అభివృద్ధి కొనసాగింది.
 
థాయ్‌లాండ్ సంవత్సరానికి సేవలరూపంలో అందిస్తున్నది మరియు వస్తురూపంలో ఎగుమతి చేస్తున్న వాణిజ్యం విలువ 105 అమెరికన్ డాలర్లు. ఎగుమతులలో ప్రధానమైనవి థాయ్ బియ్యం, వస్త్రాలు, పూలు, మత్య ఉత్పత్తులు,రబ్బర్, ఆభరణాలు, కార్లు, కంప్యూటర్లు మరియు విద్యుత్తు పరికరాలు మొదలైనవి. బియ్యం ఎగుమతులలో థాయ్‌లాండ్ మొదటి స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ సంవత్సరానికి 6.5 మిలియన్ టన్నులు బియ్యం ఎగుమతి చేస్తున్నది. దేశంలో ప్రధాన పంట వరి. 27.25% సారవంతమైన భూములతో థాయ్‌లాండ్ పంటభూములు అధికంగా కలిగిన దేశాలలో మహా మెకాంగ్ భూభాగంలో ప్రధమ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ సాగుభూములలో 55% వరి పంటకు ఉపయోగించబడుతుంది.
 
విజయవంతంగా నడుస్తున్న విద్యుత్తు ఉపయోగ పరికరాలు, విడిభాగాలు, కంప్యూటర్లు విడిభాగాలు మరియు కార్ల సంబంధిత ఉత్పత్తులు దేశాదాయానికి ఉపకరిస్తుండగా. థాయ్‌లాండ్ ఆదాయానికి పర్యాట్కరగం నుండి 6% ఆదాయం లభిస్తుంది. అలాగే పేదరికం మరియు సంస్కృతిక పరిస్థితులు మిళితమైన కారణంగా చట్టవిరుద్దమైన కార్యకలాపాలతో సంపాదించిన న్యాయవిరుద్ధమై ద్రవ్యంతో 2003 లో థాయ్‌లాండ్ జి.డి.పి 3% అభివృద్ధి చెందింది. ఇలా చేరిన ద్రవ్యం విలువ షుమారు 3 బిలియన్ల (300 కోట్లు) అమెరికన్ డాలర్లని అంచనా. 1993 లో
చట్టవిరుద్దమైన కార్యకలాపాలతో సంపాదించిన ద్రవ్యంతో థాయ్‌లాండ్ జి.డి.పి 2.7% పెరిగిందని చులాలాంకోన్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పర్యాటక రంగం నుండి
లభిస్తున్న ఆదాయంలో 10% చట్టవిరోధ కార్యకలాపాలద్వారా లభిస్తుందని అంచనా. థాయ్‌లాండ్ జి.డి.పి విలువ 602 బిలియన్ల ( 60200 కోట్లు ) అమెరికన్ డాలర్లు. థాయ్‌లాండ్ ఆర్ధికశక్తి దక్షిణాసియాలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రధమ స్థానంలో [[ఇండోనేషియా ]] ఉంది. థాయ్‌లాండ్ తలసరి ఆదాయం దక్షిణాసియా దేశాలలో 4వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలలో [[సింగపూర్]], [[బ్రూనై]] మరియు [[మలేషియా]] ఉన్నాయి. పొరుగున ఉన్న లావోస్, బర్మా మరియు కంభోడియా దేశాలకు థాయ్‌లాండ్ ఆర్ధికరంగం మూలాధారంగా ఉంది. 1997-1998 ఆసియా ఆర్ధిక సంక్షోభానికి అనేక ఇతరకారణలాతో ఎగుమతులు ప్రధాన కారణమైయ్యాయి. ప్రపంచంలో ఆటోమోటివ్ మరియు విద్యుత్తు ఉపయోగ పరికరాలు ఏగుమతులలో థాయ్‌లాండ్ ప్రధమ స్థానంలో ఉంది. 1997 మరియు 2010 మద్యకాలంలోంపరిశ్రమల సమ్మిళితం మరియు సంపద విక్రయాల విలువ 81 మిలియన్ల (8,100 కోట్లు) అమెరికండాలర్లని థాయ్ ఫార్ంస్ ప్రకటించింది. 2010 లో మాత్రమే ఈ విక్రయాలు సరికొత్త రికార్డ్ సృష్టిస్తూ 12 మిలియన్ల (1,200 కోట్లు) అమెరికండాలర్లని అంచనా. 2011 లో జరిగిన పి.టి.టి కెమికల్స్ పి.సి.ల్ కపెనీ సమ్మిళితం అతి పెద్ద విక్రయంగా భావించబడుతుంది.ఈ విక్రయం విలువ 3.8 బిలియన్ల (380 కోట్లు).
 
థాయ్‌లాండ్ శ్రామికులలో 49% వ్యవవసాయక్షేత్రాలలో పనిచేస్తున్నారు. అయినప్పటికీ 1980లో వ్యవసాయక్షేత్రాలలో 70% శ్రామికులు పనిచేసేవారు. పారిశ్రామిక సంస్థలకు శ్రామికులు అధికంగా
తరలిపోవడంతో వ్యవసాయరంగం శ్రామికుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. 1962-1983 మద్యకాలంలో వ్యవసాయరంగం 4.1% అభివృద్ధిని సాధించింది. తరువాత సంవత్సరాలలో సరాసరి 2.2% అభివృద్ధి కొనసాగింది. వస్తువుల ఎగుమతి మరియు సేవారంగంలో జి.డి.పి అభివృద్ధి కొనసాగుతున్న తరుణంలో వ్యవసాయరంగ జి.డి.పి మాత్రం తగ్గుముఖం పట్టింది. 2011లో థాయ్‌లాండ్ నిరుద్యోగం 0.4% తో ఆరంభం అయింది. సమీపకాలంలో అనుకోకుండా తలెత్తిన తిరుగుబాటు మరియు సైకప్రపాలన ప్రభావం వలన దేశంలో అస్థిరత ఏర్పడినప్పటికీ జి.డి.పి అభివృద్ధి మాత్రం 4-5% వద్ద నిలదొక్కుకుంది. సివిలియన్ పాలనలో 5-7% ఉన్న జి.డి.పి రాజకీయ అస్థిరత వలన కొంత క్షీణించింది.
 
థాయ్‌లాండ్ సాధారణంగా మెట్రిక్ విధానం అనుసరిస్తున్నా భూ పరిమాణ కొలతలకు అంగుళాలు, అడుగుల వంటి సంప్రదాయక విధానాలను అనుసరిస్తుంది. కొన్ని సమయాలలో వడ్రంగి పనికి ఉపకరించే కొయ్యను కొలడానికి కూడా ఈ పద్దతి అనుసరించబడుతుంది. విద్యాభోధనకు బి.ఇ( బౌద్ధ శకం) విధానంలో కాలగణన జరుగుతున్నప్పటికీ పౌరసేవలకు, ప్రభుత్వ ఒప్పందాలకు మరియు వార్తాపత్రికలకు, బ్యాంకింగ్, పరిశ్రమలు మరియు వాణిజ్య సంభంధిత వస్షయాలకు మాత్రం పాశ్చాత్య విధానంలో క్రీస్తుశకం కాలగణను అనుసరిస్తుంది.
పంక్తి 201:
=== భాష ===
{{Historical populations
|title = Historical populations
|type = Thailand
|align = right
|footnote = Source: [http://popcensus.nso.go.th/table_stat.php?t=t1&yr=2543] [http://web.nso.go.th/eng/en/stat/poph/popt1.htm National Statistical Office of Thailand]
|1910 |8131247
|1919 |9207355
పంక్తి 219:
[[File:Thailand ethnic map.svg|thumb|Ethnic map of Thailand|left|180px]]
థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్ - కడై. ఇది లావోస్, బర్మాలోని షాన్ భాషకు సమీపంగ ఉంటుంది. దక్షిణ చైనా సరిహద్దులకు సమీపంగా ఉన్న హన్నియన్ యోమన్ నగరాలలో ఉపభాషలు కొన్ని మాట్లాడబడుతున్నాయి. థాయ్ - కడై భాషా విధ్యబోధనకు , ప్రభుత్వనిర్వహణకు ఉపకరిస్తూ దేశమంతటా వాడుకలో ఉంది. మద్య థాయ్‌లాండ్‌లో వాడుకలో ఉన్న భాష ప్రామాణిక భాషగా భావించబడుతుంది. ఇది థాయ్ అక్షరమాల, అబుగిడా లిపి ( ఖేమర్ లిపి ప్రభావితంగా ఏర్పడినది) గా వాడబడుతుంది. పలు ఇతర భాషలు వాడుకలో ఉన్నాయి.
దక్షిణ థాయ్ భాష దక్షిణ థాయ్‌లాండ్‌లో మాట్లాడబడుతుంది. ఉత్తర భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. స్వతంత్రరాజ్యమైన లానథాయ్ భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. థాయ్‌లాండ్ పలు అల్పసంఖ్యాక భాషాకు కూడా ఆతిథ్యం ఇస్తుంది. వీటిలో పెద్దది లావో యాసతో కూడిన ఇసాన్ ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. ఇది ఒక్కోసారి థాయ్ భాషగా పరిగణించబడుతుంది. ఈ భాషను మాట్లాడే ప్రాంతం ఒకప్పుడు లావోస్ రాజ్యంలో(లన్ క్సనంగ్ సాంరాజ్యం) ఉంటూ వచ్చింది. సుదూర దక్షిణ ప్రాంతంలో [[మలేషియా]] దేశ ప్రధాన భాషైన మలాయ్ యాసతో కూడిన యావీ భాష మాట్లాడబడుతుంది. అత్యధికంగా ఉన్న చైనీయులు వైవిధ్యమైన చైనా భాషలు మాట్లాడబడుతున్నాయి. టియోచ్యూ వీటిలో ప్రధానమైనది.
 
మాన్-ఖేమర్ కుటుంబం చెందిన మాన్, వియట్, మ్లబ్రి మరియు ఆస్ట్రోనేషియన్ కుటుంబానికి చెందిన ఒరంగ్ అస్లి , చాం మరియు మోకెన్. సినో - టిబెటన్ కుటుంబానికి చెందిన లావా, అఖాన్ మరియు ఇతర థాయ్ భాషలైన నియా, ఫూథాయ్ మరియు సియాక్ వంటి పలు గిరిజన భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. హమాంగ్ ప్రజలు మధ్య హమాంగ్ భాష వాడుకలో ఉంది. దీనిని భాషాకుటుంబానికి చెందిన ప్రజలకు వాడుకలో ఉన్న భాషగా గౌరవిస్తున్నారు. పాఠశాలలలో ఆంగ్లభాషను నిర్బంధం చేస్తున్నప్పటికీ ఆంగ్లభాషను ధారాళంగా మాట్లాడుతున్న ప్రజలసంఖ్య మాత్రం తక్కువగా ఉన్నారు. ప్రత్యేకంగా నగరానికి వెలుపల నివసిస్తున్న ప్రజలు మధ్య ఆగ్లభాష వాడకం తక్కువగా ఉన్నది.
 
=== మతం ===
థాయ్‌లాండ్‌లో సాధారణంగా తరవాడ బుద్ధమతం ఆచరణలో ఉంది. ప్రపంచంలో తరవాడ బుద్ధిజం ఉన్నతమైన బుద్ధమతంగా భావించబడుతుంది. చివరి గణాంకాలను అనుసరించి బుద్ధమతావలంబీకులలో 94.6% మంది తరవాడ బుద్ధిజాన్ని అనుసరిస్తున్నారని భావిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న ముస్లిం మతాన్ని 4.6% ప్రజలు ఆచరిస్తున్నారు.
థాయ్‌లాండ్‌ దక్షిణ భూభాగాలలో పట్టాని, యాల, నరాథివాట్ మరియు సంగ్కాల చుంఫాన్‌లో కొంతభాగం ముస్లిములు అధికంగా ఉన్నారు. జనసంఖ్యలో క్రైస్తవ మతావలంబీకులు 07% ఉన్నారు. దేశంలోని నగరాలలో స్వల్పసంఖ్యలో సిక్కు మతావలంబీకులు మరియు హిందూ మతావలంబీకులు ఉన్నారు. దేశంలో 17వ శతాబ్ధనికి చెందిన ప్రజలలో కొందరు జ్యూయిష్ మతావలంబీకులు కూడా ఉన్నారు.
 
== సంస్కృతి ==
పంక్తి 234:
థాయ్ ప్రజల నిర్లక్ష్యానికి గురైన పలు ప్రత్యేక ఆదివాసి ప్రజలలో కొంతమంది బర్మా, లావోస్, కంబోడియా మరియు మలేషియాలలో ప్రవేశించి వారితో కలిసిపోయారు. మిగిలిన వారు వారి సంప్రదాయాలకు ప్రాంతీయ సంస్కృతో సంప్రదాయాలు మరియు అంతర్జాతీయ సంప్రదాయాలను మిశ్రితంచేసి సరికొత్త వరవడిని సృష్టించుకున్నారు. చైనా నుండి వచ్చి చేరిన ప్రజలు కూడా థాయ్ ప్రజలలో గుర్తించతగినంతగా ఉన్నారు. వీరు ప్రత్యేకంగా బ్యాంకాక్ మరియు దాని పరిసరప్రాంతాలలో ఉన్నారు. వారు తాయ్ ప్రజలతో మిశితం అవడం వలన వారు ఆర్ధిక మరియు రాజకీయ రంగాలలో ప్రత్యేక స్థానం వహిస్తున్నారు. వారికి ఉన్న అంతర్జాతీయ కుటుంబ సంప్రదాయ సంబంధాలతో వారు వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుని వాణిజ్యరంగంలో విజయం సాధించారు. ఖోన్ షో థాయ్‌లాండ్ కళాప్రదర్శనలలో ప్రాబల్యం సంతరించుకుంది.
[[File:Khon Thammasat 20090306 01.jpg|thumb|right|[[Khon]] Show is the most stylised form of Thai performance.]]
థాయ్ యువత ఒకరిని ఒకరు కలుసుకున్న సమయాలలో వాయ్ అని ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకుంటారు. వాయ్ అంటే రెండుచేతులు కలిపి నమస్కరించి తల వంచి చేతి వేళ్ళను తాకుతూ తమ గౌరవాన్ని తెలియజేస్తూ మాటలలో " సవాస్దీ ఖ్రాప్ " అని పురుషులకు, " సవాస్దీ కా " అని స్త్రీలకు పలుకుతారు. వయసులో పెద్దవారు కూడా అలాగే ప్రతిస్పందిస్తారు.
అధికారులు, పెద్దవారు, పూజ్యులు ప్రత్యేకంగా ఇలా గౌరవాన్ని అందుకుంటారు. భారతదేశం మరియు నేపాల్ దేశాలలో నమస్కారం పోలినదే వాయ్. ఫుట్ బాల్ క్రీడ థాయ్ సంప్రదాయక క్రీడ అయిన మాయ్ క్రీడను అధిగమించింది. సమకాలీన థాయ్‌లాండ్ యువత ఈ క్రీడలను చూడడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. థాయ్ ప్రజలు అధికంగా ఆదరిస్తున్న ఇతర క్రీడలలో గాలిపటాలు ఎగురవేయడానికి ప్రత్యేకస్థానం ఉంది.
 
థాయ్ ఆహార సంస్కృతిలో ప్రధానంగా ఐదు రుచులు ప్రాధాన్యత వహిస్తాయి. అవి వరుసగా తీపి, ఖారం, వగరు, చేదు మరియు ఉప్పు. థాయ్ వంటలలో తెల్లగడ్డలు, మిరపకాయలు, నిమ్మకాయ రసం, నిమ్మగడ్డి మరియు ఫిష్ సాస్ ప్రధానంగా చోటుచేసుకుంటాయి. థాయ్ ప్రధాన ఆహారం బియ్యం. ప్రత్యేకంగా జాస్మిన్ బియ్యం ( దీనిని హాం మాలి రైస్ అని కూడా అంటారు) దాదాపు తాయ్ ఆహారలు అన్నింటికి చేర్చుకుంటారు. బియ్యం ఎగుమతిలలో అంతర్జాతీయంగా ప్రధమస్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌లో ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి సరాసరి 100 కిలోల బియ్యం తన ఆహారంలో ఉపయోస్తున్నాడు. థాయ్‌లాండ్ నుండి సేకరించిన 5,000 వరివంగడాలు ఫిలిప్పైన్‌లో ఉన్న " రైస్ జెనె బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రైస్ రీసర్చ్ ఇంస్టిట్యూట్ "(ఐ.ఆర్.ఆర్.ఐ) సంరక్షించబడుతున్నాయి. థాయ్‌లాండ్ రాజు ఐ.ఆర్.ఆర్.ఐ అధికారిక పోషకుడుగా ఉంటాడు.
 
అనేక ఆసియన్ సంస్కృతుల మాదిరిగా థాయ్‌లాండ్ మతసంప్రదాయాలు పూర్వీకులపట్ల గౌరవం ప్రదర్శినడానికి ప్రధాన్యత ఇస్తాయి. వంశానుగతంగా వచ్చిన సంస్కృతి వలన సేవాభావం మరియు ఔదార్యం థాయ్ సంస్కృతిలో భాగమై ఉంది. పెద్దరికం అన్నది థాయ్ సంప్రదాయంలో అత్యంత ప్రధాన్యత కలిగి ఉంది. పండుగలు, సంప్రదాయ వేడుకలు మరియు కుటుంబ నిర్ణయాలు చేయడంలో పెద్దలకు సముచిత స్థానం ఉంటుంది. సంతానంలో పెద్దవారు చిన్నవారి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.
థాయ్‌లాండ్ సంస్కృతిలో కాలితో మరొకరి తలను తాకడం నిషేధం. థాయ్‌లాండ్ ప్రజలు కాళ్ళు శరీరంలో హీనమైన భాగంగా భావించడమే ఇందుకు కారణం. థాయ్ ప్రజలు గతకొన్ని సనత్సరాలుగా పలుభాషా సాహిత్యాన్ని చదివి ఆనందిస్తున్నారు. సమీపకాలంగా దేశంలో పలుభాషా సాహిత్యం అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం. దేశంలో ఆంగ్ల, థాయ్ మరియు చైనా పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలను ఆకర్షించడానికి పలు థాయ్ పత్రికలు కూడా ఆంగ్లశీర్షికలను ప్రచురిస్తుంటాయి. థాయ్‌లాండ్ వాణిజ్యంలో అధికంగా ఆంగ్లభాషను ఉపయోగిస్తారు. అలగే కొంత వరకు ఇతర భాషలను కూడా మాట్లాడుతుంటారు.
 
థాయ్‌లాండ్ దేశంలో వార్తా పత్రికల ప్రచురణ దక్షిణాసియాలోనే ప్రత్యేకత కలిగి ఉంది. 2013 వ సంవత్సరంలో దేశంలో ఒకరోజుకు 13 మిలియన్ల దినపత్రికలు విక్రయించబడ్డాయి. బ్యాంకాక్ లోని అప్ కౌంటీ ప్రాతం మీడియాకు ప్రధానంగా స్థావరంగా వర్ధిల్లుతుంది. ఉదాహరణగా 2003-2004 థాయ్‌లాండ్స్ పబ్లిక్ రిలేషంస్ డిపార్ట్మెంట్ నివేదికలను అనుసరించి థాయ్‌లాండ్ ఈశాన్యభాగంలో 116 వార్తాపత్రికలు , రేడియో, టి.వి మరియు కేబుల్ సంస్థలు పనిచేస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు