దశావతారం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = దశావతారం|
year = 2008|
image = Dasavataram_poster.jpg|
starring = [[కమల్ హాసన్]],<br>[[ఆసిన్]],<br>[[జయప్రద]],<br>[[నెపోలియన్]]|
story = [[కమల్ హాసన్]]|
screenplay = [[కమలహాసన్]]|
director = [[కే.ఎస్.రవికుమార్]] |
dialogues = [[కమల్ హాసన్]]|
lyrics = |
producer = [[కే.రవిచంద్రన్]]|
distributor = |
release_date = [[జూన్, 13]],[[2008]]|
runtime = |
language = [[తమిళం]] (తెలుగు అనువాదం) |
list_link = తెలుగు_సినిమాలు_2008|
music = [[హిమేష్ రేషమ్మియా]]|
playback_singer = |
choreography = |
cinematography = [[రవివర్మన్]]|
editing = |
art = [[తోట తరణి]] |
production_company = [[ఆస్కార్ ఫిలిమ్స్ (ప్రై) లిమిటెడ్]] |
awards = |
budget = |
imdb_id = 0479651
}}
దశావతారం పేరు సూచించినట్లే ఈ సినిమాలో [[కమల్ హాసన్]] '''పది''' రకాల విభిన్నమయిన వేషాలు ధరించి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చి సినిమాలో ప్రధాన భూమిక పోషించాడు.
 
==సాంకేతిక నిపుణులు==
పంక్తి 52:
#వెన్సెంట్ పుణ్యకొటి (సామాజిక కార్యకర్త)
#కలీఫుల్లా ఖాన్ (ముస్లిం యువకుడు)
#అవతార్ సింగ్ (గాయకుడు)
*[[ఆసిన్]]
ద్విపాత్రాభినయం<ref name=dasavathaaram />
పంక్తి 64:
ఇక్కడ గోవింద్ అనే జీవశాస్త్రవేత్త మానవాళిని చిటికెలో అంతం చేసే [[సింథటిక్]] బయో [[వైరస్]] కనిపెడతాడు. అది కాస్తా ఉగ్రవాదుల చేతిలో పడుతోందని తెలుసుకొని, దాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఓ చిన్న పెట్టె లో పెట్టి [[ఎఫ్.బి.ఐ.]] కీ చెప్పే తరుణంలో '''ఫ్లెచర్''' ( కమల హాసన్ 4 ) అనే టెర్రరిస్ట్ దృష్టిలో పడతాడు. తన స్నేహితుడింట్లో తలదాచు కుందామనుకునే సరికి ఫ్లెచర్ గోవింద్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ అతని స్నేహితుడూ, స్నేహితుడి జపనీస్ భార్యా ఫ్లెచర్ చేతిలో మరణిస్తారు. ఎలాగో అక్కడనుండి తప్పించుకొని బయట పడినా ఓ నాటకీయ పరిణామంలో ఆ బయో వైరస్ బాక్స్ కాస్తా ఇండియాలో చిదంబరం అనే ఊరికి పార్సిల్ అయ్యిందని తెలుసుకొని అందరికళ్ళూ కప్పి, విమానం కార్గోలో దూరి, [[భారతదేశం]] వెళిపోతాడు. గోవిందు వివరాలు తెలుసుకొన్న ఫ్లెచర్ కూడా తన స్నేహితురాలి ( [[మల్లికా షరావత్]] ) సహాయంతో ఇండియా బయల్దేరుతాడు. తన స్నేహితుడి జపనీస్ భార్య మరణం తెలుసుకొన్న ఆమె '''అన్న''' కరాటే ఫైటర్ ( కమల హాసన్ 5 ) గోవిందుని హత మార్చాలని ఇండియాకి ప్రయాణం కడతాడు. బయో వైరస్ వెపన్ కోసం గోవిందూ, ఆ రెండింటి కోసం ఫ్లెచరూ, అతని ప్రేయసీ, అతన్ని చంపాలని జపనీస్ ఫైటరూ ఒకరి నొకరు చేజ్ చేసుకోవడంతో కథ పాకాన పడుతుంది.
 
ఈ లోగా బలరాం '''నాడార్''' ( కమల హాసన్ 6 ) అనే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో చిక్కి, టెర్రరిస్ట్ గా అనుమానింప బడతాడు. అందరి కళ్ళూ కప్పి తప్పించుకుంటాడు గోవింద్. బయో వైరస్ పెట్టె కోసం సరాసరి చిదంబరంలో ఉన్న ఓ వైష్ణవ కుటుంబాన్ని కలవడానికి వెళతాడు. అక్కడే లక్ష్మీ ( ఆసిన్ ) అనే అమ్మాయి పరిచయ మవుతుంది. ఈ లోగా బయో వైరస్ బాక్స్ పార్సిల్ '''లక్ష్మి బామ్మ''' ( కమల హాసన్ - 7 )క్రిష్ణవేణి చేతిలో పడుతుంది. అది కాస్తా ఊరేగింపులో గోవిందరాజు విగ్రహం లో జార విడుస్తుంది క్రిష్ణవేణి . అనుకోని హఠాత్పరిణామ క్రమంలో ఆ విగ్రహము, లక్ష్మితో కలసి పారిపోతాడు గోవింద్. అతన్ని ఫ్లెచర్, బలరాం నాడార్ ఇద్దరూ వెంబడిస్తూనే ఉంటారు. బయో వైరస్ టెంపరేచర్ పెరగ కుండా చూడాలని గోవింద రాజు విగ్రహాన్ని ఓ ఊరి చివర స్మశానం దగ్గర గోతిలో కప్పెడతాడు. అక్కడే ఇసుక స్మగ్లర్స్ తో గొడవపడతాడు గోవింద్. ఈలోగా ఇసుక స్మగ్లర్ బండారాన్ని బయట పెట్టే నిమిత్తమై '''పుణ్యకోటి''' ( కమల హాసన్ – 8 ) అనే అతను వస్తాడు. వాళ్ళని తప్పించుకొని వెళుతూ ఓ వాన్ యాక్సిడెంట్ లో పొడుగాటి '''కరీముల్లా''' ( కమల్ హాసన్ - 9 ) అనే ముస్లిం కుటుంబాన్ని కలుస్తాడు. గాయపడ్డ కరీముల్లా తల్లిని ఆసుపత్రిలో చేర్చే సమయంలో కేన్సర్ వ్యాధితో ఉన్న '''అవతార్ సింగ్''' ( కమల్ హాసన్ – 10 ) అతని భార్య ( [[జయప్రద]] ) నీ కలుస్తాడు. ఇలా అనేక పాత్రలన్నీ ఒక దాని వెంబడి ఒకటి వస్తాయి. గోవింద్ బయో వైరస్ ని ఎలా రక్షించాడు? ఫ్లెచర్ నుండి ఎలా తప్పించుకున్నాడు ? జపనీస్ ఫైటర్ పగ తీరిందా? బలరాం నాడార్ గోవిందుని టెర్రరిస్ట్ గా పట్టుకున్నాడా? పుణ్యకోటీ, ఇసుక స్మగ్లర్ల గొడవ తీరిందా? కేన్సర్ వ్యాధి గురైన అవతార్ సింగ్ కీ ఈ కథకీ సంబంధం ఏమిటి? ఏభై ఏళ్ళ క్రితం చనిపోయిన బామ్మ కొడుకు పోయిన సంగతి తెలుసుకుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు మిగతా కథ! <ref name=navatarangam>నవతరంగం వెబ్సైట్ నుండి[http://navatarangam.com/?p=497 దశావతారం సినిమా గురించి] [[జూన్ 16]], [[2008]]న సేకరించబడినది.</ref>
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/దశావతారం_(2008_సినిమా)" నుండి వెలికితీశారు